Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 26th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: యమున మీద అరిచిన లక్ష్మీ.. లక్ష్మీని చంపడానికి వచ్చిన సుభాష్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ భర్తని యమున తిట్టడం యమున మీద లక్ష్మీ తిరగబడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, విహారి ఇంటికి వస్తారు. లక్ష్మీ వెళ్తుంటే పట్టీ పడిపోతుంది. విహారి చూసి లక్ష్మీని పిలిచి పట్టీ తీసి లక్ష్మీ కాళ్లకి పెడతాడు. విహారి చేతికి చిన్న గాయం అవడంతో లక్ష్మీ ఫస్ట్ ఎయిడ్ చేస్తానని అంటుంది. అదంతా సహస్ర చూస్తుంది. సహస్రని చూసి ఇద్దరూ షాక్ అయిపోతారు. సహస్ర చూసి ఈ చిన్న దెబ్బకు ఫస్ట్ ఎయిడ్ చేయడం ఏంటి అని విహారి చేతిని నోటిలో పెట్టుకుంటుంది. విహారి లోపలికి వెళ్తాడు.
లక్ష్మీని చూసిన సహస్ర లోపల మా అమ్మ నీకు బడిత పూజ చేస్తుంది వెళ్లవే అనుకుంటుంది. విహారిని పద్మాక్షి ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. ఆఫీస్ పని మీద బయటకు వెళ్లానని విహారి చెప్తాడు. లక్ష్మీతో షికారుకి వెళ్లి భలే కవర్ చేస్తున్నావ్ బావ అని సహస్ర అనుకుంటుంది. ఇక అంబిక విహారి తల మీద అక్షింతలు చూసి అడుగుతుంది. అలా గుడికి వెళ్లి దండం పెట్టుకొని వచ్చానని విహారి అంటాడు. విహారి గదిలోకి వెళ్లిపోతాడు.
లక్ష్మీ వెళ్లబోతే అంబిక ఆపి ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. లక్ష్మీ గుడికి వెళ్లానని చెప్తుంది. లక్ష్మీ చేతిలోని బ్యాగ్ పద్మాక్షి తీసుకొని దాన్ని కింద పడేస్తుంది. అందులో పూజకి కావాల్సిన సామాగ్రి ఉంటాయి. ఏంటే ఇవన్నీ అని పద్మాక్షి అడుగుతుంది. దానికి అంబిక త్వరలో జరగబోయే పెళ్లి ఆపడానికి క్షుద్ర పూజకు కావాల్సిన సామాగ్రి అనుకుంటా అని అంటుంది. దాంతో పద్మాక్షి లక్ష్మీని కొడుతుంది. నా కూతురి పెళ్లి చెడగొట్టాలని కంకణం కట్టుకున్నావే అని అంటుంది. వసుధ అడ్డుకుంటుంది. ఆ సామాగ్రితో ఎలా క్షుద్రపూజ చేస్తారు అని యమున అడుగుతుంది. లక్ష్మీ ఈ పెళ్లి ఆపాలని ఎన్నటికీ అలా చేయదు అని అంటుంది.
లక్ష్మీ పద్మాక్షితో రేపు నేను ఓ చిన్న పూజ చేస్తున్నా నా భర్త సంతోషంగా ఉండాలి అని సుమంగళి పూజ చేస్తున్నా అని చెప్తుంది. యమున కూడా లక్ష్మీతో అవసరమా ఈ పూజలు అసలు బతికి ఉన్నాడో లేడో తెలీని వాడి కోసం పూజలు ఎందుకు అని యమున అంటే యమున మీద లక్ష్మీ అరుస్తుంది. నా భర్తని అగౌరవ పరిచేయలా మాట్లాడొద్దని లక్ష్మీ అంటుంది. నీ భర్త నీ సౌభాగ్యం నీ ఇష్టం అని యమున అనేసి వెళ్లిపోతుంది. పద్మాక్షికూడా నీ భర్త కోసం నువ్వు ఏమైనా చేసుకో కానీ నా కూతురి పెళ్లి ఆపాలి అని చూస్తే మాత్రం ఊరుకోను అంటుంది. సహస్రతో మీకు విహారి గారికి పెళ్లి జరగాలి అనేదే నా కోరిక అని అంటుంది. దాంతో సహస్ర నీ కళ్ల ముందే మా పెళ్లి అవుతుంది నీ ముందే మేం కాపురం చేస్తామని సహస్ర అంటుంది. ఇక లక్ష్మీ ఆ పూజ సామాగ్రి అంతా తీస్తుండగా సహస్ర లక్ష్మీ చేతి మీద కాలు పెట్టి నలిపేస్తుంది. వసుధ చూసి సహస్ర అని కేకేస్తుంది. సహస్ర చూసుకోలేదని అంటుంది.
లక్ష్మీ గదిలోకి వెళ్లి జరిగింది తలచుకొని తనని తాను కొట్టుకుంటుంది. ఇంతలో వసుధ వెళ్లి ఆపుతుంది. ఏమైందని అని అంటే ఎప్పుడూ నా గురించి ఆలోచించే యమునమ్మ మీద నోరు లేపానమ్మా అని ఏడుస్తుంది. ఎల్లుండే సహస్రల పెళ్లి జరిగితే నీకు జీవితం ఏమైపోతుందో అని లక్ష్మీతో అంటుంది. లక్ష్మీ వసుధని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అంబిక రాత్రి బాల్కానీలో ఉంటే సుభాష్ వచ్చి నేను లక్ష్మీని చంపడానికి వచ్చాను నా ఫస్ట్ టార్గెట్ అదే అని అంటాడు. ఈ విషయంలో నాకు అడ్డు రాకు అని అంటాడు. అంబిక సుభాష్‌ని లాగిపెట్టి కొడుతుంది. నువ్వు విహారికి దొరికితే ఏమవుతుందో తెలుసా అని క్లాస్ తీసుకుంటుంది. సుభాష్‌కి సర్ది చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. సుభాష్ తర్వాత తనతో తాను ఇక్కడి వరకు వచ్చాను ఆ లక్ష్మీని చంపకుండా వెళ్లలేను అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!





















