Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: ఆఫీస్‌లో లక్ష్మీ సహస్రలకు పోటీ.. ఇంటికొచ్చేసిన డాక్టర్.. సహస్ర దొరికిపోతుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీని ఆఫీస్‌కి దూరం చేయాలని సహస్ర ఆఫీస్‌కి వెళ్లడం విహారి ఇద్దరికీ ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ ఇంటి నుంచి బయటకు వెళ్తే విహారి లక్ష్మీతో వేరే కాపురం పెట్టేస్తాడని బయపడిన సహస్ర లక్ష్మీని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుతుంది. అంబిక లక్ష్మీ దగ్గరకు వెళ్లి నిన్ను చూస్తుంటే విహారి కంపెనీని నీ పేరున రాయించుకునేలా ఉన్నావ్. ఎవరికి తెలుసు నీ స్కెచ్‌లు అని అడుగుతుంది. నేను విహారిగారి ఫ్యామిలీకి సాయం చేయడమే నాకు తెలుసు అంటుంది.
లక్ష్మీ పాత న్యూస్ పేపర్లు తిరగేయడం చూసిన అంబిక వీటితో నీకు ఏం పని అని అడిగితే విహారి గారి తండ్రి కేసుకు సంబంధించి ఏమైనా తెలుస్తుందని చూస్తున్నా అని చెప్తుంది. అంబిక షాక్ అవుతుంది. దొంగ కన్నీరు కార్చి ఎవరు ఎన్ని చేసినా మా అన్నయ్యని తిరిగి తీసుకురాలేరు.. అన్నయ్య లేని లోటు తీర్చలేరు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీస్‌లో స్టాఫ్ అంతా విహారి, లక్ష్మీలకు వీ క్రాఫ్ట్ కంపెనీకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారని అందుకే అని చెప్పి బొకే ఇచ్చి ఆహ్వానిస్తారు. ఇద్దరికీ థ్యాంక్స్ చెప్తారు. అంబిక రగిలిపోతుంది. చారుకేశవ మనసులో ఈ లక్ష్మీకి ఎందుకు విహారి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని అనుకుంటాడు.
మరోవైపు ఆఫీస్‌లో సహస్ర గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఆఫీస్‌కి కొత్త బాస్ వస్తున్నారు అని అంబిక స్టాఫ్‌తో చెప్తుంది. సహస్ర విహరి దగ్గరకు వచ్చి ఎలా ఉంది నా సర్‌ఫ్రైజ్ ఉంది అని అంటుంది. నువ్వు ఆఫీస్‌కి ఏంటి అని అడుగుతాడు. ఇన నుంచి వస్తా అని అంటుంది. అంబిక అందరితో విహారి భార్య వచ్చారు వెల్ కమ్ చెప్పండి అంటుంది. అందరూ సహస్రకు వెల్‌కమ్ చెప్తారు. తర్వాత విహారికి దగ్గరగా మీద పడినట్లు లక్ష్మీ విహారితో మాట్లాడుతుంది. అది చూసి సహస్రతో అంబిక చూడు ఎలా మీద పడిపోతుందో అని అంటుంది. సహస్ర లోపలికి వెళ్లగానే విహారి సహస్రతో లక్ష్మీ చెప్పినట్లు విను అని అంటాడు. దానికి సహస్ర నేను లక్ష్మీ చెప్పింది వినడానికి రాలేదు లక్ష్మీ ప్రాజెక్ట్ నేను తీసుకోవడానికి వచ్చాను అని చెప్తుంది. విహారి అదేంటి అని అడుగుతాడు. లక్ష్మీ వల్లే ఇదంతా సాధ్యం అయింది అని అంటాడు.
లక్ష్మీ ఇక్కడి వరకు చేసింది కదా నేను ఇక్కడ నుంచి చూసుకుంటా అని అంటుంది. అంబిక కూడా సహస్రకు సపోర్ట్ చేస్తుంది. విహారి మాత్రం ఒప్పుకోడు. కానీ లక్ష్మీ సహస్రమ్మ గారు చూసుకుంటారు అని అంటుంది. దానికి విహారి నువ్వు కూడా లక్ష్మీలా ప్రజెంటేషన్ ఇవ్వు ఎవరు చక్కగా ప్రజెంటేషన్ ఇస్తే వాళ్లే కంటిన్యూ అవుతారు అంటారు. అంబిక సహస్రతో నీ రేంజ్ ఏంటి తన రేంజ్ ఏంటి అని అంటుంది. లక్ష్మీ వాళ్లతో మీరు ఎన్ని అయినా అనుకోండి కానీ వీ క్రాఫ్ట్‌కి మంచి పేరు వస్తే అంతే చాలు అని అంటుంది. మరోవైపు సహస్రకి డాక్టర్ కాల్ చేస్తే సహస్ర కట్ చేస్తుంది.
సహస్ర వాళ్లు ఇంటికి వచ్చే సరికి డాక్టర్ ఇంటికి వస్తుంది. డాక్టర్‌ని చూసి సహస్ర షాక్ అయిపోతుంది. ఆ డాక్టర్ ఏంటి మన ఇంటికి వచ్చింది అని విహారి సహస్రని అడుగుతాడు. మీరేంటి డాక్టర్ ఇలా అని సహస్ర అడుగుతుంది. దానికి డాక్టర్ నిన్ను డిశ్చార్జి చేసిన తర్వాత మళ్లీ రమ్మని చెప్పా కదా నువ్వు రాలేదు అందుకే నేనే వచ్చానని అంటుంది. డాక్టర్‌కి పద్మాక్షి, యమున చాలా థ్యాంక్స్ చెప్తారు. సహస్రని చెక్ చేస్తా అని డాక్టర్ అనడంతో సహస్ర డాక్టర్‌ని గదిలోకి తీసుకొస్తుంది. ఏంటి సరా సరి వచ్చేశారు అని అంటే నువ్వు డబ్బు వేస్తా అన్నావ్ వేయలేదు అని అంటుంది. నేను ఇవ్వను అని అనుకున్నారా ఇలా ఇంటికి వస్తే ఎలా అంటుంది. మీకు పాతిక లక్షలు ఇవ్వాలి కదా అని చెప్పి సూట్ కేస్ ఇచ్చి లెక్కపెట్టుకోమని అంటుంది.
డాక్టర్ డబ్బు తీసుకొని వెళ్తుంది. లక్ష్మీ టీ తీసుకెళ్తూ డాక్టర్‌ని ఢీ కొడుతుంది. దాంతో డబ్బు కింద పడిపోతుంది. అందరూ డబ్బు చూసి షాక్ అవుతారు. అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు ఎలా అని సహస్ర అనుకుంటుంది. తర్వాత లక్ష్మీని లాగిపెట్టి కొట్టి కళ్లు కనిపించడం లేదా అని అడుగుతుంది. దానికి విహారి సహస్ర లక్ష్మీని కొట్టడం గురించి తర్వాత మాట్లాడుతా ముందు ఇంత డబ్బు ఏంటి అని అడుగుతాడు. అందరూ అంత డబ్బు డాక్టర్‌కి ఏంటి అని సహస్రని ప్రశ్నిస్తుంది. దాంతో పద్మాక్షి కూతురి పరిస్థితిని అర్థం చేసుకొని ఆ డబ్బు నేనే ఇచ్చాను అని అంటుంది. నా కూతురిని కాపాడిన డాక్టర్ పిల్లలకు గుండె ఆపరేషన్‌కి డబ్బు కావాలి అంటే నేనే ఇచ్చాను అని అంటుంది. అందరూ పద్మాక్షిని పొగుడుతారు. లక్షల్లో మీ డొనేషన్లు ఉంటాయి అన్నమాట అని అంబిక అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్ ది లవ్ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్ ప్రశ్నలు!





















