Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 1st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: అంబిక పెళ్లిపై లక్ష్మీ అనుమానానికి కారణమేంటి? విహారికి అర్థమైన ప్రేమ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode January 1st లక్ష్మీకి సుభాష్ మీద అనుమానం వచ్చి సుభాష్ గురించి ఎంక్వైరీ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. దానికి లక్ష్మీ అంబికమ్మ ఈ పెళ్లి వద్దు అన్నారు.. కానీ ఇప్పుడు ఈ పెళ్లి చాలా ముఖ్యం అని అంటుంది.. ఎందుకా అని ఆలోచిస్తున్నా అని అంటుంది. మా కోసం అలా అనుంటుంది.. నువ్వు ఎందుకు ఈ పెళ్లి గురించి ఇంత ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే తల్లిదండ్రులు అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చూస్తారు.. కానీ అంబికమ్మకి పెళ్లి కొడుకు నచ్చితే చాలు అని అనుకున్నారు అని అంటుంది.
విహారి లక్ష్మీతో కరన్ సింగ్ మంచోడు కాదు అని అంటున్నావా అని అడుగుతాడు. అలా కాదు పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు కదా.. కానీ అలా చూడకుండా పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం ఏమవుతుందో అన్నదానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని అంటుంది. ఆ మాటకు విహారి చాలా బాధ పడతాడు. మనది పొరపాటు కాదు లక్ష్మీ దేవుడు నీకు నాకు ముడి వేశాడు కాబట్టి అలా జరిగింది..అలాగే ప్రతీ ఒక్కరి జీవితం జరగదు నువ్వు ఎక్కువ ఆలోచించకు అని అంటాడు.
ఆలోచించకుండా ఎలా ఉంటాను విహారి గారు ఇది నాకు కుటుంబమే.. ఇక్కడున్న వాళ్లు అంతా నా వాళ్లే అంటుంది. చూశావా లక్ష్మీ నీలోపల ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నా వాళ్లని నీ వాళ్లు అంటున్నావు.. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ బయటకు వచ్చేసింది.. నువ్వు ఇంకేం మాట్లాడకు నాకు అంతా అర్థమైపోయింది అని అంటాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు చూసుకుంటారు. విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లడంతో లక్ష్మీ బెడ్ మీద పడిపోతుంది. విహారి కూడా లక్ష్మీ మీద పడిపోతాడు. తర్వాత లక్ష్మీ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది.
ఆదికేశవ్‌కి కనకం కాపురం బెంగ పెట్టుకొని సర్పంచి కొడుకుకి కాల్ చేసి విహారి గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. దాంతో ఆయన విహారి సంవత్సరం వరకు ఇక్కడే ఉండేవాడు కానీ ఇప్పుడు లేడు అని హైదరాబాద్‌లో తెలిసిన వాళ్లు ఉన్నారు వారిని అడిగితే మీ అల్లుడు గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అని అంటాడు. ఆదికేశవ్ బెంగ పెట్టుకుంటాడు. ఇండియాకు వచ్చేస్తే ఆ విషయం నాకు చెప్పడం లేదు ఏంటిఅని అనుకుంటాడు.
లక్ష్మీ నిద్ర పోతూ ఉంటే బాంబ్ పేలిన విషయం కలలో కనిపించి ఉలిక్కిపడి లేచేస్తుంది. బాంబ్ పెట్టింది ఎవరో అని ఆలోచిస్తుంది. అంబికమ్మ పెళ్లి జరుగుతుంటే సుభాష్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు.. సుభాష్ కూడా చేయొచ్చని అనుకొని వెంటనే సంధ్యకి కాల్ చేస్తుంది. బాంబ్ విషయం గురించి చెప్తుంది. తనకు సుభాష్ మీద అనుమానం ఉందని చెప్తుంది. సుభాష్ డిలైట్స్ ఇస్తుంది.
సుభాష్, అంబిక మాట్లాడుకుంటారు. ఇంకా రెండు రోజులు జాగ్రత్తపడితే మన పెళ్లి అయిపోతుందని అనుకుంటారు. లక్ష్మీ, విహారికి ఎలాంటి డౌట్ రాకుండా చూసుకోవాలని అనుకుంటారు. పద్మాక్షితో సహస్ర ఐవీఎఫ్ డాక్టర్‌తో మాట్లాడమని చెప్తుంది. పద్మాక్షి వెంటనే డాక్టర్‌కి కాల్ చేస్తుంది. లక్ష్మీలో ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అంటుంది. సరోగసీ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదని అంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.. కంగారు పడొద్దు.. ఇంకా నాలుగైదు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయని అంటుంది. ఇక సహస్ర తల్లికి విహారి ఫోన్ గురించి చెప్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో సహస్ర సెల్ పాయింట్‌కి వెళ్లి డేటా గురించి అడుగుతుంది. ఫోన్ రిపేర్ అవ్వగానే ముందు నాకు చెప్పు అని చెప్పి డబ్బు ఇస్తుంది.
లక్ష్మీకి సంధ్య కాల్ చేసి సుభాష్ మూడు రోజుల నుంచి కనిపించడం లేదని ఎక్కడికి వెళ్లాడో ఎవరూ చెప్పడం లేదని అంటుంది. అయితే సుభాష్ ఇదంతా చేస్తున్నాడని అనుకోవచ్చని సీసీ టీవీ ఫుటేజ్ చూసి చెప్తానని సంధ్య అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















