Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today july 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీని రౌడీలు పాడు చేస్తారా? కిడ్నాప్ కథలో కీలక మలుపు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ విహారిని వెతుక్కుంటూ రావడం, విహారి లక్ష్మీ ఒకర్ని ఒకరు చూసుకోవడం, సుభాష్ విహారిని చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ విహారి కోసం వెతుకుతూ అలసిపోయి ఓ వీధిలోని టీ కొట్టు దగ్గర కూర్చొంటుంది. అక్కడ విహారిని కిడ్నాప్ చేసిన రౌడీల్లో ఒకడిని చూస్తుంది. ఆ రౌడీని ఫాలో అయితే విహారి దగ్గరకు వెళ్లొచ్చని రాత్రి వేలలో ఆ రౌడీని ఫాలో అవుతుంది. ఆ రౌడీ తప్పిపోవడంతో ఉదయం మళ్లీ ఆదే ఏరియాకి వస్తుంది. విహారిని ఇక్కడే ఎక్కడో బంధించి ఉంటారని వెతుకుతుంది.
లక్ష్మీ ఓ రౌడీని చూసి విహారిని కిడ్నాప్ చేసినవాళ్లే అనుకుంటుంది. ఆ రౌడీ లక్ష్మీని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటే మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారని కనిపించడం లేదని అంటుంది. దాంతో వాళ్లు ఎవరూ ఇక్కడ లేరని పంపేస్తారు. తర్వాత మరో వ్యక్తి వచ్చి ఎంజయ్ చేద్దాం మంచి ఫిగర్ అని లక్ష్మీ మీద కన్నేస్తాడు. ఇద్దరూ కలిసి లక్ష్మీతో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. లక్ష్మీని పిలిచి మీకు కావాల్సిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడని తీసుకెళ్లి లక్ష్మీని గదిలోకి తీసుకెళ్తారు. విహారి లక్ష్మీ మాటలు విని రేయ్ ఎవర్రా ఆడవాళ్ల జోలికి వెళ్లకండిరా.. అని తిడతాడు. విహారి మాటలు విన్న లక్ష్మీ విహారి పక్క గదిలోనే ఉన్నారని అనుకుంటుంది.
విహారి తిట్టడంతో రౌడీలు వెళ్లి మళ్లీ విహారిని చితక్కొడతారు. లక్ష్మీ గోడ చాటుగా వింటూ ఏడుస్తుంది. కానీ ఏం మాట్లాడదు. ఇంతలో రౌడీలకు అంబిక కాల్ చేస్తుంది. సుభాష్‌కి కాల్ చేస్తే కలవడం లేదు ఇక్కడే ఉన్నారా అంటే లేదని రౌడీ చెప్తాడు. ఇంతలో సుభాష్ రావడంతో ఫోన్ ఇస్తారు. అంబిక తన ప్లాన్ సుభాష్‌కి చెప్తుంది. రౌడీలు విహారిని కొట్టే సౌండ్ ఆగడంతో లక్ష్మీ విహారి గారు విహారి గారు అని పిలుస్తుంది. పిలిచి పిలిచి ఏడుస్తుంది. ఇంతలో విహారి లక్ష్మీ మాటలు విని లక్ష్మీ అని తన కట్లు విప్పుకొని డోర్ తీయడానికి ప్రయత్నిస్తాడు. లక్ష్మీకి వినిపించదు. దాంతో ఇద్దరూ గోడకు చెరో వైపు ఉండి ఏడుస్తారు.
విహారి గది మొత్తం చూసి గోడ పైన కిటికీలా ఉండటంతో అక్కడకు వెళ్లి స్టూల్ ఎక్కి లక్ష్మీ అని పిలుస్తాడు. లక్ష్మీని పైకి చూడమని అంటాడు. లక్ష్మీ చూసి చాలా సంతోషపడి పక్కనే ఉన్న చైర్ వేసుకొని విహారిని చూస్తుంది. విహారిని చూసి ఏడుస్తుంది. విహారి చేయి పట్టుకుంటుంది. విహారి లక్ష్మీతో నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు ఈ క్షణం నాకు ఈ దెబ్బలు నొప్పి ఏం తెలీడం లేదు.. నువ్వు వచ్చావని నాకు తెలుసు అని అంటాడు. మనం ఎలా అయినా బయట పడాలి అని లక్ష్మీ అంటుంది. నువ్వు ఎలా వచ్చావ్ అని విహారి లక్ష్మీని అడిగితే జరిగింది అంతా లక్ష్మీ చెప్తుంది. నీ అంతట నువ్వు ఎలా వాళ్లకి చిక్కుకున్నావ్ పిచ్చా నీకు అని తిడతాడు.
రౌడీలు రావడం చూసి విహారి, లక్ష్మీ ఎవరి ప్లేస్‌లకు వాళ్లు వెళ్లిపోతారు. సుభాష్ మళ్లీ వచ్చి సంతకం పెట్టమని విహారితో అంటాడు. విహారి పెట్టను అంటాడు. దాంతో సుభాష్ లక్ష్మీ ఫొటో చూపించి దీన్ని చంపేస్తా అంటాడు. లక్ష్మీ ఇక్కడే ఉందని వీడికి తెలీదు అని విహారి అనుకొంటాడు. సంతకం పెట్టను అని చెప్పడంతో మళ్లీ విహారిని కొడతారు. ఇక ఎస్‌ఐ ఇంటికి వచ్చి లక్ష్మీ ఫోన్ చేసింద చూడనేలేదు అనుకుంటుంది. గదిలోకి వెళ్లి లక్ష్మీతో మాట్లాడుదామని చూస్తే అక్కడ లక్ష్మీ ఉండదు. రౌడీ వెంటనే అంబికకు కాల్ చేసి విషయం చెప్తాడు. అంబిక తిట్టడంతో బెడ్ మీద పడుకున్నట్లు క్రియేట్ చేసి తప్పించుకుందని అంటాడు.
అంబిక వెంటనే లక్ష్మీ గురించి సుభాష్‌కి చెప్పాలని కాల్ చేస్తుంది. ఇంతలో సుభాష్ సంతకం పెట్టడం లేదని విహారిని చితక్కొడుతుంటాడు. దాంతో ఫోన్ కట్ చేస్తుంటాడు. ఎంత కొట్టినా విహారి సంతకం పెట్టను అని చెప్తాడు. కొట్టి కొట్టి సుభాష్ అలసిపోతాడు. సుభాష్ ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్తాడు. మరో ఇద్దరు రౌడీలు లక్ష్మిని ఎంజాయ్ చేద్దాం అని వెళ్తారు. లక్ష్మీ గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టి లక్ష్మీ దగ్గరకు వెళ్తారు. విహారి విని పైకి ఎక్కి చూస్తుంటాడు. కిటికీ తీసేసి లక్ష్మీ ఉన్న గదిలోకి దూకి రౌడీలను చితక్కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















