Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 3rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీకి ఇక ఏ టెన్షన్ లేనట్లే.. ఫ్యామిలీ మొత్తానికి వార్నింగ్ ఇచ్చిన విహారి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విష్ణు అంబిక మనిషి అని తెలుసుకున్న విహారి ఇంట్లో అందరికీ విషయం చెప్పి లక్ష్మీ విషయంలో అందరికీ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విష్ణు లక్ష్మీని తీసుకొని సిటీకి దూరంగా తీసుకెళ్తాడు. అక్కడ చూస్తే ఎవరూ ఉండరు. విష్ణు లక్ష్మీని చంపడానికి గుణ అనే తన మనిషిని పిలుస్తాడు. అతను ఓ పెద్ద ఇనుప రాడ్ విష్ణుకి అందిస్తాడు. దాంతో విష్ణుని లక్ష్మీని కొట్టబోయే టైంకి విహారి వచ్చి అడ్డుకుంటాడు. విష్ణుని చితక్కొట్టి తనని ఎవరు పంపారని అడుగుతాడు.
నన్ను పంపింది అంబికా మేడమే..
విష్ణుని చితక్కొట్టి చంపేస్తానని బెదిరించడంతో అంబిక తనని పంపిందని విష్ణు చెప్పేస్తాడు. విహారి షాక్ అయిపోతాడు. విష్ణుని తాళ్లతో కట్టేసి డిక్కీలో వేస్తాడు. లక్ష్మీ కళ్లు తిరుగుతున్నాయని చెప్తే లక్ష్మీని కారు ఎక్కించి ఇంట్లో తేల్చాల్సిన విషయాలు ఉన్నాయని అంటాడు. లక్ష్మీ మత్తులో ఉండటం వల్ల విహారి మీద పడిపోతుంది. ఇంటికి వచ్చి విహారి లక్ష్మీని లోపలికి తీసుకెళ్తాడు. పండుకి చెప్పి డిక్కీలో ఉన్న వెదవని తీసుకురమ్మని చెప్తాడు. పండు వాడిని కొట్టి తీసుకొస్తాడు. లక్ష్మీని విహారి ఇంట్లో కూర్చొపెట్టి అందరినీ పిలుస్తాడు.
ఎందుకు చేశావ్ అత్తయ్యా..
అందరూ వచ్చి లక్ష్మీని చూసి షాక్ అయిపోతారు. లక్ష్మీ మళ్లీ వచ్చేసిందేంటి అని అందరూ షాక్ అయిపోతారు. ఆయన్ను ఎందుకు కట్టేసి కొట్టారని యమున అడిగితే వాడో పెద్ద ఫ్రాడ్ అని విహారి చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. అంబిక కంగారు పడుతుంది. ఫోటోలు, సర్టిఫికేట్ అన్నీ ఫేక్ అని చూపిస్తాడు. ఎవర్రా నిన్ను ఇదంతా చేయమన్నారు అని అడుగుతాడు. విష్ణు అంబికా మేడం అని చెప్తాడు. ఎందుకు అత్తయ్యా ఈ పని చేశావ్ అని విహారి అడుగుతాడు.
మదన్ కోసమే ఇదంతా..
విహారి అంబికను ప్రశ్నించే సరికి అంబిక ఇదంతా మదన్ కోసమే చేశానని చెప్తుంది. ఇలా చేస్తేనైనా మదన్‌తో పెళ్లికి ఒప్పుకుంటుందని ఇలా చేశానని చెప్తుంది. సహస్రకు అడ్డు వస్తుందని మదన్‌తో పెళ్లి అయిపోతే ఏ ప్రాబ్లమ్ ఉండదని ఇలా చేశానని అంటుంది. నువ్వు మంచి ఉద్దేశంతో చేశావు అత్తయ్య లక్ష్మీని తీసుకెళ్లి వీడేం చేశాడో తెలుసా అని లక్ష్మీని చంపడానికి ప్రయత్నించడం గురించి చెప్తాడు. విహారికి మొత్తం తెలియక ముందే విష్ణుని పంపించేయాలి అనుకుంటుంది.
వాడు ఫేక్ అని తెలిసి ఎందుకు వెళ్లిపోయావ్..
అంబిక విష్ణుని కొట్టి నేనేం చేయమన్నా నువ్వేం చేశావురా అంటుంది. ఇక లక్ష్మీతో వాడు ఫేక్ అని తెలుసు కదా ఎలా వెళ్లిపోయావ్ అని అడుగుతుంది. దానికి వసుధ మీరు పదే పదే తన భర్త గురించి అడుగుతున్నారని వెళ్లిపోవాలని అంటుంది. నేను సమయానికి వెళ్లకపోయి ఉంటే లక్ష్మీ బతుకు పోయిండేది కదా అంటాడు. లక్ష్మీ నీ మంచి కోసమే ఇదంతా చేశాను సారీ లక్ష్మీ అని అంటుంది. లక్ష్మీ భవిష్యత్ కోసమే చేసింది వాడిని పంపేయండి అని పద్మాక్షి చెప్పడంతో పండు వాడిని కొట్టి పంపేస్తాడు.
ఇంకా తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయ్..
అంబిక లక్ష్మీని లోపలికి తీసుకెళ్లమని అంటుంది. విహారి లక్ష్మీని ఆపి ఇంకా తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని అంటాడు. ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు తనకు పెళ్లి చేయాలి అనుకున్నారు? ఎందుకు మనిషో వైపు నుంచి తనని పెళ్లి పెళ్లి అని నీ భర్త ఎవరో చెప్పు అని ఇబ్బంది పెడుతున్నారు? అందరూ అలా చేస్తే తాను ఏమైపోతుంది? మన ఇంట్లో ఇంత మంది ఆడవాళ్లు ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఓ ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం లేదా.. పద్మాక్షి గొడవ పడాలని ప్రయత్నించే టైంకి సహస్ర ఆపేస్తుంది. మళ్లీ అది దొరుకుతుందని చెప్తుంది. యమున లక్ష్మీకి సారీ చెప్పి ఇంకెప్పుడూ నీకు ఇబ్బంది పెట్టమని అంటుంది.
లక్ష్మీతో ఫైనల్‌గా తేల్చుకుంటా..
లక్ష్మీ బయటకు వెళ్లడంతో లక్ష్మీ చూసిన ఈ రోజు లక్ష్మీతో ఫైనల్‌గా మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకుంటాడు. లక్ష్మీ ఆటోలో వెళ్తుంటే బైక్‌లో ఫాలో అవుతాడు. ఆటోని ఆపి లక్ష్మీని పిలుస్తాడు. ఆటో వాడిని పంపేస్తాడు. నా పరిస్థితి మీకు తెలుసు.. నా ఇష్టం తెలుసు.. అయినా మీరు నా వెంట పడితే ఏం చేయాలి అంటుంది. నీ భర్త రాడు అని అర్థమైంది అందుకే నీకు అండగా నీకు సెక్యూరిటీగా ఉండాలని ఉందని అంటాడు. లక్ష్మీ వెళ్లబోతే చేయి పట్టుకుంటాడు. లక్ష్మీ చేయి వదలమంటుంది. విహారి వదలమంటుంది. ఇంతలో విహారి వచ్చి మదన్ చేయి తీస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి కాలర్ పట్టుకున్న కార్తీక్.. శ్రీధర్ చెప్పిన నిజం దీప మాయం!





















