Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 13th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చిన్నదో వైపు పెద్దదో వైపు.. పాపం విహారి ఇలా బుక్ అయిపోయాడేంటో!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్ర వాళ్లు కూడా గుడిలోనే ఉంటామని చెప్పడంతో విహారి బిత్తరపోతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి సహస్ర వాళ్లకి దొరికిపోవడంతో సహస్ర కోసమే వచ్చానని చెప్తాడు. దాంతో సహస్ర చాలా సంతోషిస్తుంది. నువ్వు వస్తే బాగున్ను బావ అనుకున్నా నువ్వు వచ్చేశావ్ అని అంటుంది. నీ మీద ప్రేమ పొంగిపోతే వచ్చేస్తాడని అన్నాను వచ్చేశాడు కదా అని వసుధ అంటే సహస్ర వసుధని ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత సహస్ర విహారికి ముద్దు పెట్టుకుంటుంది. ఇక యమున విహారిని సహస్రతో కలిసి కోనేటిలో దీపం వదలమని మీకు మంచి జరుగుతుందని అంటుంది. అందరూ కోనేటి దగ్గరకు వెళ్తారు. విహరి చేతలు మాటలు అన్నీ అనుమానంగా ఉన్నాయని తడబడుతున్నాడని అంబిక అనుమానిస్తుంది. ఏదో ఉందని అది తెలుసుకుంటానని అంటుంది. ఇక విహారి, సహస్ర అందరూ కోనేటిలో దీపాలు వదలుతారు. కనకం దూరం నుంచి చూస్తుంటుంది.
విహారి, సహస్రలను ఇలా కలిపావా స్వామి వాళ్లిద్దరూ ఒకటవబోతున్నారని మరోసారి రుజువు చేశారా అనుకుంటుంది. మరోవైపు ఆదికేశవ్, గౌరీ వాళ్లు ఇంకా అల్లుడు కూతురు రాలేదని టెన్షన్ పడుతుంటారు. శుభమా అని గుడికి వస్తే ఈ అపశకునం ఏంటి అని అనుకుంటారు. ఇక ఆదికేశవ్ చూసి వస్తానని బయల్దేరుతాడు. ఇక విహారి వాళ్లు ఓ చోట కూర్చొంటారు. విహారి మనసులో ఇప్పుడు కానీ ఆదికేశవ్ తనని చూస్తే పెద్ద సునామీనే వస్తుందని అనుకొని బిత్తర చూపులు చూస్తాడు. విహారిని గమనించిన సహస్ర ఎందుకు అలా చూస్తున్నావ్ ఏమైందని అడుగుతుంది. అంబిక కూడా విహారి ఎవరినో వెతుకుతున్నాడు ఎందుకో కంగారు పడుతున్నాడని అంటుంది. విహారి బలవంతంగా నవ్వి కవర్ చేస్తాడు. వెనకాలే కనక మహాలక్ష్మీ చూస్తూ ఉంటుంది. యమున కూడా విహారితో నాకు అలాగే అనిపిస్తుంది ఏమైంది విహారి చెప్పు అని అంటుంది. కొత్త ప్లేస్ కొత్త గుడి కదా చూస్తున్నా అంటాడు. అంబిక మనసులో విహారి బాగానే కవర్ చేశావని అనుకుంటుంది.
మరోవైపు లక్ష్మీ తన తండ్రి విహారి వైపు రావడం చూస్తుంది. విహారిని సహస్రతో తన తండ్రి చూస్తే ఇక అంతే సంగతులు అనుకొని విహారిని పిలుస్తుంది. విహారి ఆదికేశవ్‌ని చూసి రచ్చ రచ్చ అవుతుందని అక్కడి నుంచి తప్పించుకోవాలని చిన్న పని అని చెప్పి బయటకు వస్తాడు. సహస్ర విహారి వెనకే వస్తుంది. అర్జెంట్ ఆఫీస్ కాల్ అని విహారి చెప్పి బయటకు వెళ్తాడు. ఇక సహస్ర తల్లివాళ్ల దగ్గరకు వెళ్తుంది. అటుగా వచ్చిన ఆదికేశవ్ పద్మాక్షి, యమున వాళ్లని చూసి అక్కడికి వెళ్తాడు. సహస్ర వాళ్లు ఆదికేశవ్‌తో మంచిగా మాట్లాడుతారు. మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుందని ఆదికేశవ్ చెప్తాడు. మీరు కోరుకున్న వ్యక్తితోనే మీ అమ్మాయి పెళ్లి జరుగుతుందని ఈరోజు రాత్రి ఈ గుడిలోనే పడుకోమని చెప్తాడు.
యమున సరే అంటుంది. పద్మాక్షి మాత్రం యమున మీద ఫైర్ అవుతుంది. వసుధ అంబికలు మాత్రం ఉందాంలే అక్క ఇంత వరకు వచ్చాం కదా ఆ ఒక్కటీ పూర్తి చేసి వెళ్దాం అంటుంది. ఇక లక్ష్మీ విహారి కలుసుకుంటారు. కనకం విహారితో అమ్మానాన్నని నేను ఇంటికి తీసుకెళ్తా మీరు వాళ్లని పంపేసి రండి అని చెప్తుంది. కనకం తన తండ్రితో కలిసి మాట్లాడి విహారి తర్వాత వస్తారని చెప్తుంది. ఇక విహారి సహస్ర వాళ్ల దగ్గరకు వెళ్తే పద్మాక్షి విహారితో ఈ రాత్రి మనం ఇక్కడే ఉంటాం అని చెప్తుంది. విహారి బిత్తరపోతాడు. రాత్రికి ఇక్కడ ఉంటే వాళ్లకి దొరికిపోతానని అనుకొని ఇక్కడెందుకు అని అంటాడు. నాకు అర్జెంట్ పని ఉంది విజయవాడ వెళ్లాలని అంటాడు. నాకు తెలియని ఆఫీస్ పనులు నీకు ఏంటి విహారి అసలు మనకు విజయవాడలో బ్రాంచ్‌లే లేవని అంబిక అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















