Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 3rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీకి ప్రపోజ్ చేసిన మదన్.. విహారికి షాక్ ఇచ్చిన వసుధ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీకి మదన్ ప్రపోజ్ చేయడం లక్ష్మీ ఏడుస్తూ వెళ్లిపోవడంతో అందరూ లక్ష్మీని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ అంబిక చేసిన మోసం గ్రహించి రేపటిలోపు డబ్బు మొత్తం కట్టేయాలి అని చెప్తుంది. ఇక విహారి వస్తే ఇంటికి వెళ్దామని అంటాడు. లక్ష్మీ కారులో రాను అని ఆటోలో వస్తాను అంటే మాతో రావాల్సిందే అని విహారి అంటాడు. ఇక అంబిక ఓవర్ యాక్షన్ చేయకుండా రమ్మని చెప్తుంది. వెళ్తూ వెళ్తూ రేపటికి టాస్క్ ఉంది అంబిక మేడం సపోర్ట్ చేస్తే పూర్తి అయిపోతుందని అంటుంది.
మదన్ లక్ష్మీ ఫొటోలు ముందు వేసుకొని వాటితో మాట్లాడుతూ ఐలవ్‌యూ అని చెప్తాడు. ఇంతలో సహస్ర వచ్చి ఆ ఫొటోలను అడిగితే చెప్పవు అని లక్ష్మీకి ప్రపోజ్ చేయమని చెప్తుంది. రాత్రి లక్ష్మీ వాళ్లు ఇంటికి వస్తారు. అంబిక అమ్మని ఎలా అయినా మార్చాలి అని లక్ష్మీ అనుకుంటుంది. ఇంతలో తన గదిలో లక్ష్మీ గార్డెన్ ఏరియాకి ఒకసారి రా నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఇట్లు మదన్ అని రాసిన పేపర్ ఉంటుంది. అది చూసి లక్ష్మీ వెళ్తుంది. లక్ష్మీ గార్డెన్ ఏరియాకు వెళ్లసరికి అక్కడ ఒక్కసారిగా లైటింగ్ పెట్టి తర్వాత హర్ట్ బెలూన్స్ పడతాయి. ఆ తర్వాత మదన్ గులాబి పూల బొకే తీసుకొని వచ్చి మోకాల మీద నిల్చొని లక్ష్మీకి ఐలవ్‌యూ చెప్తాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. అందరూ వచ్చి నిల్చొంటారు. సరదాగా సెలబ్రేట్ చేస్తారు. మదన్ రింగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లక్ష్మీ అని అడుగుతాడు. లక్ష్మీ ఏడుస్తూ వెళ్లిపోతుంది. మదన్ ఫీలవుతాడు. లక్ష్మీ దగ్గరకు వసుధ వెళ్తే లక్ష్మీ వసుధని పట్టుకొని ఏడుస్తుంది. ఇంతలో యమున అక్కడికి వస్తుంది.
యమున: వసుధ నీకు లక్ష్మీకి పెళ్లి అయింది అని తెలుసా.
వసుధ: తెలుసు. ఈ మధ్యనే తెలిసిందమ్మా.
యమున: అవును వసుధ లక్ష్మీని చూస్తే నాకు చాలా బాధగా ఉంది.
వసుధ: ఈ పరిస్థితిలో మనం తనకు న్యాయం చేయలేం కదా వదిన.
యమున: చేయాలి ఎలా అయినా చేయాలి మనం తనకు న్యాయం చేయాలి. విహారి గురించి వసుధ చెప్పబోతే పండు ఆపుతాడు. లక్ష్మీ అతనెవరో నిన్ను మోసం చేసి వెళ్లిపోతే అతన్నే తలచుకొని ఉండిపోతావా. అతనే లేనప్పుడు అతను కట్టిన తాళి ఎందుకు లక్ష్మీ. నా మాట విను మదన్ చాలా మంచి వాడు. తనకు ముందు వెనక ఎవరూ లేరు ఆ విషయం గురించి ఆలోచించు. నీ జీవితానికి ఇదో కొత్త దారి అవుతుంది.
పద్మాక్షి: లక్ష్మీ బయటకు రావే. మదన్ నీకు అంత ప్రేమగా ప్రపోజ్ చేస్తే నువ్వేందుకే అలా ఏడుస్తూ వెళ్లిపోయావ్.
అంబిక: అక్క తన మనసులో ఇంకెవరో ఉన్నారేమో అందుకే అలా ఏడుస్తూ వెళ్లిపోయిందేమో.
కాదాంబరి: అయినా ఎంత అదృష్టం అమెరికా వాడు వచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కాదు అంటావెందుకు.
పద్మాక్షి: ఇది ఎంత అడిగినా చెప్పడం లేదు అంటే నాకు చాలా అనుమానంగా ఉంది.
నిజం చెప్పమని సహస్ర లక్ష్మీని పట్టుకొని నిలదీస్తుంది. లక్ష్మీని వదిలేయమని విహారి చెప్తాడు. ఇంతలో మదన్ వచ్చి లక్ష్మీని ఏం అనొద్దని తను ఎస్ చెప్పలేదు అంటే నో కూడా చెప్పలేదు కదా కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలని లక్ష్మీ చేతులు పట్టుకొని చెప్తాడు. అందర్ని పంపేస్తాడు. విహారి కూడా వెళ్లిపోతాడు. లక్ష్మీ మళ్లీ వసుధని పట్టుకొని ఏడ్వడం విహారి చూస్తాడు. నీ జీవితం ఏంటి ఇలా ఉందమ్మా అని వసుధ ఓదార్చుతుంది. వసుధ విహారి దగ్గరకు వెళ్లి సమస్యలు సృష్టించిన దేవుడే పరిష్కారం కూడా చూపిస్తాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!





















