Jagadhatri Serial Today JULY 31th: క్షేమంగా ఇంటికి చేరిన శ్రీవల్లి...పాపారాయుడికి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపిన సుధాకర్
Jagadhatri Serial Today Episode July 31th: క్షేమంగా ఇంటికి చేరిన శ్రీవల్లి... పాపారాయుడికి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు సుధాకర్.

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది.కౌషిక ముందు తనను బుక్ చేసినందుకు అత్తమీద నిషిక మండిపడుతుంది. అలా చెప్పకపోయి ఉంటే...శ్రీవల్లిని పంపించడానికే మనమే ప్లాన్ వేశామని కౌషికి అనుకుంటుందని సర్దిచెబుతుంది. ఇంతలో శ్రీవల్లి క్షేమంగా ఇంటికి చేరడంతో...మరోసారి ఇంటివైపు చూడొద్దని పాపారాయుడికి సుధాకర్ వార్నింగ్ ఇస్తాడు. అటు పంతాలకుపోయి జగధాత్రికి పనులు చెబుతున్న నిషిక, వైజయంతి, ఆదిలక్ష్మీకి కేదార్ ఎలా బుద్ధి చెప్పాడన్నది ఈరోజు ఎపిసోడ్‌లో చూడొచ్చు.
వైజయంతిపై నిషిక మండిపాటు
కౌషికి దగ్గర తనదే తప్పు అన్నట్లు అందరూ కలిసి ఇరికించారని నిషిక వాళ్ల అత్తపై మండిపడుతుంది. ఆ ఆదిలక్ష్మీకి సారీ కూడా చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిందని నువ్వే ఆదిలక్ష్మీని తోసేశావని నేను చెప్పకపోయి ఉంటే....జగధాత్రి వచ్చిన తర్వాత ఆ వీడియో చూసి శ్రీవల్లిని బయటకు పంపించడానికే మనమే ప్లాన్ చేసి ఆదిలక్ష్మీని కిందపడేశామని చెబుతుంది. దీంతో మన బండారం బయటపడుతుంది. అందుకే నేను దాన్ని రివేంజ్ స్టోరీలా మలిచానని చెబుతుంది.కౌషికి కూడా నువ్వు కోపంతోనే ఆదిలక్ష్మీని కిందపడేశావని నమ్మేసిందని...ఇప్పుడు జగధాత్రి వచ్చి శ్రీవల్లి గురించి చెప్పినా నమ్మదని అంటుంది. అబ్బా మీరు మంచి ప్లాన్ వేశారు అత్తయ్యా అని నిషిక వైజయంతిని మెచ్చుకుంటుంది.
క్షేమంగా ఇంటికి వచ్చిన శ్రీవల్లి
తలకు కట్టుకట్టుకుని పాపారాయుడు ఇంటికి రావడంతో శ్రీవల్లి ఎక్కడని కౌషికి, సుధాకర్ నిలదీస్తారు..నేను పనిమీద ఊరులోకి వచ్చానని అప్పుడు మీరు ఇంట్లో లేకపోయేసరికి శ్రీవల్లిని తీసుకుని వెళ్లిపోయానని చెబుతాడు. కానీ పెద్ద తప్పు జరిగిపోయిందని...రౌడీలు నన్ను కొట్టి శ్రీవల్లిని తీసుకుని వెళ్లిపోయారని చెబుతాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన జగధాత్రి, కేదార్...అలాంటప్పుడు మీరు ముందుగా పోలీసులకు చెప్పాలి కదా అని గట్టిగా నిలదీస్తుంది. లేదంటే కౌషికి వదినకు అయినా ఫోన్ చేసి చెప్పాలి కదా అని అడుగుతుంది. శ్రీవల్లి కిడ్నాప్ జరిగి రెండు గంటలు అవుతున్నా...మీరు ఇప్పటి వరకు పోలీసులకు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదని ప్రశ్నిస్తుంది. దీంతో పాపారాయుడికి ఏం చేయాలో అర్థంకాదు. వెంటనే వైజయంతి కల్పించుకుని మా అన్నను నిలదీస్తున్నావేంటని అంటుంది. ఇప్పుడైనా పోలీసులకు చెబుదామని కౌషికి అనగా...అవసరం లేదు వదినా నేను ఆల్రెడీ చెప్పానని జేడీ శ్రీవల్లిని కాపాడిందని చెబుతుంది. అంతలోనే రమ్య శ్రీవల్లిని తీసుకుని ఇంటికి వస్తుంది. దీంతో నిషిక, వైజయంతి షాక్ తింటారు. శ్రీవల్లి మీతో రావడం ఇష్టం లేదని పదేపదే చెబుతున్నా మీరు ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారని జగధాత్రి పాపారాయుడిని ప్రశ్నిస్తుంది. శ్రీవల్లి ఎక్కడికి వెళ్లదని ఇక్కడే ఉంటుందని కేదార్ గట్టిగా చెబుతాడు. కౌషికి కూడా అదే మాట చెబుతుంది. మరోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తే...ఇంటివైపు కూడా రానివ్వనని సుధాకర్ బావమరిదికి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాపారాయుడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
నిషికకు బుద్ధి చెప్పిన కేదార్
శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ఎవరో కనుక్కుంటే అసలు శ్రీవల్లి పుట్టుపూర్వోత్తరాలు తెలుస్తాయని...ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారో, ఎవరు చేయించారో తెలుసుకోవచ్చని ధాత్రి కేదార్‌తో అంటుంది. నేను అదే పనిలో ఉన్నానని కేదార్ అంటాడు. ఇంతలో నిషిక బ్లాక్ కాఫీ, వైజయంతి రాగి జావ కావాలని అరవడంతో జగధాత్రి తెస్తున్నానని చెబుతుంది. ఇంతలో ఆదిలక్ష్మీ పంతంతో నాకు టాబ్లెట్‌లు వేసుకునే టైం అవుతుంది టిఫిన్ కావాలని అంటుంది. ఇడ్లీ వేసి ఇస్తానంటే కాదు ఉప్మా కావాలని గొడవ పెట్టుకుటుంది. సరేనని ధాత్రి కిచెన్‌లోకి వెళ్లి ప్రిపేర్ చేస్తుంటుంది. అప్పుడు కావాలనే నిషిక, వైజయంతి కూడా తాము చెప్పిందే తేవాలని అరుస్తారు. ముగ్గురు పంతం పట్టడంతో జగధాత్రికి కోపం వచ్చి నీళ్లు నీళ్లుగా ఉన్న ఉప్మా, నీళ్ల కాఫీ, గట్టిపడిన రాగిసంకటి తెచ్చి వాళ్ల ముఖంపై పడేస్తుంది. మీరు పంతాలకు పోయి ఇలా పోటీలు పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని అంటుంది. అంతలో కౌషికి వచ్చి నీ కాఫీ కూడా నువ్వు తెచ్చుకోలేవా అని నిషికను తిడుతుంది. నాభార్యకే పనులు చెబుతారా అని కేదార్....వాళ్లకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. జగధాత్రిని పడిపోయినట్లు యాక్ట్ చేయమని కిందపడేస్తాడు. ఇప్పుడు చూడు ఇంటి పనులన్నీ వాళ్లే చేస్తారని అంటాడు. ధాత్రి వద్దని చెబుతున్నా నేను చెప్పినట్లు చేయమని కేదార్ అనడంలో ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















