Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 7th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఐసీయూలో లక్ష్మీ.. దేవుడితో గొడవపడుతున్న విహారి.. లక్ష్మీ బతుకుతుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode అంబిక రౌడీలను పెట్టి లక్ష్మీకి యాక్సిడెంట్ చేయించడం లక్ష్మీ ఐసీయూలో ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode స్వామీజీ అమ్మవారి విగ్రహంతో ఏమిటమ్మా నీ లీల ఈ సమస్యకి పరిష్కారం ఏంటి. ఇద్దరు అమ్మాయిల్లో ఒకరికి న్యాయం చేస్తే మరో అమ్మాయికి జీవితాంతం కన్నీరే మిగులుతుంది. రెండు కుటుంబాల్లో ఒక కుటుంబం సంతోషంగా ఉంటే మరో కుటుంబానికి జీవితకాలం దుఃఖమే మిగులుతుంది అని అనుకుంటారు.
రౌడీలతో అంబిక బేరం..
అంబిక రౌడీలను కలిసి వాళ్లకి డబ్బు ఇచ్చి లక్ష్మీని చంపేస్తే మీరు ఊహించనంత డబ్బు ఇస్తానని లక్ష్మీ ఫొటో వాళ్లకి పంపిస్తుంది. లక్ష్మీని చంపేసి కాల్ చేయమని చెప్తుంది. ఈ రోజుతో లక్ష్మీకి తానేంటో తెలుస్తుందని అంటుంది.
వంటావార్పులో విహారి..
విహారి చెఫ్ గెటప్ వేసుకొని కూరగాయలు ముందేసుకొని నీ వంట చేస్తా లక్ష్మీ అని చెప్తాడు. అందరూ వచ్చేస్తారని లక్ష్మీ అంటే అప్పుడే ఎవరూ రారులే నీ కోసం వంట చేయాలి అని ఎప్పటి నుంచో అనుకున్నా అని వంట చేస్తాడు. లక్ష్మీ దూరం నుంచి చూసి సంబరపడిపోతుంది. విహారి వంట పూర్తి చేసి లక్ష్మీని తినడానికి పిలుస్తాడు. ఇంతలో పద్మాక్షి, సహస్ర అందరూ వచ్చేస్తారు.
విహారిని చూసి షాక్..
విహారిని చెఫ్‌లా చూసి అందరూ షాక్ అయిపోతారు. నువ్వేంటి ఆ గెటప్ ఏంటి అని అంటే వంట చేశా అని అంటాడు.. వంటలే రాని నువ్వు వంట చేయడం ఏంటి అని సహస్ర అడిగితే విహారి సహస్రతో నీ కోసమే చేశా సహస్ర అని అంటాడు. వెంటనే సహస్ర టెస్ట్ చేసి అదుర్స్ అంటూ మురిసిపోతుంది. యమున అందరినీ కూర్చొమని వడ్డిస్తానని అంటుంది. ఇక దాక్కున్న లక్ష్మీ ఆఫీస్‌కి వెళ్లిపోతుంది.
లక్ష్మీకి యాక్సిడెంట్..
అంబిక చెప్పిన రౌడీలు లక్ష్మీని ఫాలో అవుతారు. అంబిక కాల్ చేసి త్వరగా పని అయిపోవాలి అంటుంది. విహారి మనసులో తన కోసం చేసిన వంట తానే తినకుండా అయిపోయింది. నోటి వరకు వచ్చిన ముద్ద తినే యోగం కనకానికి లేదు పాపం తనని ఈ జీవితంలో సుఖ పడే రాత రాశాడో లేదో అనుకుంటాడు. లక్ష్మీ విహారి గురించి ఆలోచిస్తూ ఈ చిన్ని చిన్ని సంతృప్తిలు నాకు చాలు విహారి గారు నా కోసం ఆలోచిస్తున్నాడని అనుకుంటుంది. రౌడీలు ఆటో ఆపి రాష్ డ్రైవింగ్ అని డ్రైవర్‌తో గొడవ పడతాడు. లక్ష్మీని వదిలేసి డ్రైవర్ వెళ్లిపోతాడు. లక్ష్మీ నడిచి వెళ్తుంటే రౌడీలు వ్యాన్‌తో గుద్దేస్తారు. లక్ష్మీ తలకు డివైడర్ తగిలిపోతుంది. చాలా రక్తం వస్తుంది.
విహారికి తెలిసిన మ్యాటర్..
లక్ష్మీని చూసిన ఇద్దరూ వ్యక్తులు యాక్సిడెంట్ అయిందని లక్ష్మీ ఫోన్ నుంచి విహారి కాల్ చేసి అడ్రస్ చెప్తారు. విహారి పరుగులు తీస్తాడు. విహారి వెళ్లే సరికి లక్ష్మీ పైకి పోతుందని అంబిక నవ్వుకుంటుంది.. విహారి లక్ష్మీని చూసి షాక్ అయిపోతాడు. లక్ష్మీని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఏడుస్తూ లక్ష్మీని తీసుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతాడు
నేను బతకను విహారి గారు..
కనకంతో విహారి నీకేం కాదు అని ధైర్యం చెప్తే నేను బతకను అండీ మిమల్ని చూశాను మీ చేతుల్లో ప్రాణం వదిలేస్తా అంటుంది. నువ్వు నా కోసం బతకాలి అని లక్ష్మీ అంటుంది. లక్ష్మీని హాస్పిటల్‌లో చేర్పిస్తాడు. ఇంటి దగ్గర అందరూ ఎవరికి యాక్సిడెంట్ అయింది ఎందుకు విహారి పరుగులు తీశాడని కంగారు పడతారు. యమున విహారికి కాల్ చేస్తుంది. లక్ష్మీకి యాక్సిడెంట్ అయిందని తెలిసి యమున షాక్ అయిపోతుంది. పెద్ద యాక్సిడెంట్ జరిగిందని ఐసీయూలోకి తీసుకెళ్లారని చెప్తాడు. అందరూ లక్ష్మీ దగ్గరకు బయల్దేరుతారు.
నాతో ఎందుకు తాళి కట్టించావ్..
లక్ష్మీకి ఆపరేషన్ అవుతుంది. అది చూసిన విహారి అక్కడే ఉన్న వినాయకుడి దగ్గరకు వెళ్లి నువ్వు అసలు దేవుడేనా. దేవుడివి అయితే కనక మహాలక్ష్మీ ఈ పరిస్థితిలో ఎందుకు ఉంది. అసలు తను ఏం అనుభవించింది. సంతోషంగా ఉంటే లక్ష్మీని నాతో ఎందుకు తాళి కట్టించావ్ నా ఇంటికి ఎందుకు పంపావ్ అసలు నా వల్లే అన్ని సమస్యలు ఎందుకు సృష్టించావ్ అని అడుగుతాడు. చావు బతుకుల మధ్య కొట్టుకుంటుంది జాలి ఉంటే కాపాడు అని అంటాడు. లక్ష్మీకి ఏమైనా అయితే పూర్తి బాధ్యత నీదే. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!






















