Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 27th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీకి డెడ్ లైన్.. యమునని బతికించుకోవడానికి లక్ష్మీ భర్త ఎవరో చెప్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ తన భర్తని తీసుకురాకపోతే గన్‌తో కాల్చుకొని చచ్చిపోతా అని యమున చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ దగ్గరకు యమున వచ్చి తన ప్రాణాన్ని ఇంటి వారసుడిని కాపాడావని చిన్న దానివి అయిపోయావ్ లేదంటే నీ కాళ్లు కడిగేదాన్ని అని అంటుంది. అలా అనొద్దని విహారి, మీరు నాకు జీవితం ఇచ్చారని లక్ష్మీ అంటుంది. దాంతో పద్మాక్షి, అంబికలు వచ్చి పొగడ్తలు మొదలు పెట్టావా అని అంటారు. ఆ ప్రాజెక్ట్‌కి కారణం నువ్వే కాబట్టి నీ వల్ల ఇదంతా జరిగింది మేం ఏమంటామో అని కిందా మీద పడి విహారిని కాపాడేశావని అంటారు.
వసుధ, యమునలు లక్ష్మీని శాలువా కప్పి సన్మానించేలా ఉన్నారని అంబిక అనడంతో పద్మాక్షి దాని మాయలో పడొద్దని చెప్తుంది. ఇక అవన్నీ వదిలేసి నీ మొగుడు ఎక్కడున్నాడో చెప్పు లేదంటే మదన్‌ని పెళ్లి చేసుకో అని చెప్తారు. లక్ష్మీ మొగుడి గురించి తెలిసుకోమని యమునకు చెప్తారు. యమున లక్ష్మీతో భర్త లేకపోతే ప్రతీ క్షణం అవమానాలే నీ భర్త ఎవరో చెప్పు నీ ఇంటికి నువ్వు వెళ్లి సంతోషంగా ఉండొచ్చని అంటుంది. వసుధ మనసులో లక్ష్మీ తన ఇంట్లోనే ఉంది.. నువ్వే తన అత్త అని మనసులో అనుకుంటుంది. నీ భర్త రాడు నిన్ను ప్రేమగా చూసుకునే మదన్ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించు అని చెప్తుంది. లక్ష్మీ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. లక్ష్మీ విహారి గాయాలకు కాపడం పెట్టడానికి వెళ్తుంది.
విహారి: కనకం నేను నిన్ను ఓ బాధ్యత, బరువు అనుకున్నా దాన్ని ఎలా అయినా దించుకుంటే నీకు న్యాయం జరుగుతుంది అనుకున్నా కానీ నీ జీవితం గురించి ఆలోచించలేదు. నువ్వు మాత్రం నన్ను నీ బాధ్యత అనుకున్నావ్ కాపాడావ్.
లక్ష్మీ: మీరు నన్ను భార్యగా అనుకోకముందు నుంచి నేను మిమల్ని భర్తగా భావించాను. అలాంటిది మీ చుట్టూ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా నన్ను గుర్తించి భార్యగా అంగీకరించారు. అలాంటప్పుడు మీకు నేను సాయం చేయకపోతే మీ భార్యగా నా బాధ్యత ఏంటి. మీ వల్ల నాకు కలిగిన ఈ సౌభాగ్యానికి నాకు భార్య స్థానం ప్రసాదించారు. అవసరం అయితే ఆ యముడితో పోరాటం చేసి అయినా మిమల్ని కాపాడుకుంటాను.
విహారి: నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే భార్యభర్తలు ఒకరి కోసం ఒకరు బతకాలి. ఒకటిగా బతకాలి. ఓకే ప్రాణంగా బతకాలి.
లక్ష్మీ: విహారి గారు మనం ఒకటిగా బతకలేం కానీ ఒకరి కోసం ఒకరు బతకొచ్చు.
విహారి: నువ్వు చెప్పింది నిజమే మన చుట్టూ ఉన్న సమస్యల వల్ల మనం ఒకటిగా బతకలేం. ఇలాంటి జీవితం ఇచ్చిన ఆ దేవుడిని నిలదీయాలని ఉంది. రాబోయే రోజులు ఎలా ఉన్నా నేను నీతోనే ఉంటాను.
లక్ష్మీ, విహారిలను చూసి పండు మురిసిపోతాడు. లక్ష్మీ వెళ్తుంటే మదన్ కనిపిస్తాడు. లక్ష్మీతో మదన్ రాత్రి నీ వల్ల చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్తాడు. నీకు పరిచయం ఉన్న విహారి కోసమే అంత చేసిన నువ్వు నిన్ను చేసుకోబోయే నా కోసం ఆ యముడితో పోరాడి మరీ కాపాడుతావని నాకు అర్థమైందని అంటాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. నీ మీద నాకు రోజు రోజుకు ప్రేమ పెరుగుతుందని. ఏదో ఒక రోజు నువ్వు ఆరాధించే వాళ్లలో నేను ఒకడిని అవుతా అని మదన్ అంటాడు. ఆ మాటలు విహారి కూడా వింటాడు. లక్ష్మీ కన్నీరు పెట్టుకుంటుంది. విహారి కూడా బాధ పడతాడు. విహారి దగ్గరకు యమున వస్తుంది. కొడుకుకి జాగ్రత్తలు చెప్పి మాట్లాడుతుంది. ఇంతలో లక్ష్మీ మందులు తీసుకొని విహారి దగ్గరకు వస్తుంది.
యమున: నాన్న లక్ష్మీ ఎందుకు తన భర్తని అంతలా ఆలోచిస్తుంది. వదిలేసి వెళ్లిపోయిన వాడి కోసం ఎందుకు తను అతనే తన భర్త అని అంటుంది ఎందుకు. నిన్ను అడుగుతున్నా అని కాదు కానీ అతని కోసం ఎందుకు అంత ఆరాటపడుతుంది. ఒక వేళ తను తన భర్త కోసం చెప్పకపోతే మనం అయినా కనుక్కుందాం.
విహారి: మనసులో లక్ష్మీ నా భార్య అని అరచి చెప్పాలి అని ఉంది కానీ పరిస్థితులు నన్ను అపేస్తున్నాయి.
యమున: మనమే అతన్ని వెతుకుదాం. మేం నీకు ఏం అడగం లక్ష్మీ. మేం అతన్ని వెతికి నీ ముందుకి తీసుకొస్తాం.
లక్ష్మీ: వద్దమ్మా ఆ పని మాత్రం చేయొద్దు.
యమున: నీ పైన నాకు ఓ బాధ్యత ఉంది. నీకు ఓ కొత్త జీవితం ఇవ్వాలి అనుకుంటున్నా అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. అని విహారి గన్ తీసి.. నీకు ఎంత చెప్పినా వినడం లేదు. అందుకే నీ విషయం లో నేను కఠినంగా నిర్ణయం తీసుకుంటున్నా. నీ భర్తని వెతికి నువ్వే తీసుకొస్తావా. లేదంటే నేను నీ కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రేపటిలో నీ భర్త గురించి చెప్పు. లేదంటే అతను నీకు తెలిసి ఉంటే వాడిని నా ముందుకి తీసుకురా. లేదంటే రేపటి రోజున నా చావుని చూస్తావ్. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని సార్లు మనసు ముక్కలు చేసుకోవాలి.. నేను ఓ ఆడపిల్లనే.. జ్యోత్స్న డైలాగ్స్ పీక్స్!





















