Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సీక్రెట్ పెళ్లేంటి? ప్రకాశ్ లక్ష్మీకి భర్తేంటి? ఈ షాకింగ్ ట్విస్ట్ వెనుక ఏం జరగనుంది?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode August 11th లక్ష్మీ భర్తని అంటూ ప్రకాశ్ సాక్ష్యాలు తీసుకొని రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర లాయర్ నెంబరు అడగటంతో పద్మాక్షి ప్రశ్నిస్తుంది. పెళ్లికి ముందు బాగానే ఉన్నావ్ కానీ పెళ్లి తర్వాత నువ్వు నువ్వులా లేవు.. నీ లైఫ్‌లో జరిగిన ప్రతీది నాకు చెప్పేదానివి ఇప్పుడు నాకు ఏం చెప్పడం లేదు.. పెళ్లి అయింది అని పరాయి దానివి చేస్తున్నావా అని అడుగుతుంది. దాంతో సహస్ర అలా ఏం లేదమ్మా.. అత్తా బావ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకేం బాధ లేదని అంటుంది.
సహస్ర మనసులో నీకు ఆ లక్ష్మీ గురించి తెలిస్తే ఊరుకోవు నానా రచ్చ చేస్తావని చెప్పడం లేదని అంటుంది. ఇక చారుకేశవ సిల్క్ నామినేషన్ పత్రాలు తీసుకొచ్చి విహారికి ఇస్తాడు. విహారి వాటిని చూసి లక్ష్మీకి ఇచ్చి చూడమని అంటాడు. ప్రాజెక్ట్ రాలేదని తెలిసి పద్మాక్షి, అంబిక, సహస్రలు లక్ష్మీ అపశకునం, అశుభం, నల్లపిల్లి అని అంటారు. విషయం తెలీకుండా ఏదో ఒకటి అంటారా అని అడుగుతాడు. లక్ష్మీ మన దేవత అని విహారి అంటాడు. నీకు అది దేవతలా ఎలా కనిపిస్తుందిరా .. అది కాలు ఇంట్లో మోపింది ఇంట్లో గొడవలు వచ్చాయ్.. కంపెనీలో కాలు పెట్టింది ఎప్పుడూ చూడనన్ని నష్టాలు చూశామని అంటారు. ఇలాంటి దిక్కూ ముక్కూ లేని వాళ్లని చేరదీస్తే ఇలాగే ఉంటుందని పద్మాక్షి అంటుంది.
పద్మాక్షి అలా అనగానే తనకు నేను ఉన్నాను ఆంటీ అని ప్రకాశ్ లగేజ్‌తో ఎంట్రీ ఇస్తాడు. లక్ష్మీ దిక్కూముక్కు లేనిది కాదు తను నా మనిషి అని అంటుంది. ప్రకాశ్ నువ్వేంట్రా తన గురించి అలా మాట్లాడుతున్నావ్ అని యమున అడుగుతుంది. ప్రకాశ్ విహారి కాళ్లు పట్టి క్షమించమని అడుగుతాడు. అందరికీ చాలా థ్యాంక్స్ అని ప్రకాశ్ అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావ్‌రా అని విహారి అడుగుతాడు. దాంతో ప్రకాశ్ అందరితో లక్ష్మీకి భర్త ఉన్నాడు అని చెప్తాడు. లక్ష్మీ, యమున, విహారి అందరూ టెన్షన్ చేస్తారు.
లక్ష్మీకి భర్త ఉండి కూడా అనాథగా ఉంటుంది. లక్ష్మీ చేయి పట్టి లక్ష్మీ నన్ను క్షమించు. నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టాను. లక్ష్మీ మెడలో తాళి కట్టింది నేనే.. తనని మోసం చేసింది నేనే అని అంటాడు. విహారి, చారుకేశవ, పండు ముగ్గురు కలిసి ప్రకాశ్‌ని చితక్కొడతారు. లక్ష్మీ నీ భార్య అనడానికి సాక్ష్యం ఏంటి అని అంబిక అడిగితే లక్ష్మీ మెడలో తాళి అని చెప్తాడు. నువ్వు తన భర్త అయితే లక్ష్మీ ఎందుకు గుర్తు పట్టడం లేదు అని అడుగుతారు. లక్ష్మీనే కాదు నేను నా భార్య ఎవరో తెలీకుండా తాళి కట్టానని అంటాడు. కట్టు కథలు చెప్తున్నావ్ అని విహారి అంటే నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు కదా అంటాడు. అందరూ తాళి కాకుండా ఇంకేమైనా సాక్ష్యం అడుగుతారు. దాంతో ముఖాలు కప్పేసి పెళ్లి చేసుకున్నట్లు ఫొటో చూపిస్తాడు.
రాజమండ్రిలో ఊరి సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా పూలతో ముఖం కప్పేసి పెళ్లి చేసుకున్నామని అంటాడు. తనని వదిలేసి వెళ్లిపోయిన తర్వాత అమెరికాలో ఒంటరిగా బతకలేక రాజమండ్రి వచ్చి భార్య కోసం వెతికి ఎవరా అని అనుకొని రిజిస్టర్ ఆఫీస్‌లో నా భార్య పేరు కనకమహాలక్ష్మీ అని తెలిసి గుర్తు పట్టానని అంటాడు. కనక మహాలక్ష్మీ ఏంటి తన పేరు లక్ష్మీ అని సహస్ర అంటే పూర్తి పేరు కనకమహాలక్ష్మీ అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. వాడు ఫ్రాడ్ నమ్మొద్దు అని లక్ష్మీ అంటుంది. దాంతో ప్రకాశ్ నేను నీ భర్త కాదు అని నువ్వు నమ్మితే మరి నీ భర్త ఎవరు అని అడుగుతాడు. లక్ష్మీ ఏం మాట్లాడదు. సర్టిఫికేట్ లో సంతకం లక్ష్మీదే అని లక్ష్మీతో పాటు అందరూ అంటారు. ఇప్పటికైనా తన భర్త వచ్చాడు సంతోషం అని అనుకుంటారు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















