Jagadhatri Serial Today June 8th:జగధాత్రి, కేదార్‌లకు క్షమాపణలు చెప్పిన నిషిక.....కౌషికి ఇంటికి పాపారాయుడు ఎందుకొచ్చాడు..?
Jagadhatri Serial June 8th: డాక్టర్ చెప్పిన నిజంతో కోపంతో రగిలిపోయిన సుధాకర్..జగధాత్రి, కేదార్‌కు క్షమాపణలు చెప్పమని నిషికను ఆదేశిస్తాడు. నిషిక క్షమాపణలు చెప్పడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. తప్పు చేసిన నిషికను మందలించిన జగధాత్రి మామయ్యగారికి సారీ చెప్పమని చెబుతుంది. నీవల్ల ఎక్కువ బాధపడింది జగధాత్రి, కేదార్ కాబట్టి వాళ్లను క్షమాపణలు కోరమని సుధాకర్ ఆదేశించడం..దీనికి నిషిక సారీ చెప్పి వెళ్లిపోవడంతో ఈ రోజు చెల్లిపై జగధాత్రి పైచేయి సాధిస్తుంది. అలాగే జైలు నుంచి విడుదలైన పాపారాయుడు పగ తీర్చుకునేందుకు మళ్లీ వైజయంతి వాళ్ల ఇంటికి రావడంతో జగధాత్రి సీరియల్ రసవత్తరంగా మారింది...
జగధాత్రికి సారీ చెప్పిన నిషిక
నిషికకు కడుపులేదని డాక్టర్ నిజం చెప్పడంతో సుధాకర్ చాలా బాధపడతాడు. అనవసరంగా వీళ్ల మాటలు విని మిమ్మల్ని అవమానించానని జగధాత్రి,కేదార్‌తో అంటాడు. దీంతో జగధాత్రి సుధాకర్‌కు సర్దిచెబుతుంది. మీరు అలా అనబట్టే మామీద మీకున్న ప్రేమ బయటపడిందని అంటుంది. మాపై మీరు ఎంత నమ్మకం పెట్టుకోకపోతే మేం తప్పు చేశామని తెలియగానే మీరు తట్టుకోలేకపోయారని అంటుంది. తప్పు చేసిన వాళ్లకు కఠిన శిక్ష పడాల్సిందేనని సుధాకర్ అంటాడు.నువ్వే చెప్పు వీళ్లను ఏం చేద్దామంటే అదే చేద్దామని అంటాడు. ఇంట్లో నుంచి గెంటివేయడానికి కూడా ఆలోచించనని సుధాకర్ హెచ్చరిస్తాడు. ఆ మాటలకు వైజయంతి వెన్నులో వణుకుపుడుతుంది.
జగధాత్రి నిషిక దగ్గరకు వెళ్లి నువ్వు చెప్పిన చిన్న అబద్ధం ఎంతమందిని బాధపెట్టిందో చూశావు కదా ఇకనైనా ఇలాంటి తప్పుడు పనులు, ఆపద్ధాలు చెప్పడం మానేయమని సూచిస్తుంది. నువ్వు చేసిన తప్పువల్ల మామయ్యగారు ఎక్కువ బాధపడ్డారు కాబట్టి ఆయనకు సారీ చెప్పమని చెబుతుంది. వైజయంతి దగ్గరకు వచ్చి సారీ చెప్పమని చెబుతుంది.లేకపోతే అందరినీ బయటకు గెంటేస్తారని చెప్పడంతో నిషిక సారీ చెబుతుంది. నువ్వు చెప్పాల్సింది నాకు కాదని....నీవల్లే కేదార్,జగధాత్రి ఇబ్బందిపడ్డారు కాబట్టి వాళ్లకు సారీ చెప్పమని చెప్పడంతో సారీ చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన గదిలోకి వెళ్లి వైజయంతి, యువరాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నా చెప్పుకిందపడి ఉండే జగధాత్రి ఇప్పుడు నా నెత్తిన ఎక్కి కూర్చుని ఆడుతుందని...నేను దానికి సారీ చెప్పడం ఏంటని కోప్పడుతుంది. ఇప్పుడు మనం తప్పు చేశామని....కాబట్టే సారీ చెప్పామని వైజయంతి అంటుంది. నువ్వు ఇలాగే గొడవ చేస్తే యువరాజుకు ఆఫీసులో ఇచ్చిన పోస్టు కూడా పీకేస్తారని చెప్పడంతో నిషిక నోరుమూసుకుంటుంది.
కుబేరపురంలో ఏం జరుగుతుంది
కుబేరపురం కేసు జేడీ దగ్గరకు వస్తుంది. కొన్నిరోజులుగా ఆ ఊరిలో అందరూ మాట్లాడుకోవడం మానేసి పాటలుపాడుతున్నారని కేదార్‌కు చెబుతుంది. అదేంటి అలా ఎలా అంటే అసలు పలకరింపులు కూడా పాటల్లాగే ఉంటున్నాయని జేడీ చెప్పడంతో ఇదేదో విచిత్రంగా ఉందని కేదార్ అంటాడు.మనం ఇప్పుడు ఏం చేయాలని అనగా....గణేశ్‌ను పట్టుకుంటే మనకు కొంచెం లీడ్ దొరుకుతుందని జేడీ అంటుంది. ఇంతలో రమ్య గణేశ్‌ను పట్టుకుని తీసుకొస్తుంది. అతను ఈ ఊరిలో అడుగుపెట్టినప్పటి నుంచే అందరూ వింతవింతగా ప్రవర్తిస్తున్నారని జేడీ చెబుతుంది. నాకేమీ తెలియదని గణేశ్ అంటాడు.ఇంతలో అతన్ని వెతుక్కుంటూ గౌరీ అక్కడికి వస్తుంది. జేడీ ఆమెను ప్రశ్నిస్తుంది. ఇతను వచ్చినప్పటి నుంచే ఊరిలో ఇలా జరుగుతుంది. కానీ దీనికి గణేశ్‌కు ఏం సంబంధం లేదని చెబుతుంది. అయితే మనం కుబేరపురం పోయిరావాల్సిందేనని జేడీ కేదార్‌కు చెబుతుంది.
పాపారాయుడి పగ
జైలు నుంచి విడుదలైన పాపారాయుడు నేరుగా మందుసీసా తీసుకుని కౌషికి ఇంటికి వస్తాడు. కౌషికి అరెస్ట్ చేయిస్తే...నువ్వు నీ కొడుకుని పంపి లాయర్‌తో నన్ను బయటకు తీసుకొస్తావా అని వైజయంతిపై మండిపడతాడు.నువ్వు ఇలా చేశావని నిన్ను క్షమించే ప్రసక్తే లేదని...మందుబాటిల్ తీసుకుని లోపలకి రావడంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగిసిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు





















