Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఫస్ట్‌నైట్ ఆటలు ఆడేస్తున్న కనకం, విహారి.. రంగంలోకి దిగిన అంబిక.. చారుకేశవ గేమ్ షురూ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి, కనకం ఇద్దరూ పెద్దల కోసం ఫస్ట్‌నైట్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకాన్ని ఫస్ట్‌నైట్ కోసం రెడీ చేస్తారు. రాణి కనకాన్ని ఆటపట్టిస్తుంది. కనకం ఇబ్బంది చూసి బామ్మ అసలు ఇప్పటి వరకు మీరు కలిశారా లేదా అని అడుగుతుంది. నిజం చెప్పలేకపోతున్నా అని కనకం ఏడుస్తుంది. మూడు ముళ్ల బంధం ఈ మూడు రాత్రులతో ఇంకా విడదీయలేని బంధంగా మారిపోతుందని గౌరీ కూతురితో చెప్తుంది. మీ ఇద్దరికీ మూడు రాత్రుల బంధం మీ మధ్య ఏర్పడలేదని నాకు అనుమానంగా ఉందని గౌరీ అంటుంది. మానసిక బంధంతో పాటు శారీరక బంధం ఏర్పడినప్పుడే బంధం బలపడుతుందని చెప్తుంది. గదిలోకి వెళ్లాక అల్లుడు గారికి అనుకూలంగా ఉందని అంటుంది. ఇక అంబిక సుభాష్‌కి కాల్ చేస్తుంది.
అంబిక: విహారి గురించి మనకు ఏదో పెద్ద నిజం తెలియబోతుంది సుభాష్.
సుభాష్: ఏంటా విషయం ఏంటా నిజం.
అంబిక: నా అనుమానాలు నిజం అవుతున్నాయి విహారి ఏం పని లేకపోయినా ముంబాయి వెళ్లానని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చానన్నాను. మేం వచ్చిన ఊరు వచ్చానని చెప్తాడు. ఇప్పుడు మరో ట్విస్ట్ జరిగింది. పండుని అడిగితే ముందు విహారి ఇంటికి రావడం తనకు తెలీదు అన్నాడు కాసేపటి తర్వాత ధర్మపురం వచ్చాడన్నట్లు మాట మార్చాడు. పండు మాటల్లో తడబాటు ఉంది అంటే విహారి మాటల్లో అబద్ధం. విహారి అసలు ముంబాయి వెళ్లాడా లేదా అన్నది మొదటి అనుమానం. ఇంటికి రావడం రెండో అనుమానం. సహస్ర కోసం రావడం మూడో అనుమానం ఇవన్నీ మనం తెలుసుకోవాలి
సుభాష్: అంటే మనకు తెలీకుండా విహారి ఏదో కథ నడిపిస్తున్నాడు అంటావా.
అంబిక: డౌటే లేదు. కచ్చితంగా ఏదో జరుగుతుంది.
చారుకేశవ: అంబిక.. ఏంటి అంత కంగారుగా ఉన్నావ్.
అంబిక: కంగారేమీ లేదే.
చారుకేశవ: నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావ్. ఎప్పుడు ఎవరో ఒకరికి గోతులు తవ్వుతుంటావ్ అయినా నేను ఇప్పుడు నోరు మూసుకోవాలి అంటే నాకు నోట్ల కట్టలు ఇవ్వు.
డబ్బు ఇవ్వమని చారుకేశవ అంబిక పాత సీసీ టీవీ ఫుటేజీ చూపించి మరోసారి బెదిరిస్తాడు. దాంతో చేసేదేమీ లేక అంబిక డబ్బు పంపిస్తుంది. తర్వాత చారుకేశవతో విహారి ముంబయి నుంచి ఇంటికి వచ్చాడా నువ్వు నేరుగా చూశావా అని అడుగుతుంది. విషయం చెప్పి నాకు ఎక్కడో తేడా కొడుతుందని అంటాడు. దాంతో చారుకేశవ ముంబయి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాడని చెప్తాడు. దాంతో చారుకేశవ ఎక్కడో ఏదో జరుగుతుంది ఆ తేడా తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇక ఆదికేశవ్ వాళ్లు కనకం, విహారిలతో ఫస్ట్‌నైట్ ముందు తంతులు జరిపిస్తారు.
ముందు ఇద్దరినీ కూర్చొపెట్టి బంతి ఆట ఆడిపిస్తారు. ఇద్దరూ ఆడుతుంటే అందరూ సంతోషపడతారు. తర్వాత ఇద్దరితో బిందెలో ఉంగరం వేసి ఉంగరం ఆట ఆడిస్తారు. కనకం డల్‌గా ఉంటే విహారి సరదాగా ఉన్నట్లు నటించమని కనకంతో చెప్తాడు. కనకం ఉంగరం దక్కించుకుంటుంది. ఇక తర్వాత విహారి కళ్లకు గంతలు కట్టి అందరి చేతులు తాకి అందులో కనకం ఎవరో కనిపెట్టమని అంటారు. రాణి విహారి కళ్లకు గంతలు కడుతుంది. అమ్మాయిలు అందరూ చేతులు మందు చాపుతారు. విహారి ఒక్కొక్కరి చేతులు పట్టుకొని చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారాన్ని పొడిచి పొడిచి చంపేసిన దీపక్.. రూప మీద విరుచుకుపడ్డ రాజు.. రూప ప్రెగ్నెంట్!