అన్వేషించండి

Jagadhatri Serial Today May 26th:శ్రీవల్లి వైజయంతి కూతురని తెలిసి రచ్చచేసిన పాపారాయుడు...కేదార్‌ గురించి నిజం తెలిసి ఏం చేశాడు...?

Jagadhatri Serial Today Episode May26th: శ్రీవల్లి గురించి నిజం తెలుసుకున్న వైజయంతి వాళ్ల అన్న పాపారాయుడు కోపంతో రగిలిపోయాడు. సొంత చెల్లినే చంపడానికి ప్రయత్నించడంతో ఈరోజు ఏపిసోడ్‌ ఆసక్తిగా మారింది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌లో ఈరోజు వైజయంతి వాళ్ల అన్న పాపారాయుడు చేసిన రచ్చకు ఇళ్లంతా  హడాలిపోయింది. పరవు కోసం ప్రాణాలిచ్చే పాపారాయుడు శ్రీవల్లికి గురించి నిజం తెలిసి అగ్గిమీద గుగ్గిలమవుతాడు.వైజయంతి ప్రాణం తీసేందుకు సైతం వెనకాడడు. అసలే కోపంగా ఉన్న పాపారాయుడికి కేదార్‌ ఎవరో తెలిసిన తర్వాత ఏం చేశాడోనన్న ఉత్కంఠతో ఈ రోజు ఏపిసోడ్‌ రసవత్తరంగా మారింది.
పాపారాయుడి హడావుడి
                        సుధాకర్‌కు యాక్సిడెంట్‌ జరిగిందని తెలిసి ఊరు నుంచి వచ్చిన వైజయంతివాళ్ల అన్నయ్య పాపారాయుడిని చూసి ఇంట్లో వాళ్లంతా బెదిరిపోతారు. అతను చేసే హడావుడి, కోపం చూసి బెంబేలెత్తిపోతారు.ఇక వైజయంతి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. చిన్న అబద్ధం చెప్పినా....ఇంటి పరువు తీసే ప్రయత్నం చేసినా  పాపారాయుడు ప్రాణాలు తీసేస్తాడు. అలాంటి సమయంలో ఇంట్లో కేదార్‌, జగధాత్రి తిరుగుతుండటంతో వైజయంతికి కాళ్లు,చేతులు ఆడవు. ఇంతలో  సుధాకర్‌కు కౌషికి టాబ్లెట్ ఇవ్వడం చూసి ఇల్లు లేచిపోయేంతగా  చెల్లిపై అరుస్తాడు. అసలు భార్యవు నువ్వు చూసుకోవాల్సిన పనులు వేరొకరు ఎందుకు చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో భయపడిపోయిన వైజయంతి భర్త దగ్గరకు వెళ్లి టాబ్లెట్‌ వేయిస్తుంది. ఆమాటలు విన్న నిషికకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలోనే వీళ్లు ఎవరని జగధాత్రి వాళ్ల గురించి ఆరా  తీస్తుండగానే యువరాజు వచ్చి మామయ్యను హత్తుకుని టాఫిక్ డైవర్ట్‌ చేస్తాడు. మా మామయ్య వెళ్లిపోయేవరకు చాలా జాగ్రత్తగా ఉండాలని యువరాజు నిషికకు చెబుతాడు. పరువు కోసం ప్రాణాలు తీస్తాడని వైజయంతి హెచ్చరిస్తుంది. ఇప్పుడు కేదార్‌,జగధాత్రి గురించి తెలిస్తేనే ప్రాణాలు పోతాయనుకుంటే...ఆ శ్రీవల్లి గురించి తెలిస్తే నన్ను ఇక్కడే  చంపేస్తాడని వైజయంతి భయపడిపోతుంది.
శ్రీవల్లి గురించి తెలిసిన నిజం
                           వైజయంతి శ్రీవల్లికి పై గదిలో పనులు అప్పగించి కిందకు రావొద్దని చెబుతుంది.అలాగే జగధాత్రి,కేదార్ కూడా వంటగది దాటి  బయటకు రాకుండా వంట చేయమని చెప్పి వస్తుంది. అత్తయ్యగారు ఎందుకో పాపారాయుడు బాబాయిని చూసి చాలా భయపడిపోతున్నారని ధాత్రి అంటుంది. ఇంతలో భోజనాలు పూర్తవ్వడంతో తినడానికి అందరూ వస్తారు. అప్పుడు మరోసారి పాపారాయుడు జగధాత్రిని చూసి ఎవరని అడుగుతాడు. ఇంతలో ధాత్రి కల్పించుకుని మేం నిషిక వాళ్ల అక్కాబావ అని చెబుతారు.  అందరూ భోజనాలు చేస్తుండగా...శ్రీవల్లి రాలేదేంటని కౌషికి అడుగుతుంది.ఆ అమ్మాయి మేడమీద పనిలోఉందని వైజయంతి చెబుతుంది. భోజనాలు చేస్తుంటే ఇప్పుడు పనులేంటని కౌషికి కిందకు పిలుస్తుంది. శ్రీవల్లిని చూసి ఎవరని పాపారాయుడు అడుగుతాడు. పని అమ్మాయని నిషిక చెప్పడంతో సుధాకర్‌కు కోపం వచ్చి పని అమ్మాయి కాదని ఈ ఇంటి అమ్మాయని చెబుతాడు...
వైజయంతిని చంపబోయిన అన్న
                        ఇంటి అమ్మాయి అంటే ఎలా అని పాపారాయుడు అడగడంతో  ఆ అమ్మాయి నీ చెల్లెలు కూతురని చెప్పడంతో పాపారాయుడు కోపంతో రగిలిపోతాడు. నువ్వు చెప్పింది నిజమేనా అంటూ కత్తి తీసుకుని  చెల్లి దగ్గరకు వెళ్తాడు.ఆమె గొంతుపట్టుకుని చంపబోతాడు. ఇంతలో కేదార్ అడ్డుకుని మేం చెప్పేది కాస్త వినమని అంటాడు.అయినా సరే పాపారాయుడు ఇంట్లో రచ్చరచ్చ చేస్తాడు. ఇంటి పరువు తీసిన నా చెల్లి బతకడానికి వీల్లేదని చంపబోతాడు. ఇంతలో కేదార్‌, యువరాజు అడ్డుకుంటారు.అయినా బాబాయి శ్రీవల్లిని కూతురిగా అంగీకరించారని కౌషికి చెప్పడంతో మరింత కోపంతో పాపారాయుడు రగిలిపోతాడు.
సుధాకర్‌ను గదిలో బంధించిన పాపారాయుడు
                        సుధాకర్‌ వీల్‌ఛైర్‌ గదిలోకి తీసుకెళ్లి తలుపుపెట్టుకుంటాడు. నా చెల్లితప్పు చేసిందని దాన్ని నువ్వే చంపమని అడుగుతాడు. ఇవాళ అది అయిన బతికి ఉండాలి లేదంటే నేను అయిన బతికి ఉండాలని కత్తి తీస్తాడు.సుధాకర్ బావమరిదిని గట్టిగా మందలిస్తాడు. అయితే నేనే చనిపోతానని కత్తితో గొంతు కోసుకోబోతుండగా...కేదార్‌, యువరాజు వచ్చి అడ్డుకుంటారు. దీంతో కోపంతో పాపారాయుడు బయటకు వెళ్లిపోతాడు. దీంతో బెదిరిపోయిన వైజయంతి మా అన్నయ్య నా ప్రాణాలు తీయకుండా వెళ్తాడని అనుకోలేదని భయపడుతుంది.
పాపారాయుడికి తెలిసిన నిజం
                         పాపారాయుడు చేసిన రచ్చ గురించి కౌషికి, జగధాత్రి,కేదార్ మాట్లాడుకుంటుంటారు. శ్రీవల్లి గురించి తెలిస్తేనే ఇంత గొడవ చేశాడంటే..ఇక మీ గురించి తెలిస్తే ఏం చేస్తాడోనని కౌషికి అంటుండగా...పాపారాయుడు మళ్లీ వస్తాడు.  ఏంటి ఆ  నిజమని నిలదీస్తాడు. ఇప్పుడు చెప్పకపోతే చంపేస్తానని కేదార్‌ను బెదిరిస్తుండగా...జగధాత్రి అసలు విషయం చెప్పేస్తుంది. కేదార్ సుధాకర్‌ మామయ్య పెద్దకొడుకని చెప్పడంతో నువ్వు సుహాసిని కొడుకువా అని అంటాడు.ఆ మాటలు విన్న ధాత్రి ఆశ్చర్యపోతుంది. అయితే నీ వ్యవహారం నీతోకాదని మా బావతోనే తేల్చుకుంటానని లోపలికి వెళ్లిపోతాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today July 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
Karthika Deepam 2 Serial Today July 27th: కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 27th:విక్కీని బ్రతిమాలించుకున్న రాధ....చిట్టి దగ్గర దొరికిపోకుండా విక్కీ నానా కష్టాలు
నువ్వులేక నేను లేను: విక్కీని బ్రతిమాలించుకున్న రాధ....చిట్టి దగ్గర దొరికిపోకుండా విక్కీ నానా కష్టాలు
Podarillu Serial Today July 27th: మాధవ్‌ కుటుంబంపై తప్పుడు కేసు పెట్టించే ప్రయత్నం చేసిన వరాలు...తల్లికి బుద్ధి చెప్పిన శైలు
పొదరిల్లు: మాధవ్‌ కుటుంబంపై తప్పుడు కేసు పెట్టించే ప్రయత్నం చేసిన వరాలు...తల్లికి బుద్ధి చెప్పిన శైలు
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget