Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 4th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ, మదన్‌లకు పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసిన విహారి.. లక్ష్మీ బ్యాగ్‌లో ఆ ఫొటోలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీని తనతో పెళ్లికి ఒప్పించమని మదన్ విహారిని కోరడం విహారి లక్ష్మీని బాగా చూసుకో అని మదన్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి దగ్గరకు మదన్ వెళ్తాడు. మదన్‌కి సారీ చెప్తాడు. తన డ్రీమ్ గర్ల్ లక్ష్మీ అని చెప్పనందుకు సారీ అంటాడు. లక్ష్మీ విషయంతో తనకు సపోర్ట్ కావాలని లక్ష్మీ తన ప్రేమని ఇంకా అంగీకరించలేదని నువ్వు చెప్తే లక్ష్మీ వింటుంది లక్ష్మీని ఒప్పించు అని మదన్ అంటాడు. విహారి ఇబ్బంది పడతాడు. ఇక మదన్ లక్ష్మీని ఒప్పిస్తానని ప్రామిస్ చేయమని విహరిని అడుగుతాడు. ఇంతలో సహస్ర వచ్చి ప్రామిస్ చేస్తుంది.
సహస్ర: మా బావకి కాబోయే భార్యని బావ తరఫున నేను ప్రామిస్ చేస్తున్నా. బావ లక్ష్మీ, మదన్ జోడీకి అందరూ ఒకే చేసేశారు. చివరకు అత్తయ్య కూడా ఒకే చేసింది. మదన్ మా పెళ్లి కంటే మీ పెళ్లే ముందు జరుగుతుందని చూడు. ఏది ఏమైనా మీ పెళ్లి త్వరగా జరిగిపోవాలి. అమెరికా వెళ్లాలి.
మదన్: అన్నీ అనుకున్నట్లు జరిగితే పెళ్లి వెంటనే అమెరికా ప్రయాణం. ఏయ్ విహారి నువ్వు ఏం మాట్లాడవేంట్రా.
సహస్ర: బావ మా పెళ్లి ఆగిపోయింది అనే బాధలో ఉన్నాడు.
మదన్: విహారి ఈ సారి మీ పెళ్లి చాలా గ్రాండ్‌గా జరుగుతుంది.
అంబిక: అదెంత దాని బతుకు ఎంత నన్నే బెదిరిస్తుందా రేపటిలో 50 కోట్లు కట్టమని వార్నింగ్ ఇస్తుందా చెప్తా అసలు రేపు అది ఆఫీస్‌కే రాకుండా చేస్తా.
మదన్ ప్రపోజ్ చేయడం గురించి లక్ష్మీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో లక్ష్మీ దగ్గరకు విహారి వస్తాడు. విహారి లక్ష్మీతో మాట్లాడుతాడు. ఇంతలో మదన్ వచ్చి నాతో పెళ్లికి లక్ష్మీని ఒప్పించడానికి వచ్చావని అని విహారికి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటాడు. దాంతో లక్ష్మీ హర్ట్ అయి వెళ్లిపోతుంది. అది చూసి మదన్ సిగ్గుతో వెళ్లిపోయింది కదా అంటాడు. తల్లిదండ్రులు లేని తనకు అండగా నిలిచావని అంటాడు. దానికి విహారి లక్ష్మీని జీవితాంతం సంతోషంగా చూసుకో చాలు అంటాడు. అప్పుడు మదన్ తనకు అందమైన జీవితం ఇస్తాను కన్నీళ్లు లేకుండా చూసుకుంటానని అంటాడు.
మరోవైపు భక్తవత్సలం ఆరు బయట ఉంటే అందరూ వస్తారు. ఇప్పటికిప్పుడు ప్రయాణం ఎందుకు అంటే ఇంట్లో పరిస్థితులు బాలేవని కుంభమేళా వెళ్తా అని అంటారు. కొడుకుకి అక్కడ పిండ ప్రధానం చేస్తే మంచి జరుగుతుందని అంటారు. దానికి పద్మాక్షి మన ఇంట్లో ఉన్న అని అని అందరికీ ఏలిననాటి శని ఏడేళ్లు కానీ మనకు పాతి కేళ్లగా ఉందని యమునను ఉద్దేశించి అంటుంది. ప్రయాణం మొదలు పెడతానని బామ్మని తీసుకురమ్మని అంటాడు. విహారి వెళ్తాడు. ఇంతలో పద్మాక్షి అన్నయ్యకే కాదు అన్నయ్య చావుకి కారణం అయిన వాళ్లకి కూడా నీళ్లు వదిలేసి రా అంటుంది. మరోవైపు అంబిక విహారి ఫొటోలను తీసుకెళ్లి లక్ష్మీ బ్యాగ్‌లో పెట్టేస్తుంది. తర్వాత సహస్ర దగ్గరకు వెళ్తుంది.
సహస్ర అంబికతో మదన్‌ని లక్ష్మీని ఒకటి చేసేస్తున్నా ఇక నా ప్రాబ్లమ్ క్లీయర్ అని సంతోషపడుతుంది. ఇంతలో అంబిక మదన్ కంటే విహారి బెటర్ అని లక్ష్మీ విహారిని టార్గెట్ చేసి మదన్‌ని రిజెక్ట్ చేస్తుందని అంటుంది. మదన్‌తో పెళ్లికి ఒప్పుకోదని విహారిని డీప్‌గా లవ్ చేస్తుందని సహస్రకి చెప్తుంది. సాక్ష్యాల కోసం లక్ష్మీ గది వెతుకుదామని ఇద్దరూ వెళ్తారు. లక్ష్మీ బ్యాగ్‌లో సహస్ర విహారి ఫొటోలు చూస్తుంది. కోపంతో బ్యాగ్ సర్ది కిచెన్‌లో ఉన్న లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. లక్ష్మీ ముందు బ్యాగ్ విసిరేసి నీ సూట్ కేస్‌లో ఏమున్నాయో చూడు అని విసిరేస్తుంది. బట్టలు ఉంటాయని లక్ష్మీ అంటే అయితే తీసి చూడు అంటుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. లక్ష్మీ బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. అందులో విహారి ఫొటోలు ఉంటాయి. లక్ష్మీతో పాటు అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి





















