Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 8th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: మంగళసూత్రానికి పూజ చేసిన కనకం.. తాళి విప్పే తీరుతానంటోన్న విహారి..!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం మెడలో తాళి విప్పడానికి విహారి గుడికి రావడం అంబికి విహారిని అనుసరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ గుడికి చేరుకుంటుంది. లక్ష్మీ గుడి దగ్గరకు రాగానే తన తల్లిదండ్రులు కాల్ చేస్తారు. ఆదికేశవ్ కనకంతో మాకు పగలు అమెరికాలో రాత్రి అయింటుంది కదా అని లక్ష్మీ అమెరికాలో ఉందని మాట్లాడుతాడు. ఇక గౌరీ ఫోన్ తీసుకొని ఈ రోజు చాలా మంచి రోజుని ఇక్కడ(ఇండియాలో) ఈ రోజు అంటే అమెరికాలో రేపు అని రేపు గుడికి వెళ్లి నిమ్మకాయలతో దీపాలు వెలిగించి పసుపు కుంకుమతో మంగళసూత్రానికి పూజ చేయమని అంటుంది. తల్లిదండ్రులు ఫోన్ పెట్టగానే లక్ష్మీ ఏడుస్తుంది.
ఇక సత్య లక్ష్మీని గుడిలోకి వెళ్దామంటే లక్ష్మీ పసుపు కుంకుమ, నిమ్మకాయలు తీసుకురమ్మని చెప్తుంది. సత్య తీసుకురావడానికి వెళ్తాడు. ఇక విహారి వస్తుంటే అంబిక ఫాలో అవుతుంది. విహారి తనలో తాను కనకానికి సారీ చెప్పుకుంటాడు. నీ జీవితం బాగు పడాలి అనే ఇలా చేస్తున్నాను అనుకుంటాడు.
అంబిక: విహారి ఈ రోజు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. ఇన్ని రోజులు నువ్వు అందరినీ మోసం చేసింది చాలు. అబద్ధాలు చెప్పింది చాలు. ఈ రోజుతో నీ బండారం బయట పెడతా.
లక్ష్మీ: అమ్మవారికి నిమ్మకాయ తొక్కలతో దీపాలు పెట్టి పసుపు కుంకుమతో మంగళసూత్రానికి పూజ చేస్తుంది. అమ్మ తల్లి వేదమంత్రాల సాక్షిగా ఈ తాళి నా మెడలో పడింది. ఈ మంగళ సూత్రం నా మెడలో పడిన ముహూర్తం బలహీనమైనదా లేక మీ దీవెనలు బలహీనమైనవా నాకు అర్థం కావడం లేదు. ఏ దేవతల సాక్షిగా ఈ తాళి నా మెడలో పడిందో అదే దేవతల సాక్షిగా నా మెడలో తాళిని నా మెడలో కట్టిన వ్యక్తే విప్పుతానంటున్నాడు. ఆయనతో కలిసి జీవితం పంచుకోవాలని నేను కోరుకోవడం లేదు. ఆయనకు ఈ తాళి అడ్డు రావాలని కోరుకోవడం లేదు. కేవలం ఆయన క్షేమం మాత్రమే కోరుకుంటున్నా. ఈ తాళి బొట్టు నా గుండెల మీద వేలాడే అంతవరకు ఆయన క్షేమంగా ఉంటారని నా నమ్మకం ఈ మూడు ముళ్లు విడిపోకుండా నువ్వే చూడు తల్లీ. నువ్వే చూడు.
లక్ష్మీ బాధ చూసి సత్య విహారికి కాల్ చేస్తాడు. విహారి డల్‌గా మాట్లాడుతుంటే ఏమైందని సత్య అడుగుతాడు. నేను చేస్తుంది తప్పు ఒప్పు తెలీడం లేదని కనకం తల్లిదండ్రులు ఫోన్ చేసి మంగళ సూత్రం కోసం చేయాల్సిన నిమ్మకాయల తొక్కలతో దీపాలు పెట్టించమని చెప్పారని అంటాడు. లక్ష్మీకి మంచి భవిష్యత్ ఇవ్వాలి అంటే తన మెడలో ఆ పసుపు తాడు ఉండకూడదు అని అందుకే తన మెడలో తాళి విప్పాలని అనుకుంటున్నానని అంటాడు. లక్ష్మీ బాగు కోసమే చేస్తున్నావ్ కదా ఏం కాదు అని అంటాడు. మరోవైపు విహారి ఇంటికి గీత అనే ఈవెంట్ మ్యానేజర్ వస్తుంది. సహస్ర తన పెళ్లిని మెమెరిబుల్‌గా ఉండాలని డిజైన్ చేసుకుంటుందని యమున, వసుధ మాట్లాడుకుంటారు.
ఇక గీత తన ప్లాన్స్ చెప్తుంది. బెస్ట్ కల్యాణ మండపాలు చూపిస్తుంది. సహస్ర కల్యాణ మండపం సెలక్షన్ కోసం విహారికి కాల్ చేస్తుంది. విహారి కారు సైడ్‌కి ఆపి సహస్రతో మాట్లాడుతాడు. నువ్వే సెలక్ట్ చేయ్ అని సహస్రతో విహారి చెప్తాడు. సహస్ర ఫీలవుతుంది. అయితే తర్వాత తనకు ఇష్టమైన కల్యాణ మండపం బుక్ చేస్తుంది. ఇక పద్మాక్షి లక్ష్మీని పిలిస్తే మార్కెట్‌కి వెళ్లిందని వసుధ చెప్తుంది. విహారి గుడికి చేరుకుంటాడు. అంబిక విహారిని మిస్ అయిపోతుంది. ఏ రూట్‌లో వెళ్లుంటాడా అనుకుంటుంది. విహారి సత్యని కలుస్తాడు. లక్ష్మీ ఏడుస్తూ ఉంటే విహారి అక్కడికి వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.