Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 20th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: పెళ్లి చేసుకున్నావా అని విహారిని అడిగిన యమున.. ఆదికేశవ్ పరిస్థితి విహారితో చెప్పిన రాజీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode స్వామీజీ చెప్పినట్లు నీకు ఇంతకు ముందే పెళ్లి అయిందా అని యమున విహారిని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అందరూ మనిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకొని ఒకటి అవుతామా అని ఎదురు చూస్తున్నారని నువ్వు ఎందుకు బావ ఇంతలా ఆలోచిస్తున్నావ్ అని సహస్ర విహారి చేయి పట్టుకొని అడుగుతుంది. పెళ్లి అని మాట వస్తే అందరూ చాలా సంతోషిస్తారు కానీ నువ్వు ఎందుకు బావ డల్‌గా ఉన్నావో అర్థం కావడం లేదని బావ అని సహస్ర అంటుంది.
విహారి: మనసులో ఒక పక్క అమ్మ కలవాలి అనుకుంటున్న కుటుంబం. మరోవైపు నా వల్ల ఓ ఆడపిల్లకి జరిగిన అన్యాయం. ఇప్పుడు ఎవరికి న్యాయం చేసినా మరొకరికి అన్యాయం చేసిన వాడిని అవుతా.
పద్మాక్షి: విహారి నీ మనసులో ఏమైనా ఉంటే మాతో చెప్పు అంతే కానీ నీ ప్రవర్తనతో మాకు లేని పోని అనుమానాలు వచ్చేలా చేయకు.
లక్ష్మీ: మనసులో విహారి గారు నా గురించి ఆలోచించకండి మీ కుటుంబం కోసం ఆలోచించండి
విహారి: సరే నేను సరే అంటే మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంటే అలాగే కానివ్వండి. ముహూర్తం ముందుకు జరపండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
సహస్ర: బావ మేం అందరం అడుగుతున్నామని ఒప్పుకోలేదు కదా నీ ఇష్టప్రకారమే ఒకే అన్నావ్ కదా.
అంబిక: విహారి నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉండటం వల్ల కాసేపు ఇక్కడ సునామీ వచ్చినట్లు అయింది.
యమున: నాన్న విహారి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు సహస్రకి పెళ్లి అయితే మీ జంటని చూసి సంబరపడిపోవాలని ఉంది.
విహారి: నువ్వు హ్యాపీనే కదా అమ్మ.
లక్ష్మీ: అమ్మా నీ పూజ మొదలు పెట్టానో లేదో ఇంట్లో శుభకార్యం మొదలైంది. ఈ పూజ నేను పూర్తి చేస్తాను. నువ్వు మాత్రం విహారిగారి, సహస్రల పెళ్లికి ఏ ఆటంకం లేకుండా చూడమ్మా. నాన్న ఆపరేషన్‌కి 25 లక్షలు ఎలా సర్దుబాటు చేయాలో నాకు అర్థం కావడం లేదు ఈ సమస్యకి కూడా నువ్వే దారి చూపించు తల్లి.
విహారి: కనక మహాలక్ష్మీకి అన్యాయం చేశాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూడాలి.
యమున: విహారి.. నీతో కొంచెం మాట్లాడాలి. మొన్న నేను స్వామీజీ దగ్గరకు వెళ్తే జాతకం ప్రకారం నీకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని అన్నారు. విహారి షాక్ అయిపోతాడు. ఒకప్పుడు మీ నాన్నగారికి ప్రమాదం ఉందని చెప్పింది ఆయనే. ఆయన చెప్పినట్లే మీ నాన్న గారు మనకు దక్కకుండా పోయారు. బిజినెస్‌లో నష్టం వస్తుందని మీ తాతయ్య గారికి ప్రమాదం ఉందని చెప్పారు అవన్నీ జరిగాయి. ఈ విషయంలో నాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. నాన్న నేను ఓ విషయం అడగనా.
విహారి: అడుగు అమ్మా.
యమున: నీ జీవితంలో కూడా.
విహారి: అంటే నేను నీ దగ్గర ఏమైనా దాచానని అనుకుంటున్నావా.
యమున: ఇది నీ మీద అనుమానం కాదు నాన్న స్వామీజీ గారి మీద నమ్మకం అందుకే ఇన్ని సార్లు ఆలోచించాల్సి వస్తుంది.
విహారి: అమ్మా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు.
యమున: నువ్వు నాకు ఈ భరోసా ఇస్తే చాలు నాన్న.
అబద్ధం మీద అబద్ధం చెప్తున్నానని మొదటి సారి అమ్మకి అబద్ధం చెప్పానని విహారి చాలా బాధ పడతాడు. మరోవైపు పండు లక్ష్మీ కోసం జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తాడు. రోజంతా ఉపవాసం చేస్తే నీకు ఇబ్బంది అని అంటాడు. భర్త లేకుండా జీవితాంతం బతికేస్తా అంటున్నావ్ కానీ భర్త కావాలి అనుకోవడం లేదని పండు అంటాడు. మనస్ఫూర్తిగా తాను అమ్మవారిని కోరుకుంటున్నానని ఆయన మనసు మారి నువ్వు ఆయన ఒకటి అవ్వాలని అంటాడు. మరోవైపు ఆదికేశవ్ కూతురు అల్లుడి పెళ్లి ఫొటోలు చూసి మురిసిపోతాడు. కూతుర్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతాడు. మరోవైపు గౌరీ భర్త పరిస్థితి తలచుకొని బాధ పడుతుంటుంది.
రాజీ రావడంతో రాజీతో చెప్పుకొని బాధ పడుతుంటుంది. ఇక ఆరు బయట ఉన్న ఆదికేశవ్ విపరీతంగా దగ్గు వస్తుంది. గౌరీ, రాజీ చాలా టెన్షన్ పడతారు. తొందరగా ఆపరేషన్ చేయించాలని రాజీ పెద్దమ్మతో అంటుంది. రాజీ లక్ష్మీకి విషయం చెప్తా అంటే గౌరీ వద్దని అంటుంది. దాంతో రాజీ కనకానికి విషయం చెప్పకపోయినా విహారికి చెప్పినా ఏదో ఒకరకంగా సాయం చేస్తాడనుకొని విహారికి కాల్ చేస్తుంది. రాజీ విహారితో ఆదికేశవ్ ఆరోగ్య పరిస్థితి చెప్తుంది. ఆపరేషన్ చేయించాలని అందుకు 25 లక్షలు అవసరం అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.