అన్వేషించండి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 21: తులసి కోట వద్ద లక్ష్మీ పూజలు....కనకంపై చేయిచేసుకున్న సహస్ర...విహారి ఎలా రియాక్ట్ అయ్యాడు..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode: తులసికోట వద్ద దీపం వెలిగించిన లక్ష్మీపై సహస్ర చేయిచేసుకుంది...ఆ తర్వాత ఏం జరిగిందన్నదానితో ఈరోజు ఏపీసోడు ఆసక్తిగా మారింది

కనక మహాలక్ష్మీ సీరియల్ టుడే ఎపిసోడ్
Source : Zee5
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode:నీకు సంతోషం లేకుండా చేసిన వారి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావని అందుకే నిన్నుకొంచెం మందలించాల్సి వచ్చిందని లక్ష్మీతో చెబుతుంది. మీరు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారని నాకు తెలుసమ్మా అంటూ లక్ష్మీ సముదాయిస్తుంది. అయితే ప్రశాంతంగా పడుకోమని చెప్పి వాళ్ల అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.అంబికకు ఓ కాంట్రాక్టర్ నుంచి ఫోన్ వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్ట్ విహారికి దక్కకుండా మీరే అడ్డుకోవాలని అతను చెబుతాడు. అసలు టెండరే వేయకుండా చూస్తే...ప్రాజెక్ట్‌లో పదిశాతం వాటా ఇస్తానని చెబుతాడు. మీరు ఇచ్చే కమీషన్ నాకు అక్కర్లేదని నా కంపెనీలు అన్నీ నా చేతికి వచ్చేలా సాయపడాలని అంబికా కోరడంతో అతను సరేనంటాడు.
విహారి, లక్ష్మీ ఇంటి బయట మాట్లాడుకుంటుంటారు. మదన్‌తో పెళ్లిఅనగానే నువ్వు ఎందుకు విషం తాగాల్సి వచ్చిందని లక్ష్మీని విహారి అడుగుతాడు. నువ్వంటే ఇష్టమని చెబితే ఈ కుటుంబం మొత్తం చీలిపోతుందని భావించిన లక్ష్మీ ఆ విషయం చెప్పకుండా...మౌనంగా ఉండిపోతుంది. విహారి చెప్పమని ఒత్తిడి పెడుతుండగా..వీరి మాటలు విని అంబికా అక్కడికి వస్తుంది. అంబికా రాకను గమనించిన లక్ష్మీ...విహారి తీసుకుని కారు చాటున దాక్కుంటుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అంబికా వెళ్లిపోతుంది. మళ్లీ విహారి లక్ష్మీని ప్రశ్నించడం మొదలుపెడతాడు. నేను కట్టిన తాళికి ఎందుకు అంత గౌరవం ఇస్తున్నావ్ అని అడుగుతాడు. యాక్సిండెంటల్‌గా మనమధ్య ఏర్పడిన బంధానికి ఎందుకు అంత విలువ ఇస్తున్నావ్ అని నిలదీస్తాడు. దీనికోసం ఎందుకు రెండుసార్లు ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడలేదంటాడు.ఇన్ని అవమానాలు భరిస్తూ మా ఇంట్లో ఎందుకు ఉంటున్నావని లక్ష్మీని అడుగుతాడు. ఈలోగా వారిని వెతుక్కుంటూ అంబికా అక్కడికి రావడంతో వారి మధ్య మాటలు ఆగిపోతాయి.
తెల్లారిన తర్వాత కనకమహాలక్ష్మికి వాళ్ల అమ్మ ఫోన్ చేసి తులసి కోట వద్ద దీపం పెట్టి పూజ చేయమని చెబుతుంది. దీంతో కనకం తులసి కోట వద్ద పూజ చేసి దీపం పెడుతుంది.ఈలోగా అక్కడికి విహారికి కాబోయే భార్య సహస్ర,వాళ్ల అమ్మ ,అంబిక కూడా పూజ చేయడానికి తులసి కోట వద్దకు వస్తారు. అక్కడ లక్ష్మీని చూసి మండిపడిపోయిన సహస్ర కనకంపై చేయి చేసుకుంటుంది. లక్ష్మీని ఎందుకు కొట్టావని విహారి సహస్రను నిలదీస్తాడు. దీపం వెలిగించి పూజ చేస్తే మంచిదే కదా అంటాడు. ఇంటి కోడలు పెట్టాల్సిన దీపాన్ని ఇంటి పనిమనిషి పెడితే తప్పులేదా అని సహస్ర నిలదీస్తుంది. దాని మెడలో తాళికట్టిన వాడి ఇంటికి వెళ్లి దీపం వెలిగించుకోమని అవమానిస్తారు. దీంతో విహారి తను ఈ ఇంటి మనిషేనని అనడంతో...ఎలా అని వాళ్లంతా నిలదీస్తారు. ఈలోగా మదన్ అక్కడి వచ్చి వారిపై మండిపడటంతో అంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
సహస్ర వచ్చి వాళ్ల బావ విహారికి సారీ చెప్పగా....తనకు కాదని లక్ష్మీకి క్షమాపణలు చెప్పాలని చెబుతాడు. పనిమనిషిని కొడితే సారీ ఎందుకు చెప్పాలని సహస్ర విహారిని నిలదీస్తుంది.ఇంతలో విహారిని సహస్ర కౌగిలించుకోగా అక్కడికి కాఫీ తీసుకుని లక్ష్మీ వచ్చి వాళ్లను చూస్తుంది. కనకాన్ని ఉడికించడానికి సహస్ర మా ఇద్దరి ఫొటోలు తీయాలంటూ ఆమె చేతికి ఫోన్ ఇచ్చి వాళ్ల బావ పక్కన నిలబడి రకరకాలుగా ఫొటోలు దిగుతుంది. ఆ తర్వాత లక్ష్మీ, సహస్రా అక్కడి నుంచి వెళ్లిపోతారు. లక్ష్మీకి తన మనసులో చోటు ఉందని ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలని విహారి ఆలోచిస్తుండటంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
ఇంకా చదవండి





















