Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: ప్రకాశ్, లక్ష్మీలకు పెళ్లితంతు.. సహస్ర, విహారిల హనీమూన్.. అసలేం జరుగుతుంది?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode August 16th లక్ష్మీ, ప్రకాశ్‌లకు పెళ్లి తంతు చేయాలని సహస్ర, విహారిలను హనీమూన్‌కి పంపాలని ఇంట్లో నిర్ణయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీని పట్టుకున్నాడని విహారి ప్రకాశ్‌ని చితక్కొడతాడు. అందరూ రావడం చూసిన ప్రకాశ్ తల మీద ఫ్లవర్‌వాజ్‌తో కొట్టుకుంటాడు. ఏంటి విహారి లక్ష్మీ చేయి పట్టుకున్నానని నా తల పగల గొడతావా అని అంటాడు. అందరితో విహారి కొట్టాడని చెప్తాడు.
విహారి తనేం చేయలేదని అంటాడు. వాళ్ల కాపురంలో నీ జోక్యం ఏంటి విహారి అని అంబిక అడుగుతుంది. నీ భార్య నీ కాపురం నువ్వు చూసుకోకుండా వాళ్ల కాపురంలో జోక్యం చేసుకోవడానికి నీకేంటి పని అని అడుగుతుంది పద్మాక్షి. సహస్ర విహారితో బావ ఇక నువ్వు లక్ష్మీ గురించి ఆలోచించొద్దు.. తన భార్యని తాను చూసుకుంటాడని అంటుంది. ప్రకాశ్ అందరితో విహారి గురించి ఎవరూ తప్పుగా అనుకోవద్దు ముఖ్యంగా నువ్వు సహస్ర.. విహారిని తప్పుగా అనుకోవద్దు.. నేను లక్ష్మీ చేయి పట్టుకోగానే లక్ష్మీ ఇబ్బందిగా ఫీలైంది దానికి విహారి రియాక్ట్ అయ్యాడని అంటాడు. నా భార్యని నేను ఆ రోజు వదిలి వెళ్లడం వల్లే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ అని అని అంటాడు.
విహారి మనసులో నిన్ను చంపకుండా అనవసరంగా వదిలేశాను అనుకుంటాడు. మీ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అనే కదా ఇలా ఒకే గదిలో ఉంచామని అంటారు. ఇక సహస్ర అయితే వాళ్ల ఇద్దరి మధ్య సఖ్యత కుదరాలి అంటే అందరి ముందు దండలు మార్చుకునేలా చేయాలని అంటుంది. అంబిక, పద్మాక్షిలు పెళ్లి గుర్తు చేయడానికి పెళ్లి తంతు గుర్తు చేయాలి అంటారు. ఇప్పుడు ఎందుకు అని వసుధ సహస్రని అడిగితే ఇప్పుడే కావాలి పిన్ని నేను బావ ఎల్లుండి నుంచి కొన్ని రోజులు ఇక్కడ ఉండమని అంటుంది. మనం ఎక్కడికి వెళ్తాం అని విహారి అడుగుతాడు. ఇంకెక్కడికి మీ హనీమూన్‌కి విహారి అని పద్మాక్షి చెప్తుంది. వదిన మీరు చెప్పలేదా అని పద్మాక్షి అడుగుతుంది. దాంతో యమున మర్చిపోయాను అని చెప్పి విహారితో నువ్వు సహస్రలు అమెరికా వెళ్లండి హనీమూన్ అయిన తర్వాత రండి అని చెప్తుంది. సహస్ర విహారి మన హనీమూన్‌కి అన్ని ఏర్పాట్లు అయ్యావని అంటుంది. యమున విహారితో నీకు ఏ పనులు ఉన్నా పక్కన పెట్టేసి వెళ్లు అని అంటుంది. ఎలక్షన్స్ ఉన్నాయి అని విహారి అంటే వాటి కంటే నీ పర్సనల్ లైఫ్ ముఖ్యం నువ్వు ఎల్లుండి ప్రయాణానికి సిద్ధమైపో అని అంటుంది.
విహారి వసుధ, చారుకేశవలతో నేను ఇప్పుడేం చేయాలి అని అంటాడు. నేను హనీమూన్‌కి వెళ్లను అంటాడు. లక్ష్మీ విహారితో నా సంగతి వదిలేయండి మీరు వెళ్లండి అంటుంది. నీ సంగతి ఎలా వదిలేయాలి నా కళ్ల ముందే ఆ ప్రకాశ్ గాడు నీ మెడలో దండ వేస్తానంటే ఎలా ఊరుకోవాలి అని అడుగుతాడు. యమునమ్మ గారి ఆరోగ్యం బాలేదు ఆవిడ చెప్పినట్లు చేయమని అంటుంది. వసుధ వాళ్లు కూడా యమునని బాధ పెట్టొద్దని అంటుంది. అందరూ విహారితో ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టు మిగతావి మేం చూసుకుంటామని అంటారు.
లక్ష్మీ గదిలో వసుధ లక్ష్మీలా పడుకోవడానికి వెళ్తుంది. చారుకేశవ, లక్ష్మీ, పండు రత్నబాబు ఎవరిని కలుస్తాడా అని ఆ లొకేషన్‌కి వెళ్తారు. రత్నబాబు అంబికకు కాల్ చేసి నేను ముఖ్యమైన డీలింగ్ విషయంలో బయటకు వెళ్తున్నాను లక్ష్మీ గదిలో ఉందో లేదో చూడమని చెప్తాడు. అంబిక వెళ్తుంది. లక్ష్మీలా వసుధ పడుకోవడం చూసి లక్ష్మీ పడుకుందని అనుకుంటుంది. తర్వాత రత్నబాబుకి కాల్ చేసి లక్ష్మీ ఇంట్లోనే ఉందని చెప్తుంది. రత్నబాబు వచ్చిన హోటల్‌కి లక్ష్మీ బుర్గా వేసుకుంటే చారుకేశవ ముస్లింలా రెడీ అవుతాడు. ముగ్గురు రత్నబాబు చూస్తారు.
లక్ష్మీ పండుతో సర్వర్‌లా వెళ్లి గదిలో కెమెరా ఫిక్స్ చేయమని అంటుంది. చారుకేశవ ముస్లిం గెటప్‌లో రత్నబాబు వాళ్లని ఫాలో అవుతాడు. లక్ష్మీ వెళ్లి రూం కావాలని రత్నబాబు పక్క రూం తీసుకుంటుంది. పండు కంగారుగా రత్నబాబుని ఢీకొడతాడు. పండు కంగారు చూసి రత్నబాబు ఏంట్రా ఆ కంగారు అని ప్రశ్నలు వేస్తాడు. ఫారెన్ వీఐపీలు వచ్చారని వాళ్లని చూసుకోవడానికి వచ్చానని లక్ష్మీ కాల్‌లో చెప్పిన డిటైల్స్ చెప్తాడు. రత్నబాబు వాళ్ల దగ్గరకు పండుని తీసుకెళ్తాడు. రత్నబాబు వాళ్లు పండుకి మందు సర్వ్ చేయమని చెప్తాడు. పండు బాటిల్ ఓపెన్ చేయలేకపోతాడు. దాంతో వాడి మీద డౌట్‌గా ఉంది చెక్ చేయమని రత్నబాబు అంటాడు. రత్నబాబు మనుషులు పండుని చెక్ చేస్తారు. పండు చాలా కంగారు పడతాడు. ఈ రోజుతో దొరికిపోతానని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















