Jagadhatri Serial Today July 22nd: జగద్ధాత్రి సీరియల్: విక్కీ గన్ గేమ్.. సుధాకర్ పరిస్థితేంటి? తాయారుని చంపడానికి వచ్చిన గంగాధర్ ఎవరు?
Jagadhatri Today Episode విక్కీ సుధాకర్‌ని కాల్చడానికి పరుగెత్తించడం గంగాధర్ తాయారుని కాల్చడానికి వచ్చి జగద్ధాత్రికి దొరికిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode సురేశ్ రాజు మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో కౌషికి చాలా బాధ పడుతుంది. దాంతో జగద్ధాత్రి వదినతో అన్నయ్యకి ఏం కాదు నేను మాటిస్తున్నాను అని అంటుంది. జగద్ధాత్రి వెళ్తుంటే మినిస్టర్ తాయారు జగద్ధాత్రి దగ్గరకు వస్తుంది. నా పెనిమిటి చావుకి కారణం నువ్వే నిన్ను చంపేయాలి అన్న కోపం ఉంది కానీ నిన్ను వదిలేస్తున్నా అని అంటుంది.
జగద్ధాత్రి తాయారుతో అవునా అంత ఆఫర్ నాకు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతుంది. దానికి తాయారు నువ్వు నాకు ఓ సాయం చేస్తున్నావు. మీ అమ్మ డైరీ నాకు కావాలి అది నాకు ఇచ్చేయ్ అని అంటుంది. జగద్ధాత్రి నవ్వుతూ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాసిన డైరీ కోసం మీరు నాకు సాయం అడుగుతున్నారు అంటే అది మీకు చాలా ముఖ్యమైనదని నాకు అర్థమైంది.. నా దగ్గర ఆ డైరీ లేదు అది ఉన్నా నేను ఇవ్వను అని జగద్ధాత్రి అంటుంది. దాంతో తాయారు జగద్ధాత్రి నాతో పెట్టుకోవడం అంత మంచిది కాదని నీకు అర్థమయ్యేలా చేస్తా.. నేను అడగటం కాదు నువ్వే పరుగెత్తికొని వచ్చి నాకు డైరీ ఇచ్చేలా చేస్తా అని అంటుంది. జగద్ధాత్రి ఆల్‌ది బెస్ట్ చెప్తుంది.
మరోవైపు గంగాధర్ తాయారుని చంపడానికి తాయారు ఇంటికి దొంగ చాటుగా వస్తాడు. తాయారు ఇంటి లోపల కేక్ కటింగ్ జరుగుతుంటే ఎవరూ చూడకుండా కిటికీ దగ్గరకు వెళ్లి తాయారుకి గన్ గురి పెడతాడు. తాయారు కొడుకు విక్కీతో జగద్ధాత్రికి డైరీ అడిగితే ఇవ్వడం లేదని చెప్తుంది. దాంతో విక్కీ నేను ఇప్పుడు వాళ్లతో ఓ ఆట ఆడుకుంటా అదే తీసుకొచ్చి ఇస్తుందని చెప్పి మేడ మీదకు వెళ్తాడు. జగద్ధాత్రి,కేథార్‌తో ఏదో ప్లాన్ చేస్తున్నారు మనం వెంటనే వదిన వాళ్లని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి అంటుంది. ఇక గంగాధర్ తాయారుకి గన్ గురి పెట్టి నా కుటుంబం మొత్తాన్ని చంపించి నన్ను అనాథని చేశావు కదా తాయారు నువ్వు ఉండాల్సింది జైలులో కానీ ఆ ఛాన్స్ లేదు కాబట్టి నిన్ను నేను చంపి నేను జైలుకి వెళ్తా అనుకుంటాడు.
తాయారు వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉంటే విక్కీ గన్ తీసుకొచ్చి పేల్చుతాడు. అందరూ ఒక్క సారిగా కంగారు పడతారు. పోలీసులు వస్తారు. విక్కీని తాయారు మతిస్థిమితం లేని వాడిలా పరిచయం చేసింది కాబట్టి విక్కీ పిచ్చోడిలా అందరికీ గన్ గురిపెడతాడు. అందరూ గన్ ఇవ్వమని అంటాడు. జగద్ధాత్రి వెళ్లి గన్ అడుగుతుంది. విక్కీ జగద్ధాత్రిని వెనక్కి వెళ్లమని అంటాడు. జగద్ధాత్రి గన్ ఇస్తే వెళ్తానని అంటుంది. అందరూ చెప్తారు కానీ జగద్ధాత్రి వినదు. విక్కీ మూడు లెక్కపెట్టేలోపు వెళ్లకపోతే షూట్ చేసేస్తా అంటాడు. జగద్ధాత్రి మాత్రం కోపంగా చూస్తుంది.
సాధుసార్ జగద్ధాత్రితో వెనక్కి వెళ్లమని అతను కాల్చితే కేసు కూడా ఉండదు అని కోపంగా చెప్తాడు. విక్కీకి గన్ ఇవ్వమని అంటాడు. విక్కీ అందరితో కాసేపు నాతో ఎవరైనా ఆడుకుంటే నేను ఇచ్చేస్తా అంటాడు. దాంతో కేథార్ ముందుకు వచ్చి మనం ఇద్దరం ఆడుకుందాం.. పక్కకి పద అంటాడు. విక్కీ అందరితో నేను గన్ ఎవరి దగ్గర ఆపితే వాళ్లు పరుగెత్తాలి వాళ్ల వెనక నేను పరుగెడతా పరుగు ఆపితే వాళ్లని షూట్ చేసేస్తా అంటాడు. అందరూ చాలా కంగారు పడతాడు. విక్కీ అందరికీ గన్ గురి పెట్టి చివరిగా సుధాకర్ దగ్గర గన్ ఆపి ముందు నువ్వు పరుగెత్తు తర్వాత నేను పరుగెడతా అంటాడు. వైజయంతి, కౌషికి, జగద్ధాత్రి,కేథార్ అందరూ షాక్ అయిపోతారు.
జగద్ధాత్రి తాయారుతో మీరు అయినా మీ కొడుకుకి చెప్పండి అంటే నేను చెప్పినా వినడు అని తాయారు అంటుంది. నిషిక మామయ్యని పరుగెత్తమని అంటుంది. కేథార్ విక్కీ అంతు చూస్తా అని వెళ్తుంటే జగద్ధాత్రి ఆపుతుంది. పాపం సుధాకర్ ఆయాసం ఉన్నా పరుగు పెడతాడు.అందరూ కంగారు పడతారు. కేథార్ జగద్ధాత్రితో నాన్న ఇంక పరుగెత్తలేరు నేను వెళ్తా అంటే జగద్ధాత్రి ఆపుతుంది. నువ్వు వెళ్తే మామయ్యని వాడు కంగారులో కాల్చేస్తాడు అంటుంది. వైజయంతి, కౌషికిలు తాయారులో మీ అబ్బాయిని ఆపండి ఆయనకు ఆస్థమా పరుగెత్తలేరు అని ఏడుస్తారు. వైజయంతి ఏడుస్తుంది. సుధాకర్‌కి ఆయాసం ఎక్కువైపోతుంది.
జగద్ధాత్రి ఏం చేయాలా అని కోపంగా ఉంటుంది. పాపం సుధాకర్ మొత్తం పరుగులు పెడుతూ ఉంటాడు. ఇక జగద్ధాత్రి, కౌషికి వాళ్ల దగ్గరకు వచ్చి పరుగెత్త లేక గుండె పట్టుకుంటాడు. విక్కీ వచ్చి ఇక్కడున్నావా వస్తున్నా అంటాడు. దాంతో కేథార్ నీ పని చెప్తా అని విక్కీ కాళ్లని తన్నేస్తాడు. దాంతో విక్కీ కింద పడిపోతాడు. తాయారు కేథార్‌ని కోపంగా చూస్తుంది. విక్కీ లేచి నాకే కాలు అడ్డు పెడతావా నిన్నూ అని కేథార్‌కి గన్ గురి పెడతాడు. సరిగ్గా అదే టైంకి గంగాధర్ కాల్చడంతో విక్కీ చేతికి బులెట్ తగిలిపోతుంది. జగద్ధాత్రి, కేథార్ బయటకు వెళ్తారు. సాధుసార్ జేడీ, కేడీలతో అరగంటలో వాడు నా దగ్గర ఉండాలి అంటారు. తాయారు పోలీసులు దగ్గర నుంచి జేడీ కేడీలు గంగాధర్‌ని పక్కకి లాగి గన్ గురి పెడతారు. మనిస్టర్ కొడుకుని ఎందుకు చంపాలి అనుకున్నారు అంటే కాదు మినిస్టర్‌నే చంపాలి అనుకున్నా అయినా అది మినిస్టర్ ఏంటి నా వాళ్లని పాతికేళ్ల క్రితం చంపేసిందని అంటాడు. జగద్ధాత్రి, కేథార్ షాక్ అయిపోతారు.
గంగాధర్ జగద్ధాత్రి వాళ్లతో నన్ను ఎందుకు కాపాడుతున్నారు అని అడుగుతాడు. దానికి జగద్ధాత్రి మినిస్టర్ నిన్ను చూసి కంగారు పడింది అంటే తన సీక్రెట్స్ నీకు తెలిసుంటాయి అని అంటుంది. మరోవైపు కౌషికి వాళ్లు సుధాకర్‌ని ఇంటికి తీసుకెళ్లడానికి బయటకు తీసుకొస్తారు. తాయారు కొడుకుతో ఆ గంగాధర్ ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వచ్చాడు నన్ను ఎందుకు చంపాలి అనుకున్నాడు. వాడికి నా గతం తెలుసు వాడు నోరు విప్పితే నా జీవితం నాశనం అయిపోతుందని అంటుంది. జేడీ,కేడీలు సాధుసార్ కలిసి గంగాధర్‌ని ఇంటరాగేషన్ చేస్తారు. ఆ రాక్షసి మా ఇంట్లో వంట మనిషిగా పని చేసిందని అంటాడు. ఎవరు మీరు అసలు సాధు సార్ అడిగితే ఆర్కేయాలజీ హెడ్ బాలాజీ గారి తమ్ముడు అని చెప్తాడు. జగద్ధాత్రి షాక్ అయిపోతుంది. ఆ రోజు తాయారు చంపిన ఫ్యామిలీ మీ అన్నయ్య ఫ్యామిలీనే అంటుంది. అవును అని చిన్ని పిల్లల్ని కూడా చంపేసిందని గంగాధర్ చెప్తాడు. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందని జగద్ధాత్రి అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!





















