Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 6th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఈసారి పెళ్లి ఆగేలా లేదు.. సహస్ర పక్కా ప్లాన్ వర్కౌట్ అవుతాయా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ చేతనే సహస్ర అన్నీ పెళ్లి పనులు చేయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పండుకి తన పెళ్లి గురించి మాట్లాడొద్దని అంటుంది. తన తల రాత ఎలా ఉంటే అలా అవుతుంది. మొదటి నుంచి విహారి, సహస్రమ్మల పెళ్లి జరిగాలి అనుకున్నారు. నేనే మధ్యలో అనుకోకుండా వచ్చా నేను వెళ్లిపోతా అంటుంది. ఇక ఒకాయన వచ్చి విహారికి బట్టలు ఇవ్వమని అంటారు. పండు తీసుకొని వెళ్తాడు. మరొకామె వచ్చి లక్ష్మీకి తాళి బొట్టు మెట్టెలు లక్ష్మీకి వచ్చి దేవుడి దగ్గర పెట్టమని చెప్తారు.
లక్ష్మీ వాటిని తీసుకొని వెళ్లి దేవుడి దగ్గర పెడుతుంది. తనకు కొండంత అండగా ఉన్న యమునమ్మ గారు ఈ ఇంట్లో తలెత్తుకొని బతకాలి అని సహస్ర ఆశలు నెరవేరాలని ఎలా అయినా ఈ పెళ్లి జరగాలి అని మొక్కుకుంటుంది. విహారి లక్ష్మీని తలచుకొని బాధ పడుతూ ఉంటాడు. ఇంతలో పండు వెళ్లి బట్టలు ఇస్తాడు. విహారి పండుని పిలిచి నాతో ఏమైనా మాట్లాడాలా అంటాడు.
పండు: ఏం లేదు బాబు.
విహారి: నన్ను ఎవరూ ఏం అడగరేంట్రా కనీసం నువ్వు అయినా నోరు తెరిచి అడుగురా.
పండు: పనోడిని పైగా పరాయి వాడిని నాకే ఇంత బాధగా ఉంటే మీరు లక్ష్మీమ్మ ఇంకెంత బాధ పడుతున్నారో నేను ఊహించగలను బాబు. కళ్ల ముందే నన్ను అన్నలా చూసుకుంటున్న ఆ లక్ష్మీమ్మకి ఇంత అన్యాయం జరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా బాబు.
విహారి: దేవుడు ఏదో ఒకలా బయట పడేస్తాడు అనుకున్నా కానీ ఇంత వరకు వచ్చిన తర్వాత ఏం దారి లేదని అర్థమైంది బాధ తట్టుకోలేకపోతున్నా పండు అని పండుని హగ్ చేసుకొని ఏడుస్తాడు.
పండు: ఏం జరిగినా ఎవరో ఒకరు నష్టపోతారు. జాగ్రత్తగా చూసుకోండి బాబు. మీ లాంటి మంచి మనిషికి ఆ దేవుడు మంచే చేస్తాడు.
విహారి: నా లాంటి పరిస్థితిలో ఎవరూ ఉండకూడదు.
లక్ష్మీని యమున పిలిచి చీర ఇస్తుంది. పెళ్లి మన వాళ్లుతో మాత్రమే జరిపిస్తున్నాం కదా మన వాళ్లు అంటే నువ్వు కూడా అందుకే చీర కొన్నానని చెప్పి ఇస్తుంది. లక్ష్మీ చీర కట్టుకొని రెడీ అవుతుంది. చాలా అందంగా ఉన్నావ్ అని యమున పొడుగుతుంది. నీ భర్తని ప్రశ్నిస్తా అతన్ని ప్రశ్నించి మిమల్ని కలుపుతానని అంటుంది. లక్ష్మీ యమున హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఇద్దరూ పెళ్లి పనులు చేద్దామని బయల్దేరుతారు. పెళ్లి పనులు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. పెళ్లి కూతుర్ని గౌరీ పూజకి పిలుస్తారు. సహస్ర అందరూ తీసుకెళ్లి కల్యాణ మండపం మీదకు తీసుకెళ్తారు. పెళ్లి బాసికం లేకపోవడం చూసిన కాదాంబరి అడుగుతుంది. లక్ష్మీని తీసుకురమ్మని సహస్ర చెప్తుంది.
వసుధ వెళ్తానని అంటే పద్మాక్షి పని మనిషికి పని చేయనీయవేంటి అని లక్ష్మీ తీసుకొస్తుంది. సహస్ర లక్ష్మీకే బాసికం కట్టమని అంటుంది. అందరూ దానితో కట్టడం ఏంటి అని అంటారు. లక్ష్మీ హస్తవాసం మంచిది అని మా అత్తయ్య నమ్ముతుంది అందుకే నేను కట్టించుకుంటా అని అంటుంది. యమున వెళ్లమని అంటే లక్ష్మీ వెళ్లి సహస్రకి బాసికం కడుతుంది. సహస్రతో గౌరీ పూజ చేయిస్తారు. విహారి తండ్రి ఫొటో చూసుకొని ఏడుస్తుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















