![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kalavari Kodalu Kanaka Mahalakshmi August 13th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చెల్లి మాటలకు ఆదికేశవ్‌కి గుండెపోటు.. విహారి తల్లికి ఫిట్స్, ఒకే హాస్పిటల్లో కనకం, విహారిలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సౌధామణి మాటలకు ఆదికేశవ్‌కి హార్ట్ఎటాక్ రావడం విహారి తల్లికి ఫిట్స్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Kalavari Kodalu Kanaka Mahalakshmi August 13th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చెల్లి మాటలకు ఆదికేశవ్‌కి గుండెపోటు.. విహారి తల్లికి ఫిట్స్, ఒకే హాస్పిటల్లో కనకం, విహారిలు! kalavari kodalu kanaka mahalakshmi serial today august 13th episode written update in telugu Kalavari Kodalu Kanaka Mahalakshmi August 13th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చెల్లి మాటలకు ఆదికేశవ్‌కి గుండెపోటు.. విహారి తల్లికి ఫిట్స్, ఒకే హాస్పిటల్లో కనకం, విహారిలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/13/0c1dd03dd1bdb37a0855787db5bafc4c1723545733620882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకమహాలక్ష్మీని తన కోడలిగా చేసుకోనని సౌధామణి అంటుంది. తన ఆస్తి మీద కన్నేశావా లేక నీ కూతుర్ని వంక పెట్టుకొని అమెరికా వచ్చి సెటిల్ అయిపోవాలని చూస్తున్నావా అని అడుగుతుంది. అవసరం అయితే నీకు డబ్బు పడేస్తానని నీ స్థాయికి తగ్గ సంబంధం తెచ్చి నీ కూతురికి పెళ్లి చేసుకోమని అంటుంది. ఇక కనకమహాలక్ష్మీ తన తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదని అంటుంది. దాంతో సౌధామణి కనకమహాలక్ష్మీని కొట్టడానికి చేయి ఎత్తుతుంది.
ఆదికేశవ్: దించు చేయి.. అమెరికా వెళ్లిన కూడా ఇంకా బంధాలు బంధుత్వాలకు విలువ ఇస్తున్నావేమో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నావేమో అనుకున్నాను కానీ నా నమ్మకాన్ని ఒమ్ము చేశావ్. గుణ గణాల్లో వ్యక్తిత్వాల్లో ఆస్తి అంతస్తులో నీకు మించిన వాడిని నా ఆస్తి అమ్మి అయినా సరే కోటి రూపాయలు కట్నం ఇచ్చి నా కూతురిని అమెరికా అడుగు పెట్టేలా చేయకపోతే నా పేరు ఆదికేశవే కాదు. ఇన్నాళ్లు నేను బతికింది బతుకే కాదు. దీనికి నా కూతురు మీద నాకు ఉన్న ప్రేమే సాక్ష్యం.
సౌధామణి: నీ కూతుర్ని వద్దు అన్నందుకు ఇంత మందిలో నా పరువు తీస్తావు కదా నీ కూతురికి ఎలా పెళ్లి చేస్తావో నేను చూస్తాను అన్నయ్య.
ఆదికేశవ్: అలా పిలవకు. నన్ను అలా పిలిచే అర్హత కోల్పోయావు. పోండి వెళ్లిపోండి నా కంటికి కనిపించనంత దూరం వెళ్లిపోండి.
సౌధామణి ఫ్యామిలీ వెళ్లిపోతుంది. ఆదికేశవ్ చెల్లి చేసిన ద్రోహం గుర్తు చేసుకొని కుంగిపోతాడు. ఊరి వారి ముందు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధ పడతాడు. కూతుర్ని క్షమించమని అడుగుతాడు. చెల్లి చేసిన అవమానం తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోతాడు. కనకమహాలక్ష్మీ, గౌరీతో పాటు అందరూ టెన్షన్ పడతారు. అక్కడే ఉన్న విహారి ఫ్రెండ్ సాయంతో హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. మరోవైపు విహారి, అతని తల్లి యమున ఇంటికి చేరుకుంటారు. మీ నానమ్మ అత్తయ్య అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు ఇంట్లోకి రాలేనని విహారి తల్లి చెప్తుంది. విహారి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్తాడు. మీ అత్తయ్య వస్తాను అని అందా అని నానమ్మ కాదంబరీ అడుగుతుంది.
కాదంబరీ కోడలు యమునని తిడుగుతుంది. విహారి కలుగజేసుకొని కాళ్లు పట్టుకున్నా సెక్యూరిటీతో గెంటించేసిందని అంటుంది. కాదంబరీ మాటలకు యమున బాధపడుతుంది. టెన్షన్‌లో యమునకు ఫిట్స్ వచ్చేస్తుంది. కుప్పకూలిపోతుంది. విహారి తల్లి దగ్గరకు పరుగులు తీస్తాడు. తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. మరోవైపు కనకమహాలక్ష్మీ వాళ్లు కూడా హార్ట్ అటాక్ వచ్చిన తండ్రిని అదే హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. యమునకు ఏం కాలేదని వర్రీ ఏం లేదని డాక్టర్ బయటకు వచ్చి చెప్తారు. విహారి ఊపిరి పీల్చుకుంటాడు. కనకమహాలక్ష్మీ, తన తల్లి కూడా గట్టిగా ఏడుస్తారు. ఇక రాజీ కూడా వస్తుంది. కనకమహాలక్ష్మీకి ధైర్యం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)