Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 7th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: అంబికతో కోట్లు కట్టించిన లక్ష్మీ.. విహారి కాస్ట్‌లీ గిఫ్ట్.. ఎమోషనలైన మదన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ కోసం మదన్ బంగారం, బట్టలు ఇంటికి తీసుకురావడం విహారి లక్ష్మీకి ఫోన్ గిఫ్ట్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ ఆఫీస్‌కి వచ్చి అంబికకు షాక్ ఇస్తుంది. లక్ష్మీ దగ్గరకు వెళ్లి అంబిక ఇంటికి వెళ్లిపో అని అంటే గంటలో డబ్బు కడితే వెళ్లిపోతా అని రివర్స్‌లో అంబికకు వార్నింగ్ ఇస్తుంది. ఇక విహారి లక్ష్మీ దగ్గరకు వచ్చి మీ నాన్న ఫోన్ చేశారు నీ ఫోన్ అవ్వడం లేదు అంటే దానికి లక్ష్మీ మొన్న చేయి కాలిన రోజు ఫోన్ పోయింది అంటుంది. ఇక ఆఫీస్‌కి వచ్చావ్ ఇంటి దగ్గర ఉంటావ్ అనుకుంటే అంటే కొంచెం పని ఉందని లక్ష్మీ చెప్తుంది. మదన్ పెళ్లి షాపింగ్‌ని ఇంటికి తీసుకొచ్చాడు. యమున, పద్మాక్షి, సహస్ర, వసుధ, మదన్‌లు షాపింగ్ చేస్తారు. లక్ష్మీకి ఇష్టమైనట్లు ట్రెడిషనల్గా చూపించమంటాడు.
పద్మాక్షి: మదన్ పెళ్లాన్ని ఎక్కువ ప్రేమిస్తే తనకు భర్తవి కాదు బానిస అయిపోతావు.
మదన్: ఆంటీ నేను నా లైఫ్‌లో ఇష్టం అయిన వాళ్లు అంతా దూరం అయిపోయారు. యాక్సిడెంట్‌లో అమ్మానాన్నలు దూరం అయిపోయారు. ఇక్కడికి వచ్చాక లక్ష్మీని ఇష్టపడ్డాను. కానీ తను ఎక్కడ నాకు నో చెప్పి దూరం అవుతుందా అని టెన్షన్ పడ్డాను. విహారి, పెద్దమ్మా ఒప్పించారు.
వసుధ: మాకు మా విహారి ఎంతో నువ్వుం అంతే మదన్.
మదన్: ఏదో గుర్తొచ్చి మీతో చెప్పుకున్నాను అని ఏడుస్తాడు.
సహస్ర: ఏయ్ చూడు నువ్వు మరీ ఇంత ఎమోషనలా అలా ఏడవకూడదు.
మదన్: సరే సరే నాకు ఇంకో పని ఉంది మీరు సెలక్ట్ చేయండి
పద్మాక్షి: మదన్ చాలా సెన్సిటివ్‌గా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నీ తోక అటు ఇటు చేస్తే మదన్ పిచ్చోడు అయిపోతాడు.
యమున: అలా ఏం జరగదు వదిన.
లక్ష్మీ: చిటికె వేసి మేడం మీకు ఎక్కువ టైం లేదు.
అంబిక: నీకు అంత వార్నింగ్ ఇచ్చినా మారవా
లక్ష్మీ: నేనేం తప్పు చేశాను మారడానికి తప్పు చేసింది మీరు. సొంత కుటుంబాన్ని మోసం చేసే మీరు మారాలి. మీరు ఆ అమౌంట్ సెటిల్ చేస్తారా విహారి బాబు గారి దగ్గరకు వెళ్లాలా.
అంబిక: చూడు లక్ష్మీ నువ్వు చేసిన దానికి నేను గుణం పాఠం చెప్తా.
లక్ష్మీ: మీ టైం అయిపోయింది నేను విహారి గారి దగ్గరకు వెళ్తున్నా
అంబిక: ఏయ్.. అని లక్ష్మీ విహారి దగ్గరకు వెళ్లడంతో తిరిగి 57 కోట్లు కట్టేస్తుంది. విహారికి అకౌంటెంట్ చెప్తాడు. లక్ష్మీ అవును అని వార్నింగ్ ఇస్తే వాళ్లు తిరిగి కట్టారని చెప్తుంది. విహారి చాలా సంతోషిస్తాడు.
లక్ష్మీ కోసం అందరూ చప్పట్లు కొడతారు. చారుకేశవ అంబిక దగ్గరకు వెళ్లి ఓహో నీ నుంచి ఆ డబ్బు లాగిందా అని సెటైర్లు వేస్తాడు. నువ్వేం స్కామ్ చేశావని తెలిస్తే నువ్వు అత్త అని కూడా చూడదు అని చెప్తాడు.
విహారి లక్ష్మీని ఇంటికి తీసుకెళ్తూ నీకో సర్‌ఫ్రైజ్ అని అంటాడు. కారు ఆపి లక్ష్మీకి కొత్త ఫోన్ గిఫ్ట్ ఇస్తాడు. నీ పాత ఫోన్ నుంచి సిమ్ తీసి కొత్త ఫోన్‌లో వేసి బాగా ఇష్టపడిన వారికి ఫోన్ చేయ్ అని విహారి అంటే లక్ష్మీ సరే అని ఫోన్‌లో సిమ్ వేసి విహారికి కాల్ చేస్తుంది. విహారి షాక్ అయిపోతాడు. తర్వాత నవ్వితే విహారి కూడా నవ్వేస్తాడు. అంబిక లక్ష్మీ చేసిన దానికి ఆలోచిస్తూ ఉంటే చారుకేశవ్ పాటలు పాడుతాడు. 500 వందలు వచ్చి నీ అకౌంట్ ఖాళీ కదా తీసుకో పండగ చేసుకో అని అంటాడు. లక్ష్మీ అంతు చూస్తా అని అంబిక లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. నా మీద గెలిచా అని విర్రవీగుతున్నావా అని అంటుంది. మీరు తప్పు చేసింది నేను సరిదిద్దాను అంటుంది లక్ష్మీ. మీ మోసం చేసి తీసుకున్నారు అంటే అంబిక లక్ష్మీని కొట్టడానికి వెళ్తే లక్ష్మీ పక్కకు వెళ్తుంది. అంబిక పడబోతే పట్టుకొని ఆవేశం అత్యాశ మీ పరువుకి అనర్థం అని అంటుంది. విహారి గారికి ఒక్క మాట చెప్తే చాలు కానీ ఆయనకు మీరు ఈ కుటుంబం అంటే ఇష్టం కాబట్టి చెప్పలేదని అంటుంది.
మదన్ లక్ష్మీ కోసం చాలా నగలు తెప్పిస్తాడు. అందరూ చూస్తుంటారు. విహారి కూడా ఉంటాడు. ఇక మదన్ లక్ష్మీ చేయి పట్టుకొని రా లక్ష్మీ అంటే లక్ష్మీ చేయి పట్టుకోగానే విదిలించుకోవడానికి ప్రయత్నిస్తే పద్మాక్షి కోపంగా చూడటంతో లక్ష్మీ మదన్ వెంట వస్తుంది. నీ కోసం మదన్ ఎన్ని ఏర్పాట్లు చేశాడో చూడు అంటుంది. ఇక ఆఫీస్‌కి వెళ్లనందుకు పద్మాక్షి తిడితే విహారి అత్తతో తను ఇంకెప్పుడు రాదు పెళ్లి అయితే అమెరికా వెళ్లిపోతుంది కదా అంటాడు. ఇక చారు కేశవ రెండు బ్యాంగిల్స్ నొక్కేస్తుంటే అంబిక చూసి బావ అంటే కంగారుతో అక్కడే పెట్టేస్తాడు. ఇక మదన్ లక్ష్మీకి నగలు సెలెక్ట్ చేసుకో అంటాడు. లక్ష్మీ ఏం అనకపోవడంతో నేను సెలక్ట్ చేస్తా అని రెండు గాజులు తీసి ఇచ్చి తీసుకోమంటాడు. లక్ష్మీ తీసుకోకపోవడంతో నచ్చలేదా అని వేరేవి సెలక్ట్ చేస్తాడు. లక్ష్మీ ఉలకదు పలకదు. దాంతో మదన్ విహారికి సెలక్ట్ చేయమంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!





















