Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 29th:కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: యమున ఫోన్‌లో డేటా పోయినట్లేనా! విహారి పరుగులు..! నిజం తెలుస్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode December 29th లక్ష్మీని పద్మాక్షి జాగ్రత్తగా చూసుకుంటూ సేవలు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పంతులు లక్ష్మీకి దండలు తీసుకొని రమ్మని అంటే లక్ష్మీ తీసుకొస్తుంది. విహారి, లక్ష్మీ ఎదురెదురుగా రావడంతో దండలు రెండు ఇద్దరి మెడలో పడతాయి. లక్ష్మీని విహారి పట్టుకుంటాడు. అందరి ముందు లక్ష్మీని విహారి అలా పట్టుకోవడంతో సహస్ర కోపంగా లక్ష్మీని లాగిపెట్టి కొడుతుంది.
లక్ష్మీని పద్మాక్షి పట్టుకుంటుంది. నిజానికి లక్ష్మీ కడుపులో సహస్ర, విహారిల బిడ్డ ఉండటంతో పద్మాక్షి లక్ష్మీని పట్టుకుంటుంది. సహస్రతో ఎందుకే లక్ష్మీని కొట్టావని అంటుంది. మరి అదేం చేసిందో చూశావా అమ్మ అని సహస్ర అంటుంది. పిల్లలు ఆడుకుంటూ నెట్టేశారు వదిలేయమ్మా అని భక్తవత్సలం చెప్తారు. లక్ష్మీ కడుపులో తన బిడ్డ ఉందని సహస్రకి గుర్తొచ్చి సైలెంట్ అయిపోతుంది. తర్వాత అంబిక, కరన్ సింగ్‌లా వచ్చిన సుభాష్‌ల పెళ్లి తంతు మొదలవుతుంది. సుభాష్‌కి ఆచమనం చేయమని పంతులు చెప్తే చక్కగా చేసేస్తాడు. దాంతో లక్ష్మీ, చారుకేశవలు అనుమానంగా చూస్తారు.
తెలుగు వాళ్లు అంటే ఇష్టం ఉండటం వల్ల అన్నీ బాగా నేర్చుకున్నా అని సుభాష్ చెప్తాడు. అంబిక సుభాష్‌తో జాగ్రత్తగా ఉండమని లేదంటే ఇద్దరం దొరికిపోతామని చెప్తుంది. ఒరిజినల్ కరన్ సింగ్ సేవ్‌గా ఉన్నాడా అని అడిగితే మన పెళ్లి అయిన వరకు వాడు బయటకు రాడు అని సుభాష్ అంటాడు. ఇక లక్ష్మీ వెళ్తుంటే విహారి వెళ్లి మన బంధాన్ని దేవుడు ఎలా దీవిస్తున్నాడో చూడు అని దండలు మెడలో పడటం గురించి చెప్తాడు. ఏదో అలా జరిగింది అలా అనొద్దని లక్ష్మీ అంటే ఎవరు ఏమన్నా ఏదో ఒక రోజు నా పక్కన నువ్వు నా భార్యగా నిల్చొంటావ్ రెడీగా ఉండు అని అంటాడు.
విహారి ఇచ్చిన ఫోన్ రిపేర్‌కి తీసుకున్న అతను రికవరీ అవసరం లేదు అంటే త్వరగా రిపేర్ చేస్తామని కనుక్కోవడానికి విహారికి ఫోన్ చేస్తారు. విహారి లేకపోవడంతో యమున విహారి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అతను యమునతో డేటా రికవరీ అవసరం లేదు అంటే ఫోన్ రిపేర్ చేసేస్తాం అని అంటారు. దానికి యమున సరే అని డేటా అవసరం లేదని అంటుంది. ఇక యమున విహారికి విషయం చెప్తుంది. ఎంత పని చేశావ్ అమ్మా అని విహారి అంటాడు. సహస్ర చాటుగా విని డేటా కోసం బావ అంత కంగారు పడుతున్నాడేంటి అని అనుకుంటుంది.
విహారి అతనికి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు.. దాంతో విహారి అతని షాప్‌కి పరుగులు తీస్తాడు. సహస్ర విషయం అమ్మకి చెప్పాలి అనుకుంటుంది. కానీ మళ్లీ విషయం చెప్తే తిడుతుంది. దాని కంటే నేను కనుక్కుంటా బావని ఫాలో అవుతా అని వెళ్తుంది. ఇక సుభాష్ గెటప్‌లో అలా ఉండలేక టోపీ తీసి పక్కకి వెళ్లి సిగరెట్ తాగుతాడు. లక్ష్మీ అతని కోసం నీరు తీసుకొచ్చి బెడ్ మీద తలపాగ ఉండటం చూసి షాక్ అవుతుంది. పగడి తీయకూడదు.. నీరు పడకూడదు అన్న కరన్‌సింగ్ గారు ఎక్కడ ఉన్నారు అని లక్ష్మీ గదిలోకి వెళ్తుంది. బాల్కానీ డోర్ నుంచి పొగ రావడం చూసి సిగరెట్ తాగుతున్నారని లక్ష్మీ అక్కడికి వెళ్తుంది. సరిగ్గా లక్ష్మీ సుభాష్‌ని చూసే లోపు యమున పిలుస్తుంది. దాంతో సుభాష్ షాక్ అయి వెంటనే తలపాగ పెట్టుకుంటాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు.
యమున లక్ష్మీని పిలిచి పూజ సామాను పండు ఎక్కడ పెట్టాడో తెలీదు.. అవన్నీ తీసుకురా అని అంటుంది. నేను తీసుకొస్తా అని లక్ష్మీ వెళ్తుంది. లక్ష్మీని చూసిన పద్మాక్షి లక్ష్మీ ఏమో అటూ ఇటూ తిరుగుతూ అన్నీ పనులు చేసేస్తుంది. దాని కడుపులో నా కూతురి బిడ్డ ఉంది.. దీన్ని ఎలా ఆపాలి అనుకుంటూ బిడ్డ బలం కోసం డాక్టర్ ఇచ్చిన మందులు జ్యూస్‌లో కలిపి తీసుకెళ్తుంది. లక్ష్మీ బరువు మోయడం చూసి లక్ష్మీని ఆపి పండుని పిలిచి లాగిపెట్టి కొట్టి లక్ష్మీ చేత ఏ పని చేయించొద్దు అని చెప్పాను కదా ఎందుకు చేయిస్తున్నావ్ అని కొడుతుంది. రేపటి నుంచి లక్ష్మీతో ఏ పని చేయించినా ఊరుకోను అని లక్ష్మీకి జ్యూస్ ఇస్తుంది. లక్ష్మీ పద్మాక్షికి భయపడుతూ నాకు ఎందుకమ్మా అని అంటుంది. పద్మాక్షి తాగమని చెప్తూ నా కూతురిని ఎలా చూసుకుంటానో నిన్ను అలాగే చూసుకుంటా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















