Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 15th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: నిజం చెప్పేయడానికి నిర్ణయించుకున్న విహారి.. పద్మాక్షి రియాక్షన్ ఎలా ఉంటుందో!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode ఇంట్లో అందరికి లక్ష్మీకి తనకు పెళ్లి జరిగిపోయిందని విహారి చెప్పాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ దగ్గరకు యమున రావడంతో సారీ చెప్తుంది. యమున సారీ వద్దని ప్రాజెక్ట్ కోసం చేశారని నాకు తెలుసు అంటుంది. పద్మాక్షి మనలా అర్థం చేసుకోలేదని లక్ష్మీతో చెప్తుంది. నువ్వు ఈ కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నావ్ ఈ కుటుంబం కోసం అవమానాలు పడుతున్నా నిన్ను ఈ కుటుంబం గుర్తించడం లేదని యమున అంటుంది.
నీకు మా కుటుంబానికి సంబంధం ఏంటే..
లక్ష్మీ తనకు గుర్తింపు అవసరం లేదని రోడ్డును ఉండాల్సిన తనకు ఇంద్రభవనంలో చోటిచ్చారు అదే చాలు అంటుంది. ఇంతలో సహస్ర వచ్చి ఎంత బాగా మాట్లాడుతున్నావో ఇలాగే మా అత్తయ్యని బుట్టలో వేసుకుంటున్నావ్ అని అంటుంది. ఈ కుటుంబం నీ కుటుంబం ఎలా అవుతుందని సహస్ర అడుగుతుంది. నీకు మాకు ఏమైనా చుట్టరికం ఉందా అని అంటుంది. యమున ఏం అనొద్దు తనని వదిలేయ్ అని సహస్రతో అంటే తనని వదిలేయాల్సింది మేం కాదు మీరు మీకు అయిన వాళ్లు ఎవరో పరాయి వాళ్లు ఎవరో తెలీడం లేదని అంటుంది. లక్ష్మీ ఏడుస్తూ వెళ్లిపోతుంది. యమున కూడా వెనకాలే వెళ్తుంది.
ఏదో ఒక నిర్ణయం తీసుకోండి బాబు..
విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పండు విహారి దగ్గరకు వచ్చి ఆ దేవుడు మీకు లక్ష్మీమ్మకి కష్టాలు ఇచ్చి ఇచ్చి చాలా ఏడిపిస్తున్నాడని అంటాడు. మీ కష్టాలు చూడటానికే నాకు ఇంత కష్టంగా ఉంటే మీరు ఎలా భరిస్తున్నారో అని అంటాడు. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని పండు చెప్పి వెళ్లిపోతాడు.
నీకు అండగా ఉండలేకపోతున్నా..
విహారి లక్ష్మీకి కాల్ చేసి సారీ చెప్తాడు. నేను తాళి కట్టినందుకు చాలా కష్టపడుతున్నావ్. నా కోసం నువ్వు అంత చేస్తున్నా నేను ఏం చేయడం లేదు నీకు అండగా ఉండలేకపోతున్నా అని బాధ పడతాడు. అలా మాట్లాడొద్దని లక్ష్మీ అంటుంది. మీరు ఎంత చేయాలో అంత చేస్తున్నారు మీ దగ్గర నుంచి నేను ఇంకేం ఆశించను. కొత్తగా సుఖపడాలి అని కానీ లేని సంతోషాలు కావాలని మాత్రం కోరుకోవడం లేదని మీరు బాగుంటే అంతే చాలు అంటుంది. విహారి ఏం మాట్లాడకుండా రెస్ట్ తీసుకోమని ఫోన్ పెట్టేస్తాడు. నా భార్య కోసం నేను ఏం చేయడం లేదు ఇకపై తను ఆనంద పడాలి సుఖ పడాలి అని అలా జరగాలి అంటే అందరికీ నిజం చెప్పాలి అనుకుంటాడు. ఏది ఏమైనా రేపు నిజం చెప్పేస్తా అని నిర్ణయించుకుంటాడు.
అరటి తొక్క విసిరేసిన అంబిక..
ఉదయం లక్ష్మీ ఇంటి ముందు ముగ్గేసి రంగులు వేస్తుంది. జాగింగ్ చేసి వస్తున్న విహారి లక్ష్మీ ముగ్గు చూసి ఆగుతాడు. లక్ష్మీకి గుడ్ మార్నింగ్ చెప్పి ముగ్గు బాగుందని అంటాడు. ఇద్దరూ మాట్లాడుతూ ఉంటే అంబిక చూసి తన చేతిలో ఉన్న అరటి తొక్కి విహారి కాలి కింద వేస్తుంది. అది తొక్కేసి విహారి జారిపోబోతే లక్ష్మీ పట్టుకుంటుంది. సహస్ర అటుగా వెళ్తుంటే పండు ఆపి పై నుంచి మీ అమ్మగారు పిలుస్తున్నారని చెప్తాడు. దాంతో లక్ష్మీ, విహారిలను సహస్ర చూడదు.
చిక్కుముడులన్నీ విప్పేస్తా..
విహారి లోపలికి వెళ్లి ఈ రోజు చిక్కుముడులన్నీ విప్పేస్తా ఎవరు ఎలా రియాక్ట్ అయినా తప్పదు అని అనుకుంటాడు. సహస్ర డిటెక్టివ్‌కి కాల్ చేస్తుంది. లక్ష్మీ విషయం ఎంత వరకు వచ్చిందని అంటుంది. మీ పని లోనే ఉన్నానని లక్ష్మీ వాళ్ల ఊరు రాజమండ్రి అని చెప్తుంది. సహస్ర షాక్ అయిపోతుంది. విహారి రాజమండ్రి గుడిలో అనుకోకుండా కనిపించడం గుర్తు చేసుకుంటుంది. పద్మాక్షి తండ్రికి కాల్ చేసి మీరు త్వరగా వచ్చి నా కూతురుకి విహారికి పెళ్లి చేస్తారా వెళ్లిపోమంటారా అంటుంది. దాంతో వచ్చేస్తున్నాం వచ్చి మాట్లాడుకుందామని పెద్దాయన చెప్తారు. యమున పద్మాక్షికి కాఫీ ఇస్తుంది. పద్మాక్షి యమున మీద అరుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశరథ్.. దీప వల్ల సుమిత్ర జీవితం అన్యాయం అయిపోతుందా!






















