Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 2nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విష్ణుతో వెళ్లిపోయిన లక్ష్మీ.. 50 లక్షలకు అంబిక బేరం.. విహారి లక్ష్మీని కాపాడగలడా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విష్ణుకి అంబికి కాల్ చేసి లక్ష్మీని చంపేస్తే 50 లక్షలు ఇస్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ ఏడుస్తుంటే యమున నీకు ఇక అన్నీ సంతోషాలే ముఖం మీద ఇలా కన్నీరు ఉండకూడదు. ఎప్పుడు మేం గుర్తొచ్చినా వచ్చేయ్ అని అంటుంది. యమున వెళ్లగానే వసుధ లక్ష్మీతో వచ్చిన వాడు నీ భర్త కాదు కదా ఎలా వెళ్లడానికి రెడీ అయిపోతున్నావ్ అని అడుగుతుంది.
నా సమస్యకు ఇదే పరిష్కారం..
లక్ష్మీ వసుధతో ఇంతకంటే ఇంకేం చేయను అమ్మా. వచ్చిన వాడు నా భర్త కాదు అని చెప్తే భర్త ఎవరో చెప్పాలి. అందుకే బయటకు వెళ్లిపోవడమే నా సమస్యకు పరిష్కారం అని అనిపిస్తుంది. నా భర్త కళ్ల ముందే ఉండి ఎప్పుడు నిజం తెలుస్తుందా అని భయపడే కంటే నాతో నిజం దూరం అయిపోతే మంచిది. వచ్చిన వాడి నుంచి తప్పించుకొని నా గుండెల్లో నా భర్తని పెట్టుకొని ఆనందంగా ఒంటరి జీవితం అనుభవిస్తాను అని లక్ష్మీ చెప్తుంది. దాంతో వసుధ లక్ష్మీని పట్టుకొని ఏడుస్తుంది.
విహారి బాబు ఏం జరుగుతుంది ఇక్కడ..
విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తూ ఉంటే పండు విహారి దగ్గరకు వస్తాడు. విహారి బాబు ఏం జరుగుతుంది ఇక్కడ. వాడు ఎవడో లక్ష్మమ్మ భర్త అంటే అలా ఎలా నమ్మేశారు. మీరే ఏదో ఒకటి చేసి వాడిని గెంటేయండి అంటాడు. వాడు ఎవడో ప్లాన్ ప్రకారమే వచ్చాడు. ఎవరో పంపితేనే వచ్చాడు. వాడి అంతు నేనే చూస్తా.
లక్ష్మీని అతనితో పంపడం నీకు ఇష్టంలేదా..
విష్ణు బయటకు వచ్చి ప్లాన్ సక్సెస్ మిగతా ప్లాన్ కూడా నేను సక్సెస్ చేస్తానని ఫోన్‌లో మాట్లాడుతాడు. విహారి విష్ణు దగ్గరకు వెళ్లి ఎవడ్రా నువ్వు అని అడిగి కొడతాడు. నేను లక్ష్మీ భర్తని అని అంటాడు. విష్ణుని విహారి రేవేట్టేస్తుంటే సహస్ర, పద్మాక్షిలు వచ్చి అడ్డుకుంటారు. సాక్ష్యాలు అన్నీ చూపించినా ఎందుకు అతన్నిఅనుమానిస్తున్నావ్ అని అడుగుతారు. లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లడం నీకు ఇష్టం లేదా అని సహస్ర అడుగుతుంది. ఇది లక్ష్మీ మేటర్ నువ్వు నీ పనిలో ఉండు బావ అని సహస్ర చెప్తుంది. పద్మాక్షి విష్ణుతో లక్ష్మీ మీద అభిమానంతో విహారి చేయి చేసుకున్నాడు ఏం అనుకోవద్దు అని అంటుంది. లక్ష్మీని మంచిగా చూసుకోవాలని సహస్ర విష్ణుతో చెప్తుంది.
లక్ష్మీని సాగనంపిన ఫ్యామిలీ..
లక్ష్మీ బ్యాగ్ తీసుకొని కిందకి వస్తుంది. లక్ష్మీ నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానని విష్ణు అంటాడు. ఇక యమున చీర సారె తీసుకొచ్చి వసుధతో లక్ష్మీకి ఇప్పిస్తుంది. లక్ష్మీకి వసుధ కుంకుమ పెట్టి సారె ఇస్తుంది. యమున లక్ష్మీని జాగ్రత్తగా చూసుకోమని విష్ణుతో చెప్తుంది. లక్ష్మీ యమునని హగ్ చేసుకొని మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని ఏడుస్తుంది. వసుధ కూడా లక్ష్మీని హగ్ చేసుకుంటుంది. అందరికీ వెళ్లొస్తా అని చెప్తుంది. పద్మాక్షి లక్ష్మీతో బాగా సంసారం చేసుకొని మీ వాళ్లని చక్కగా చూసుకో అని చెప్తుంది. సహస్ర దగ్గరకు వెళ్లి మీకు విహారి గారికి త్వరగా పెళ్లి జరగాలి అని అంటుంది. మా పెళ్లి జరుగుతుంది కానీ నువ్వు రావొద్దు అని అంటుంది. అందరికీ చెప్పిన లక్ష్మీ మదన్‌తో నా వల్ల మీరు బాధ పడిఉంటే సారీ అని చెప్తుంది. దాంతో మదన్ నువ్వు నీ భర్త సంతోషంగా ఉండండి అని అంటాడు.
లక్ష్మీ వెళ్లడంతో మదన్, విహారి కన్నీరు..
లక్ష్మీని విష్ణు తీసుకెళ్లడంతో మదన్, విహారి ఇద్దరూ కన్నీరు పెట్టుకుంటారు. విష్ణు లక్ష్మీని తీసుకెళ్లిపోతాడు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. విహారి బయటకు పరుగులు తీసి విష్ణు కారుని ఫాలో అవుతాడు. లక్ష్మీ కారులో విష్ణుతో ఎవరు నువ్వు అని అడుగుతుంది. నీ భర్తని అని అంటాడు. నిన్ను ఎవరు పంపారో చెప్పు అని లక్ష్మీ అనడంతో విష్ణు లక్ష్మీ మీద అరుస్తాడు. లక్ష్మీ పోలీసులకు చెప్తానని అనడంతో విష్ణు ఫోన్ పడేస్తాడు. కారు ఆపమని అంటే విష్ణు లక్ష్మీకి పెప్పర్ స్ప్రే కొట్టేస్తాడు.
50 లక్షలకు అంబిక బేరం..
విష్ణుకి అంబిక కాల్ చేస్తుంది. లక్ష్మీని అక్కడికక్కడే చంపేసి పారిపో 50 లక్షలు ఇస్తానని అంటుంది. చంపిన తర్వాత ఆధారాలు లేకుండా చూడమని చెప్తుంది. విష్ణు సరే అని అంటాడు. విహారి చాలా టెన్షన్ పడతాడు. లక్ష్మీ ఎక్కడుండో తెలియకపోవడంతో లక్ష్మీకి విహారి ఇచ్చిన ఫోన్‌కి లొకేషన్ యాక్సెస్ విహారి ఫోన్కి ఉండటంతో లైవ్ ట్రాక్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?





















