Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 20th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ తిరిగి వస్తుందని తెలిసి సహస్ర వీరంగం.. అమెరికా బయల్దేరిన విహారి, కనకం!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి, కనకం బయల్దేరడం కనకం ఇంటికి వస్తుందని యమున చెప్పడంతో సహస్ర మండిపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం, విహారిలు ఫస్ట్‌నైట్ గదిలో ఉంటే ఉదయం గౌరీ వచ్చి డోర్ కొడుతుంది. ఇక కనకం కింద పడుకున్న విహారిని లేపి బెడ్ మీదకు రమ్మని చెప్పి తను ఫస్ట్‌నైట్ జరిగినట్లు బొట్టు చెరిపి చీర నలిపేసి జుట్టు పీక్కొంటుంది. విహారి ఇబ్బందిగా చూసి తల దించుకుంటాడు. ఇక కనకం వెళ్లి డోర్ తీసి సిగ్గు పడుతుంది. కనకాన్ని చూసి తన తల్లి చాలా సంతోషపడుతుంది. కనకం తల్లిని చూసి సిగ్గు పడుతుంది. గౌరీ ఎవరూ చూడకుండా కనకాన్ని చాటుగా తీసుకెళ్తుంది.
గౌరీ: కనకం ఈ రోజు నుంచి అయినా నీ మొహమాటం పోయినట్లే కదా. మీ భార్యాభర్తల బంధం ఈ రోజు నుంచి మొదలైనట్లే కదా.
కనకం: హా అని సిగ్గు పడుతుంది.
గౌరీ: నువ్వు వెళ్లి రెడీ అవు నేను టిఫెన్స్ చేస్తాను.
విహారి: గదిలోకి వచ్చి ఏడుస్తున్న కనకంతో.. కనక మహాలక్ష్మీ నువ్వు మీ తల్లిదండ్రుల ముందు ఇన్ని నాటకాలు ఆడుతుంటే చూస్తూ చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకీ రాకూడదు. ఇటు పెళ్లి చేసుకున్న భర్త ప్రేమ పొందలేక అటు ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక నువ్వు ఎంత నలిగిపోతున్నావో నాకు తెలుస్తుంది. నిన్ను ఎలా ఓదార్చాలో నీ సమస్యకు ఎలా పరిష్కారం చూపాలో నాకు తెలీడం లేదు.
కనకం: కాలం పెట్టిన పరీక్షల్ని దాటుకొని వెళ్లాలని కాలం కట్టే అడ్డుకట్టల్ని కూల్చుకొని ముందుకు పోవాలని మీరే అన్నారు కదా చూద్దాం ఇంకా ఈ ప్రయాణంలో ఇంకా ఎన్ని మజిలీలు దాటాలో. సరే మీరు రెడీ అవ్వండి అమ్మ టిఫెన్ చేస్తాననింది.
విహారి: పాపం కనక మహాలక్ష్మీ తన తల్లిదండ్రుల్ని సంతోష పెట్టడం కోసం ఎన్ని నాటకాలు ఆడాల్సి వస్తుంది. ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. భగవంతుడా ఈ అబద్ధాల నుంచి ఈ నాటకాల నుంచి ఎంత త్వరగా బయట పడాలి అనుకుంటే అంత లోతుగా బిగుసుకుపోతున్నాం. ఈ సమస్యకు త్వరగా ఓ పరిష్కారం చూపించు తండ్రీ.
కనకం, విహారిల కోసం ఆదికేశవ్ చాలా రకాల పిండి వంటలు తయారు చేయించి వాటిని ప్యాకింగ్ చేయిస్తాడు. అమ్మాయి అల్లుడు వెళ్లిపోతుంటే మనసుకి ఏదోలా ఉందని బాధపడతాడు. గౌరీ భర్తకి సర్దిచెప్తుంది. ఉన్న మూడు నాలుగు రోజులు మనతో సంతోషంగా ఉన్నారు కదా అంటుంది. ఇక కనకానికి పెళ్లి చేసి పంపించినప్పుడు నుంచి నా గుండె సరిగా పని చేయడం లేదని బాధ పడతాడు. బామ్మ ఆదికేశవ్, గౌరీలతో మీలాంటి తల్లిదండ్రులు దొరకడం కనకం అదృష్టమని కూతురిని అత్తారింటికి పంపినప్పుడు బాధగానే ఉంటుందని అంటుంది. అందరూ ఎమోషనల్ అయిపోతారు. కనకం జ్ఞాపకాలతో ఎంత కాలం బతుకుతానో అర్థం కావడం లేదని ఆదికేశవ్ బాధ పడతాడు. అమ్మాయి సంతోషంగా ఉంది కదా మనం బాధ పడకూడదని గౌరీ అంటుంది. ఇక బామ్మ అయితే నీ కూతురి గర్భవతి అయితే ఇక్కడికే వస్తుంది. పిల్లాడు పుట్టిన వరకు ఇక్కడే ఉంటుందని అంటుంది. దాంతో ఆదికేశవ్ చాలా సంతోషిస్తాడు.
పద్మాక్షి, అంబిక, సహస్ర అందరూ లక్ష్మీ గదిని స్టోర్ రూంగా మార్చేయాలని అనుకుంటారు. దానికి యమున వచ్చి లక్ష్మీ మళ్లీ వస్తుంది కదా తన గది ఎందుకు స్టోర్ రూం చేస్తారని అడుగుతుంది. లక్ష్మీ మళ్లీ రావడం ఏంటి అని అందరూ షాక్ అయిపోతారు. దాంతో యమున లక్ష్మీ తిరుపతి వెళ్లిందని మళ్లీ వస్తుందని చెప్తుంది. లక్ష్మీ వల్ల ఈ ఇంటిలో గొడవలు అవుతున్నాయని సహస్ర కోప్పడుతుంది. ఈ ఒక్క కోరిక తీర్చమని లక్ష్మీని పంపొద్దని యమున అంటుంది. దాంతో సహస్ర మీ కోసం లక్ష్మీని ఏం వదిలేస్తున్నా కానీ నా పెళ్లిలో ఏమైనా జరిగితే మాత్రం నేను జుట్టు పట్టుకొని గెంటేస్తా అని అంటుంది. వసుధ యమునతో ఇందరితో మాటలు పడే బదులు తనని వేరే ఎక్కడైనా పెట్టి నెలకి డబ్బులు ఇవ్వొచ్చు కదా అంటే దానికి యమున అదే పరిస్థితిలో నా కూతురో కోడలో ఉంటే అలా వదిలేయలేను కదా లక్ష్మీ నా ప్రాణాలు కాపాడింది తనకు సాయం చేయడం నా ధర్మం అని యమున అంటుంది. ఇక విహారి, కనకం అమెరికాకి అన్నట్లు ఆదికేశవ్ ఇంటి నుంచి బయల్దేరుతారు. ఆదికేశవ్ దగ్గరుండి కారు ఫుల్లుగా అన్నీ సర్దించేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.