Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం, విహారిలకు ఫస్ట్‌నైట్.. సహస్రకు నిజం చెప్పేసిన పండు.. ఇక రచ్చ రంబోలానే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం విహారిలకు ఆదికేశవ్ తన ఇంట్లో ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి వెళ్లిపోవాలని ఆదికేశవ్, గౌరీ వాళ్లతో చెప్తారు. దాంతో వాళ్లు కనీసం ఈ ఒక్క రోజు రాత్రికైనా ఉండండి అని అంటారు. ఒక్క రాత్రి ఎందుకు అని విహారి అంటే ఆదికేశవ్ దానికి పుట్టింట్లో మూడు రాత్రులు అత్తారింట్లో మూడు రాత్రులు జరగాలి అని మీకు పెళ్లి అయిన తర్వాత ఈ ఇంట్లో మూడు రాత్రులు జరగలేదు అని అంటాడు. దానికి విహారి మేం మూడు రాత్రులు ఇక్కడే ఉన్నాం కదా అని అంటే దానికి బామ్మ మూడు రాత్రులు అంటే అది కాదు అని తొలిరేయి అని చెప్తుంది. కనకం, విహారి ఇద్దరూ షాక్ అయిపోతారు.
విహారి షాక్ అయిపోయి మామయ్య గారు ఈ రోజు రాత్రే బయల్దేరుతాం అని అంటాడు. దానికి బామ్మ చూడు మనవడా ఇలాంటి వాటికి అడ్డు పడకూడదని అంటుంది. ఇంతలో పంతులు వచ్చి ఈ రోజు రాత్రి ముహూర్తం అని చెప్తాడు. కననం, విహారి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతారు. ఇక ఆదికేశవ్ కనకం, విహారిలతో పంతులుకి తాంబూలం ఇప్పిస్తారు. ఇద్దరినీ ఆశీర్వదిస్తారు. మీకు పండండి బిడ్డ పుడతారు చూస్తూ ఉండండి అని చెప్తారు. ఆదికేశవ్‌కి విహారి ఏదో చెప్పబోతే నాకు ఒక్కర్తే బిడ్డ అచ్చటా ముచ్చటా మేం చూసుకోవాలి అని అంటాడు. ఈ ఒక్క కార్యక్రమం మా ఇంట్లో అయితే మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నారని మేం నమ్ముతామని అంటాడు. విహారి మౌనంగా ఉంటే అర్థాంగికారం అని చెప్పి ఆదికేశవ్ వెళ్లిపోతాడు. ఇక కనకం తల్లికి నచ్చచెప్పబోతే గౌరీ వద్దని మీ నాన్న కోసం ఒప్పుకో అని అంటుంది. ఇక రాణి అయితే కొత్తగా పెళ్లి అయిన వాళ్లు ఎందుకు ఫస్ట్‌నైట్‌కి ఇంత భయపడుతున్నారేంటి అనుకుంటుంది.
కనకం, విహారిలు గదిలో మాట్లాడుకుంటారు. నా వల్ల మీకు ఇబ్బంది ఎదురవుతుందని మీకు ఇష్టం లేనివి ఎదురువుతున్నా భరిస్తున్నారు నన్ను క్షమించండి అని అంటుంది. అలా ఏం లేదు అని విహారి అంటాడు. మీ అమ్మానాన్నల సంతోషం కోసం ఒకే గదిలో ఉన్నాం ఇప్పుడు వాళ్ల సంతోషం కోసం ఫస్ట్‌నైట్ చేసుకున్నట్లు నటిద్దామని అంటాడు. మీకు చాలా రుణపడిపోయానని కనకం అంటుంది. ఇక మరోవైపు సహస్ర, పద్మాక్షి, యమున వాళ్లు ఇంటికి వస్తారు. ఇక సహస్ర పండుని చూసి విహారిని తన దగ్గరకు పంపినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. నేను పంపడం ఏంటి అని పండు బిక్కు ముఖం పెడతాడు. నేను పంపలేదు అని చెప్తాడు. అది విన్న అంబికకు అనుమానం వస్తుంది. ఇక సహస్ర ముంబయి నుంచి బావ వచ్చాడని చెప్పడంతో పండుకి విషయం అయి మ్యానేజ్ చేయాలని నేను పంపాను మర్చిపోయానని చెప్తాడు.
పండు బయటకు ఒకటి చెప్తున్నాడు లోపల ఒకటి దాస్తున్నాడని అంబిక అనుకుంటుంది. పండు దగ్గరకు వెళ్లి మా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నావా అని అడుగుతుంది. పెద్ద పెద్ద విషయాలే చెప్పేసే నువ్వు చిన్నవిషయాలకు తడబడుతున్నావ్ అని అంటుంది. లేదు అని పండు అంటే విహారి ముంబయి నుంచి వచ్చాడా దిల్లీ నుంచి వచ్చాడా అంటే పండు ముంబయి నుంచి అని చెప్తాడు. నిజం తెలిస్తే నీ పని అయిపోతుందని పండుతో అంటుంది. నన్ను ఇరికిస్తున్నావేంటి దేవుడా అని పండు అనుకుంటాడు. ఇక రాత్రి విహారిని ఫస్ట్‌నైట్ కోసం రెడీ అవుతాడు. కనక మహాలక్ష్మీని రాణి వాళ్లు రెడీ చేస్తారు. అమెరికాలో ఫస్ట్‌నైట్ ఎలా జరిగిందని రాణి అంటే అక్కడేం అవ్వలేదు అని కనకం అంటే ఇదేనా మొదటి రాత్రి అని అంటుంది. ఇక కనకం మీద రాణి సెటైర్లు వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రాజీనామాని తాత ముఖం మీద విసిరి కొట్టిన కార్తీక్.. దీపే సర్వస్వం అని తేల్చేశాడుగా!