Jagadhatri Serial Today June 11th:శ్రీవల్లి వైజయంతి కూతురు కాదని చెప్పేసిన యువరాజు...తల్లిని తప్పుపట్టడంతో నిజం చెప్పిన కొడుకు
Jagadhatri Serial Today Episode June 11th: విషం విన్న వైజయంతిని ఆస్పత్రిలో చేర్పించిన జగధాత్రి...పాపారాయుడు రెచ్చగొట్టడంతో నిజం చెప్పేసిన యువరాజు

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. పాపారాయుడు పెట్టిన విషం తిని చావుబతుకుల మధ్య ఉన్న వైజయంతిని ఆస్పత్రిలో చేర్చుతారు.అక్కడికి కూడా వచ్చిన పాపారాయుడు తప్పుచేసిన నా చెల్లెలు బతికి ఉండటానికి వీల్లేదని అనడంతో కోపంలో యువరాజు మామ చొక్కాపట్టుకుని మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదని...అసలు శ్రీవల్లి ఆమె కూతురు కానేకాదని నిజం చెప్పేయడంతో ఇవాల్టి ఏపీసోడ్ ఆసక్తిగా మారుతుంది.
వైజయంతిని కాపాడిన జగధాత్రి
చెల్లికి విషం కలిపిన టిఫిన్ పెట్టి ఆమె ప్రాణాలు తీసేందుకు పాపారాయుడు ప్రయత్నించడాన్ని కిటికీ లోపల నుంచి చూసిన కేదార్,జగధాత్రి పరుగుపరుగు ఇంటిలోకి వస్తారు. మామయ్య పిన్నిని చంపాలని చూస్తున్నాడంటూ కేకలు వేస్తారు. తలుపు తెరవాల్సిందిగా పాపారాయుడిని ఎంత అడిగినా తియ్యకపోవడంతో బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తారు.అప్పటికే నోటి నురుగలు వస్తుండటంతో కేదార్, యువరాజు కలిసి వైజయంత్రిని ఆస్పత్రికి తరలిస్తారు. మీరు దాన్ని ఇవాళ కాపాడినా రేపైనా నా చేతిలో చస్తుందని పాపారాయుడు అంటాడు
ఆస్పత్రిలో నిషిక గొడవ
వైజయంతి ఆస్పత్రిలో ఉందని తెలుసుకుని మీటింగ్‌లు క్యాన్సిల్ చేసుకుని కౌషికి పరుగుపరుగునా ఆస్పత్రికి పరుగెత్తుకుని వస్తుంది. పిన్ని విషం తాగిన విషయం అప్పటి వరకు తెలియని కౌషికి....రిసెప్షన్‌లో ఆ విషయం తెలుసుకుని షాక్‌కు గురవుతుంది. వెంటనే వచ్చి సుధాకర్‌ను అడుగుతుంది. అసలు పిన్ని విషం తాగడమేంటని నిలదీస్తుంది. దీనంతటికి పాపారాయుడు బాబాయే కారణమని జగధాత్రి చెప్పడంతో...అసలు జైలులో ఉండాల్సిన రాయుడు బయటకు ఎలా వచ్చాని ప్రశ్నిస్తుంది. నేను బెయిల్ ఇప్పించి బయటకు తెచ్చానని...ఈ విషయం నీకు చెప్పొద్దని లాయర్‌కు చెప్పానని యవరాజు అంటాడు. దీంతో కౌషికి యువరాజును తిడుతుంది. నీకు అసలు బుద్ధి ఉందా ఆయన కోపంలో ఉన్నారనే కదా జైలులో పెట్టించిందని అంటుంది. భర్తను తిట్టడంతో ఉక్రోశం ఆపుకోలేక నిషిక కల్పించుకుంటుంది. అత్తయ్య బ్రతిమాలితేనే యువరాజు ఈపని చేశాడని చెబుతుంది. జగధాత్రి కూడా తన వళ్లే వాళ్ల తమ్ముడు జైలుపాలయ్యాడన్న బాధలో ఇలా చేసి ఉంటుందని సర్దిచెబుతుంది.
పాపారాయుడు ఇంటి వరకు వస్తే మీరంతా ఏం చేస్తున్నారని కౌషికి ప్రశ్నిస్తుంది. మేం ముందే అడ్డుకున్నామని అసలు ఇంట్లోకి రావొద్దని చెప్పినా....యువరాజు,అత్తయ్యే వినలేదని జగధాత్రి చెబుతుంది. ఆయన చేతిలో ఏదో సీసా ఉందని చెప్పినా వీళ్లు వినిపించుకోలేదని చెప్పడంతో కౌషికి మండిపడుతుంది.దీంతో నిషిక కోపంతో అసలు ఈరోజు అత్తయ్యకు ఇలా కావడానికి కారణం మీ మొగుడు పెళ్లాలేనంటూ మండిపడుతుంది. అసలు మేం ఏం చేశామని జగధాత్రి నిలదీస్తుంది. అసలు నీదే దరిద్రపు జాతకమని....అది అంతా తీసుకొచ్చి ఇప్పుడు మాఇంటిపై పెట్టావని శాపనార్థాలు పెడుతుంది. మీరు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మాకు కష్టాలే మొదలయ్యాయని అంటుంది. అసలు మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోతే మేం ప్రశాంతంగా ఉంటామని తిడుతుంది.దీంతో కౌషికి కల్పించుకుని నిషికపై మండిపడుతుంది. మీ అక్క నీ పక్కన ఉండబట్టే కనీసం నువ్వు ఇంట్లో ఉండగలుగుతున్నావని...నీ చెడు స్నేహాలు, నువ్వు చేసిన తప్పులతో ఎప్పుడ జైలులో ఉండేవాళ్లని గుర్తు చేస్తుంది. వీళ్లు ఇక్కడ ఉండటమే గాక..శ్రీవల్లిని కూడా తెచ్చారని అందుకే మామయ్య ఆ అమ్మాయి ఎవరని ఆరా తీయడం, అత్తయ్యను చంపడానికి ప్రయత్నించడం జరిగాయని నిషిక చెప్పడంతో సుధాకర్ కల్పించుకుని ఆపండి మీ అబద్ధాలని మండిపడతాడు.
నిజం చెప్పిన యువరాజు
ఆస్పత్రికి వచ్చిన పాపారాయుడుని పట్టుకుని యువరాజు మా అమ్మను ఎందుకు చంపాలనుకున్నావని నిలదీస్తాడు. మీ అమ్మ తప్పు చేసింది కాబట్టి చావాల్సిందేనని అంటాడు.అసలు మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదని యువరాజు అంటాడు. అలాంటప్పుడు ఈ అమ్మాయి ఎవరని శ్రీవల్లిని చూపిస్తాడు.అసలు ఆ శ్రీవల్లి మా అమ్మకే పుట్టలేదని గట్టిగా అరుస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.అలాంటప్పుడు శ్రీవల్లిని మీ అమ్మ ఎందుకు అనాథ ఆశ్రమంలో చేర్పించిందని జగధాత్రి నిలదీస్తుంది.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















