Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 13th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ కండీషన్ సీరియస్.. బతకడం కష్టమే.. మదన్ ప్రశ్నలకు తలదించుకున్న విహారి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ విషం తాగేయడం పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పడంతో ఇవాళ్టి ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ మదన్ పక్కన పెళ్లి పీటల మీద కూర్చొంటుంది. అంబిక సహస్రతో ఇంకేం చేసిన అది ఈ పెళ్లి ఆపలేదు.. ఇంక నీకు ఏ ప్రాబ్లమ్ లేదు అని అంటుంది. విహారి సత్యతో మామయ్య అత్తయ్య గారు ఎక్కడరా అంటే ఇక్కడే ఉండాలి అని సత్య అంటాడు. పెళ్లి దగ్గరకు వెళ్తే ప్రాబ్లమ్ అవుతుంది కదరా త్వరగా వెతుకుదాం పద అని విహారి, సత్య వెళ్తారు.
సహస్ర విహారి కోసం వెళ్తుంది. బావని చూసి పెళ్లి దగ్గరకు రమ్మని లాక్కెళ్తుంది. ఆదికేశవ్ పెళ్లి దగ్గర అందరూ గుమిగూడటం చూసి అటు వెళ్లబోతే సత్య వచ్చి తీసుకెళ్తారు. మండపంలో ఎవరిదో పెళ్లి అవుతుంది చూద్దాం అని ఆదికేశవ్ అంటే కనకం వాళ్లు వచ్చేశారని సత్య చెప్పి తీసుకెళ్తాడు. గౌరీ కూడా సరిగ్గా అక్కడికే వస్తుంది. మొత్తం చూస్తుంది కానీ పెళ్లి కూతురిగా ఉన్న తన కూతురిని చూడదు. ఆదికేశవ్ పిలవడంతో వెళ్లిపోతుంది. పండు దేవుడికి దండం పెట్టుకుంటూ అటుగా వెళ్తూ కనకం తాగిన విషం బాటిల్ చూస్తాడు. అది పట్టుకొని షాక్ అయిపోతాడు. లక్ష్మీ ఉన్న గది దగ్గర ఉందేంటి అనుకొని లక్ష్మీమ్మ అని పరుగులు తీస్తాడు.
మదన్‌ని పంతులు తాళి కట్టమని చెప్తాడు. లక్ష్మీ విహారి వైపు చూస్తుంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. మదన్ లక్ష్మీ మెడలో రెండు మొదటి ముడి వేయగానే లక్ష్మీ కుప్పకూలిపోతుంది. నోటి నుంచి రక్తం వస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. వసుధ, మదన్, విహారి కంగారు పడతారు. ఇంతలో పండు వచ్చి విషం బాటిల్ చూపించి విహారి బాబు లక్ష్మమ్మ విషం తాగేసింది అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. హడావుడిగా విహారి లక్ష్మీని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. మదన్ కట్టిన తాళి కింద పడిపోతుంది. విహారి మెడలో విహారి కట్టిన తాళి బయటకు వస్తుంది. లక్ష్మీకి ట్రీట్మెంట్ జరుగుతుంది. విహారి, మదన్ హాస్పిటల్‌లో టెన్షన్ పడతారు. డాక్టర్ వచ్చి కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు.
సత్య విహారికి కాల్ చేసి ఎప్పుడు వస్తావ్‌రా అంటే కనకం పెళ్లి జరలేదురా కనక మహాలక్ష్మీ విషం తాగేసిందని హాస్పిటల్‌లో ఉన్నామని చెప్తాడు. సత్య షాక్ అయిపోతాడు. కండీషన్ సీరియస్‌గా ఉందని లక్ష్మీ బతికే అవకాశం తక్కువగా ఉందని డాక్టర్లు చెప్తున్నారని ఇప్పుడేం చేయాలో తెలీడం లేదని విహారి అంటాడు. ఆంటీ, అంకుల్‌ని తీసుకురావాలా అంటే విహారి వద్దని ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి హోటల్‌లో ఉంచమని అంటాడు. సత్య ఆదికేశవ్, గౌరిలతో విహారి, లక్ష్మీలకు అర్జెంట్ పని పడి వెళ్లారని మిమల్ని హోటల్‌లో ఉంచమని విహారి చెప్పాడని సత్య అంటాడు. లక్ష్మీ ఎందుకు ఈ పని చేసిందిరా? అసలు లక్ష్మీకి పాయిజిన్ తాగాల్సిన అవసరం ఏంటి? తను లోపల ఎంత బాధ లేకపోతే ఇలా ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటుంది? తనకి నాతో పెళ్లి ఇష్టం లేదా? తనకి నేను ఇష్టంలేదా? అసలు తన మెడలో ఆ తాళి ఏంట్రా? తనకు ఇంతకు ముందే పెళ్లి అయిందా? తన భర్త మీద ఇష్టంతో ఈ పని చేసిందా? అని మదన్ విహారిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. విహారి ఇప్పుడేం చెప్పలేను అంటాడు. డాక్టర్ వచ్చి లక్ష్మీ బతకడం కష్టమని ట్రీట్మెంట్‌కి లక్ష్మీ స్పందించడం లేదని చెప్తారు. విహారి, మదన్ ఇద్దరూ కుప్పకూలిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

