అన్వేషించండి

Jagadhatri Serial Today May 19th:తండ్రినే కిడ్నాప్ చేయించిన యువరాజు... కిడ్నాపర్ల నుంచి తప్పించే క్రమంలో సుధాకర్‌కు యాక్సిడెంట్‌

Jagadhatri Serial May19th: సుధాకర్‌కు యాక్సిడెంట్‌ జరిగి ఆస్పత్రిలో చేరతాడు.ఇదంతా చేసింది యువరాజేనని తెలుసుకున్న జగధాత్రి.. స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇవ్వడంతో జగధాత్రి సీరియల్ కొత్త మలుపు తీసుకుటుంది.

Jagadhatri Serial Today Episode: కేదార్‌ తన కొడుకని సుధాకర్‌ ప్రకటించే సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. వారి వెంట జగధాత్రి, కేదార్‌ పరుగులు తీస్తారు. మార్గమధ్యలోనే రమ్యకు ఫోన్ చేయడంతో ఆమె ఎదురుగా వస్తుంది. దీంతో కిడ్నాపర్లు సుధాకర్‌ను వదిలేసి పారిపోయే క్రమంలో రోడ్డుపైకి నెట్టేస్తారు. వెనక నుంచి వచ్చిన కారు సుధాకర్‌ను గుద్దేయడంతో తీవ్రంగా గాయపడతాడు. తండ్రిని వెంటనే కేదార్  ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ చేయిస్తాడు.

అయితే సుధాకర్‌ను కొడుకు యువరాజే కిడ్నాప్ చేయిస్తాడు.తన మనుషులను పురమాయించి తండ్రిని జాగ్రత్తగా అపహరించి నేను చెప్పిన చోట దాచి పెట్టాలని చెబుతాడు. ఆయనకు ఏం జరగకుండా చూసుకోవాలని సూచిస్తాడు. ఇదంతా తెలుసుకుని వైజయంతి తొలుత కంగారుపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి మంచి ఉపాయం ఏదీలేదని నిషిక అంటుంది.అయినా కిడ్నాప్ చేసేవాళ్లు మనోవాళ్లే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని యువరాజు సర్దిచెప్పడంతో తను సరేనంటుంది.దీంతో యువరాజు చెప్పినట్లే సుధాకర్‌ను వాళ్ల మనుషులు తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేస్తారు.

కేదార్‌ ఫోన్ చేయడంతో కౌషికి సహా అందరూ పరుగులు పెట్టుకుంటూ ఆస్పత్రికి వస్తారు. ఏం జరిగిందని చెప్పగా....మామయ్యగారికి యాక్సిడెంట్ జరిగిందని అందుకే ఆస్పత్రికి తీసుకొచ్చామని చెబుతారు. దీంతో వైజయంతి భోరున ఏడుస్తుంది.అసలు మీరు ఎందుకు వెళ్లారని....మీవల్లే ఆయనకు యాక్సిడెంట్ జరిగిందని అంటుంది. కౌషికి కలుగజేసుకుని వాళ్ల వల్ల యాక్సిడెంట్ జరగడం ఏంటని ప్రశ్నిస్తుంది. వాళ్లు బాబాయిని కాపాడే కదా ఆస్పత్రి తీసుకొచ్చారని అంటుంది. లేకపోతే ఆ కిడ్నాపర్లు బాబాయిని ఏమైనా చేసి ఉండేవాళ్లేమో అని అంటుంది. ఆ కిడ్నాపర్లు మీ బాబాయిని ఏం చేయరని....వీళ్లు వెంటపడకుండా ఉంటే నేరుగా వాళ్లు తీసుకెళ్లాల్సినచోటకు తీసుకెళ్లి ఉండేవారని నోరు జారుతుంది.ఇంతలో యువరాజు కల్పించుకుని వాళ్ల అమ్మను ఆపుతాడు. దీంతో జగధాత్రి అడ్డుపడుతుంది.అత్తయ్యగారు కిడ్నాపర్లు గురించి ఏదో చెబుతుంటే నువ్వు ఎందుకు ఆపుతున్నావని నిలదీస్తుంది. అసలు కిడ్నాపర్లు ఏం చేయరని మీకు ఎలా తెలుసని జగధాత్రి  వైజయంతిని ప్రశ్నిస్తుంది. దీంతో తాను ఎంత పెద్ద తప్పుచేశానో తెలుసుకుని నాలుకు కర్చుకుంటుంది. వెంటనే నిషిక కలుగజేసుకుని యువరాజు ఆపింది అందుకు కాదని మామయ్యకి ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఆస్పత్రిలో ఈ గొడవ ఏంటని ఆపాడని టాఫిక్ డైవర్ట్ చేస్తుంది.

ఆపరేషన్ ధియేటర్‌ నుంచి బయటకు వచ్చిన డాక్టర్‌ ఆయనకు పెద్దప్రమాదం ఏమీలేదని...కాకపోతే కొన్నిరోజులు నడవలేరని చెప్పి వెళ్లిపోతారు.కౌషికి, వైజయంతి లోపలకి వెళ్లగా....జగధాత్రి  యువరాజును పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మామయ్యను కిడ్నాప్‌ చేయించింది నువ్వేనని మాకు తెలుసని అంటుంది. మరీఇంత నీచానికి ఒడిగడతారని అనుకోలేదని అంటుంది. మీరు ఈ  ఇంటివారసుడిగా ప్రకటన కోసం ప్రయత్నించే వరకు నేను ఇలా అడ్డుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటానని యువరాజు అంటాడు. మళ్లీ ఇలాంటి పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోనని కేదార్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో అందరూ కలిసి సుధాకర్‌ను చూడటానికి లోపలికి వెళ్తారు.  వీరశంకర్‌ అక్కడికి వచ్చి నువ్వు కోలుకునే వరకు సమయం ఇస్తానని చెబుతాడు.అప్పటి వరకు కేదార్‌కు ఏం జరిగినా యువరాజు,సుధాకర్‌దే బాధ్యత  అని లాయర్‌తో డాక్యుమెంట్లు చేయించుకుని తీసుకొస్తాడు.వాటిపై కేదార్‌ను సంతకం చేయమంటే తాను చేయనని అంటాడు. నా ఫ్యామిలీ నుంచి నాకు ఎలాంటి ముప్పులేదని చెబుతాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! విహారి అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! కటకటాలపాలైన విహారి!
Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget