Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 10th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సహస్రకు యాక్సిడెంట్.. చివరి క్షణాలని చెప్పేసిన డాక్టర్.. ఇక కడ చూపులే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్రకు యాక్సిడెంట్ అవ్వడం ఇక సహస్ర బతకదు అని డాక్టర్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర తాళి పట్టుకొని రోడ్ల మీద పరుగులు పెడుతుంది. సహస్ర వెంట అంబిక, పండు, విహారిలు పరుగులు పెడతారు. ముగ్గురు మూడు వైపుల రావడంతో సహస్ర ఆగి ఎదురుగా వస్తున్నా కారు వైపు పరుగులు పెడుతుంది. కారు ఢీ కొట్టి సహస్ర పడిపోతుంది. తలకు గాయం అయి రక్తం వస్తుంది. సహస్ర స్ఫ్రుహాలో ఉండదు. అంబిక, విహారి, పండు చాలా కంగారు పడతారు.
పండు పరుగున వెళ్లి అటుగా వచ్చిన ఆటో ఆపుతాడు. సహస్రని అందులో ఎక్కించుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటారు. దారిలో సహస్ర పట్టుకున్న తాళికి రక్తం వస్తుంటుంది. సహస్ర లేచి నేను చచ్చిపోతున్నా బావ అని అంటుంది. నీకేం కాదు సహస్ర అని విహారి సహస్రని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఇంట్లో లక్ష్మీ తలకు గాయం అవ్వడంతో వసుధ పసుపు పెడుతుంది.
లక్ష్మీ యమునతో ఒకసారి విహారి బాబుగారికైనా అంబిక అమ్మకి అయినా కాల్ చేసి సహస్ర అమ్మగారి గురించి అడగమని అంటుంది. ఇంతలో పద్మాక్షి వచ్చి నా కూతురు బతికిందా చనిపోయిందా అడగమని అంటున్నావా అని లక్ష్మీ మీద కోప్పడుతుంది. కాదాంబరి లక్ష్మీని ఉద్దేశించి శనిలా దాపరించిందని తిడుతుంది. నా మనవరాలి ఉసురు నీకు తగులుతుందే అని తిడుతుంది. దీన్ని ఇలా కాదు అని పద్మాక్షి ఆవేశంగా వెళ్లి లక్ష్మీ లగేజ్ తీసుకొచ్చి లక్ష్మీ ముఖం మీద విసిరి లక్ష్మీని లాక్కొని వెళ్తుంది.
సహస్రని విహారి వాళ్లు హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. డాక్టర్‌ని పిలిచి విషయం చెప్తారు. డాక్టర్ బ్లడ్ చాలా పోయింది అని ఆపరేషన్ చేయాలి అని ఐసీయూని తీసుకెళ్తుంది. సహస్రకి ట్రీట్మెంట్ జరుగుతుంది. చేతిలో తాళి నుంచి సహస్ర రక్తం కారుతూ ఉంటుంది. బయట నుంచి విహారి సహస్ర పరిస్థితి చూసి ఏడుస్తాడు. ఇలా అయింది ఏంటి విహారి అని అంబిక అంటే అంతా నా వల్లే అత్తయ్య అని విహారి అంటాడు. ఇంట్లో అందరికీ విషయం చెప్పాలి అని విహారి అంటాడు. అంబిక ఆపి అక్క ఇలా సహస్రని చూస్తే తట్టుకోలేదని సహస్ర కోలుకుంటే చెప్దామని అంటుంది.
పద్మాక్షి లక్ష్మీని లాక్కెళ్లి బయట తోసేస్తుంది. ఇక్కడి నుంచి పోవే అని తిడుతుంది. నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టింది. నీ వల్ల నా కూతురి పెళ్లి ఆగిపోయింది. నువ్వు ఈ ఇంట్లో ఉండగా వాళ్లని కలవనివ్వవు అని తిడుతుంది. ఈసారి కూడా పెళ్లి నీ వల్లే ఆగిపోయిందని అంటుంది. యమున గొడవ వద్దని అంటే పద్మాక్షి నువ్వు నాకు ఏం చేయాలో చెప్పకు అని అంటుంది. సహస్రకు ఏమైనా అయితే ముఖ్య కారణం ఇదే అని అంటుంది. ఇక లక్ష్మీ తాళి పట్టుకొని నా కూతురి మెడలో తాళి పడకుండా చేశావ్ కదే ఇంకా నీ మెడలో ఈ తాళి ఎందుకు అంటుంది. దానికి లక్ష్మీ తన తాళి వదలమని అంటుంది. అందరూ పద్మాక్షిని ఆపడానికి ప్రయత్నిస్తారు. అందరూ పద్మాక్షిని ఆపి ముందు సహస్ర గురించి తెలుసుకుందామని అంటారు. నా కూతురు క్షేమంగా వచ్చే వరకు నువ్వు ఇంట్లోకి రావొద్దు ఎవరైనా దాన్ని లోపలికి తీసుకొస్తే వాళ్లకి ఇదే గతి పడుతుందని అంటుంది.
విహారి వాళ్లు టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ వచ్చి సహస్ర కండీషన్ చాలా సీరియస్‌గా ఉందని తన కండీషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని తన బాడీ ట్రీట్మెంట్‌కి సహకరించడం లేదని అంటారు. విహారి, అంబిక వాళ్లు షాక్ అయిపోతారు. ఒకసారి సహస్రని చూస్తామని లోపలికి వెళ్తారు. ఇద్దరూ సహస్రని చూసి ఏడుస్తారు. మీకు దూరంగా ఉండే వాళ్లని కబురు చేయండి సహస్ర ఇక బతకదు అని డాక్టర్ చెప్తుంది. విహారి, అంబిక కుప్పకూలిపోతారు. డాక్టర్ వాళ్లని బయటకు పంపేస్తుంది. ఇక అంబిక ఇంటికి ఫోన్ చేస్తుంది. పద్మాక్షి కాల్ లిఫ్ట్ చేసి సహస్ర గురించి తెలిసిందా అని ఏడుస్తుంది. అంబిక నీళ్లు నములుతుంది.
అంబిక పద్మాక్షితో అక్క నువ్వు కంగారు పడకు నేను ఒక మాట చెప్తా అంటుంది. సహస్రకు యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. అందరూ చాలా కంగారు పడతారు. పద్మాక్షి ఏడుస్తుంది. హాస్పిటల్ డిటైల్స్ చెప్తుంది. ఇప్పుడే వస్తున్నా అని పద్మాక్షి వాళ్లు పరుగులు తీస్తారు. యమున, వసుధలు లక్ష్మీకి విషయం చెప్తారు. నా వల్లే సహస్రకి ఈ పరిస్థితి అని విహారి ఏడుస్తాడు. తనకు లేనిపోని ఆలోచనలు నేను కల్పించాను అని బాధపడతాడు. డాక్టర్ పేషెంట్ రిపోర్ట్స్ తీసుకురమ్మని నర్స్‌తో చెప్తుంది. తర్వాత డాక్టర్ దగ్గర సహస్ర లేచి నొప్పి అంటుంది. నీకు యాక్సిడెంట్ అవ్వడం నిజం నీకు దెబ్బలు తలగడం నిజం కానీ ప్రాణం పోయే అంత పరిస్థితి లేదు అంటుంది. ఇక నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని సహస్ర అంటుంది. డాక్టర్ సహస్రని మాస్క్ పెట్టుకొని పడుకోమని అంటుంది.
పద్మాక్షి విహారికి కాల్ చేసి సహస్ర జాగ్రత్తరా దానికి ఏమైనా అయితే నేను బతకలేను అని అంటుంది. డాక్టర్ వస్తే విహారి కండీషన్ అడుగుతాడు. కాసేపట్లో కోమాలోకి వెళ్తుంది. బ్రెన్ డెడ్ అవుతుంది. అందుకే మీ వాళ్లు ఎవరైనా ఉంటే చివరి చూపు చూసుకోవడానికి రమ్మని చెప్పమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















