Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 8th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: అసలైన కరన్‌సింగ్‌ని కనిపెట్టేసిన లక్ష్మీ! అంబిక పెళ్లి ఆపేస్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode January 8th లక్ష్మీ సుభాష్ ఇంటికి వెళ్లి అసలైన కరన్ సింగ్‌ని కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి వల్లే అంబిక పెళ్లి చేసుకుంటుంది అని యమున కొడుకుని పొగుడుతుంది. మనం ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని విహారి అంటాడు. లక్ష్మీ ఊరు నుంచి వచ్చేస్తుంది కదా.. పైగా విహారి ఇక్కడే ఉన్నాడు. పెళ్లి వాళ్లిద్దరే ఆపే ఛాన్స్ ఉంది కదా అని అంబిక వాళ్లని బిజీ చేయాలి అనుకుంటుంది.
పద్మాక్షిని పిలిచి చెవిలో ఏదో చెప్తుంది. దాంతో యమున, విహారిల దగ్గరకు పద్మాక్షి వెళ్లి అంబికకు మనం గాజులు పెట్టాలి కదా అవి తీసుకురమ్మని అ అంటుంది. విహారిని పంపిస్తారు. లక్ష్మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంతలో లక్ష్మీకి సంధ్య కాల్ చేసి సుభాష్ని ఎంక్వైరీ చేశామని మూడు రోజుల క్రితం నుంచి ఏదో స్కూట్ కేస్ తీసుకొచ్చాడని అంటాడు. పెద్ద సూట్ కేస్ ఏంటి అని లక్ష్మీ సుభాష్ మీద అనుమానం ఉందని అంటుంది. సుభాష్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడని వాడి ప్లాట్ దగ్గరకు వెళ్దామని అంటుంది.
లక్ష్మీ సుభాష్ ప్లాట్కి వెళ్లి మొత్తం వెతుకుతుంది. లక్ష్మీని ఓ రౌడీ చూసి మగతా వాళ్లకి చెప్తారు. రౌడీలు సుభాష్కి కాల్ చేస్తారు. లక్ష్మీ ఇంటికి వచ్చిందని చెప్తారు. అది అక్కడికి వచ్చింది అంటే కరన్ సింగ్ కోసమే ఇద్దరినీ చంపేయమని అంటారు. సుభాష్ అంబికకు విషయం చెప్తే అంబిక సుభాష్ని తిడుతుంది. ఆ కరన్ సింగ్ని మీ ఇంట్లో ఉంచడం ఏంటి అని అంటుంది. ఏం కాదు నా మనుషులు వాళ్లిద్దరినీ చంపేస్తారు జాగ్రత్తగా ఉండు అని సుభాష్ అంటాడు.
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది విహారి ఇంకా రాలేదు అని భక్తవత్సలం అంటే అప్పుడే విహారి అక్కడికి బంగారు గాజులు తీసుకొని వస్తాడు. లక్ష్మీ ఇంకా రాలేదేంటి విహారి టెన్షన్ పడతాడు. మళ్లీ లక్ష్మీకి కాల్ చేస్తాడు. లక్ష్మీ మొత్తం వెతుకుతూ సుభాష్ ఇంట్లో సీక్రెట్ రూం చూస్తుంది. కబోర్డ్ తీసి చూస్తే అక్కడ ఓ గది ఉంటుంది. అందులో కరన్ సింగ్ కట్టేసి ఉంటాడు. లక్ష్మీ అతన్ని చూసి షాక్ అయిపోతుంది. ఎవరు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతుంది. దానికి ఆయన నా పేరు కరన్ సింగ్ అని భక్తవత్సలం ఇంటికి వస్తుంటే కిడ్నాప్ చేశారని చెప్తాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది.
లక్ష్మీ అతని కట్లు విప్పి ఆయన్ను తీసుకొని పెళ్లి మండపం దగ్గరకు బయల్దేరుతుంది. బయటకు వచ్చే సరికి సుభాష్ మనసులు వాళ్లని అడ్డుకుంటారు. ముగ్గురు రౌడీలను లక్ష్మీ చితక్కొట్టేస్తుంది. ఓ రౌడీ లక్ష్మీని చాకుతో పొడవడానికి వచ్చే సరికి విహారి ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరూ రౌడీలను చితక్కొట్టి కరన్ సింగ్ని కాపాడతారు. ఇతను ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని విహారి అడుగుతాడు. దానికి లక్ష్మీ అసలైన కరన్ సింగ్ ఇతనే అని చెప్తుంది. మరి అక్కడున్నది ఎవరు అని లక్ష్మీని విహారి అడిగితే సుభాష్ అని చెప్తుంది. విహారి షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















