అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 9th:చిలకమ్మను కిడ్నాపర్ల నుంచి కాపాడిన కౌషికి...శ్రీవల్లి కోసం మీనన్ మనుషులు ఎందుకు వెతుకుతున్నారు..?

Jagadhatri Serial Today Episode July 9th: చిలకమ్మను కిడ్నాపర్ల నుంచి కాపాడిన కౌషికి...శ్రీవల్లి కోసం మీనన్ మనుషులు ఎందుకు వెతుకుతున్నారు..?

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. చిలకమ్మను మినిష్టర్ మనుషులతో కిడ్నాప్ చేయించేందుకు వైజయంతి, నిషిక ప్రయత్నించగా....కౌషికి  గన్‌ గురిపెట్టి కాపాడుతుంది. మరోవైపు కిడ్నాపర్లు  ఓ యువతిని ఎత్తుకెళ్తుంటే శ్రీవల్లి చూసి గుర్తుపట్టడంతో మీనన్‌ మనుషులు శ్రీవల్లిని తీసుకెళ్లేందుకు వైజయంతి సాయం కోరతారు. మరోవైపు జగధాత్రి తల్లిని అందరి ముందు అవమానిస్తానన్న మినిష్టర్ తాయర్‌కు జగధాత్రి అడ్డుకట్ట వేస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారుతుంది.
నిషిక తీరుపై ధాత్రికి అనుమానం
                           కారు ఎక్కినప్పటి నుంచి వైజయంతి,నిషిక రహస్యంగా మాట్లాడుకోవడం....ఫోన్ వస్తే కోడ్‌ భాషలో మాట్లాడుతుండటం చూసి జగధాత్రికి అనుమానం వస్తుంది.ఖచ్చితంగా వీరిద్దరూ ఏదో ప్లాన్ చేశారని అనుకుంటుంది. రాగిణి అత్తయ్యను ఇంట్లో నుంచి పంపించివేయడానికే వీళ్లు ప్లాన్ వేసి ఉంటారని అనుమానిస్తుంది. ఇంతలో మినిష్టర్ తాయారు నుంచి వైజయంతికి ఫోన్ రావడంతో ఆమె ధాత్రి ఉందని పొడిపొడిగా మాట్లాడుతారు. తాము ఫొటో పంపుతున్నామని ఆమెనే కిడ్నాప్ చేయాలని చెబుతారు. ఇంతలో వారు జగధాత్రి తల్లి పేరిట ఉన్న అనాథ ఆశ్రమం వద్దకు వచ్చేస్తారు. నిషిక వాళ్ల కంగారు చూసి ధాత్రి ఏమైందని అడగుతుంది. ఏం లేదని చెప్పి అత్తా కోడళ్లు తప్పించుకుని వెళ్లిపోతారు.
చిలకమ్మ కిడ్నాప్‌కు యత్నం
                              స్వీట్‌లు కొనుక్కుని తిరిగి వెళ్లేందుకు కౌషికి,చిలకమ్మ, శ్రీవల్లి  బయలుదేరగా....జగధాత్రి వాళ్ల అమ్మకు పూలదండ తీసుకొస్తానని శ్రీవల్లి వెళ్లి దండ కొనుగోలు చేస్తుండగా...అప్పుడే మీనన్ మనుషులో ఓ అమ్మాయిని కిడ్నాప్  చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు.  వారిని చూసి శ్రీవల్లి అడ్డుకుంటుంది. రౌడీలు ఆమెను పక్కకు తోసివేయడంతో గట్టిగా అరుస్తుంది.వెంటనే కౌషికి చూసి అక్కడికి వస్తుంది.అప్పటికే వాళ్లు ఆ యువతిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోతుంటే....కౌషికి చూసి కారు నెంబర్ ఫొటో తీసుకుంటుంది. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి కౌషికి శ్రీవల్లిని తీసుకుని కారు వద్దకు వస్తుంది.
                      తాయారు పంపిన ఫొటోలో ఉన్న  చిలకమ్మను గుర్తుపట్టిన మినిష్టర్‌ మనుషులు...ఆమెను ఎత్తుకెళ్లేందుకు మెడపై కత్తిపెట్టి బెదిరిస్తారు. నేను వాళ్ల ఇంట్లో పనిమనిషినని నన్ను ఎత్తుకెళ్తే ఏం వస్తాయిరా అంటూ చిలకమ్మ వాళ్లను తిడుతుంది. మాకు అన్నీ తెలిసే కిడ్నాప్ చేస్తున్నామని అరవకుండా మేం చెప్పినట్లు చేయమని బెదిరిస్తారు. దీంతో కౌషికి బ్యాగ్‌లో నుంచి గన్‌ బయటకు తీస్తుంది. మర్యాదగా చిలకమ్మను వదిలిపెట్టకపోతే బెదిరించడం కాదని కాల్చి పడేస్తానని హెచ్చరిస్తుంది. ఇది లైసెన్స్‌డు గన్‌ అని కాల్చిపడేసినా ఏం కాదని చెబుతుంది. మూడు లెక్కపెట్టేలోగా మీరు ఆమెను వదిలిపెట్టకపోతే నిజంగానే కాల్చేస్తానని చివరి వార్నింగ్ ఇవ్వడంతో రౌడీలు భయపడిపోయి చిలకమ్మన వదిలిపెట్టి పారిపోతారు. దీంతో చిలకమ్మను తీసుకుని కౌషికి అనాథ ఆశ్రమం వద్దకు వస్తుంది.
శ్రీవల్లిపై గురిపెట్టిన మీనన్‌
              కాలేజీ అమ్మాయిని తీసుకొస్తుంటే...అక్కడ మమ్మల్ని ఓ అమ్మాయి చూసి గుర్తుపట్టిందని రౌడీలు మీనన్‌కు చెబుతారు. మీకు ఎన్నిసార్లు చెప్పానురా ఎవరికీ తెలియకుండా కిడ్నాప్‌లు చేయమని అని అరుస్తాడు. ఆ అమ్మాయి పోలీసుల వద్దకు వెళ్లక ముందే మనం కిడ్నాప్ చేసి తీసుకొద్దామని ఆ అమ్మాయి ఫొటో కూడా తెచ్చామని రౌడీలు చూపిస్తారు. పక్కన కౌషికి ఉండటం చూసి ఆ అమ్మాయి వజ్రపాటి కౌషికి తాలుకా అని మనం కనీసం ఇంటి గేటు కూడా తాకలేమని మీనన్ అంటాడు. అయితే ఆ ఇంట్లోనే మనకు హెల్ఫ్‌ చేసే వాళ్లు ఉన్నారని వైజయంతికి ఫోన్ చేస్తాడు. శ్రీవల్లి ఫొటో పంపి డిటైల్స్ అడుగుతాడు. తన చేతికి మట్టి అంటకుండా శ్రీవల్లి పీడ వదిలిపోతుందనుకుని వైజయంతి కూడా మీనన్‌కు తాము ఉండే లొకేషన్ పంపుతుంది. మధ్యాహ్నం వరకు మేం ఇక్కడే ఉంటామని చెబుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget