అన్వేషించండి

Jagadhatri Serial Today December26th: మెహతా మనుషులతో కౌషికి కుటుంబానికి వచ్చిన గొడవ ఏంటి..? కౌషికి వాళ్లకు ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది.

Jagadhatri Serial Today Episode December 26th: కొత్త ఫ్యాక్టరీ శంకుస్థాపన వద్ద యువరాజును చూసి మెహతా మనుషులు క్రిమినల్ అనడంతో కౌషికి కోపం వస్తుంది. వాళ్లు డీల్‌ క్యాన్సిల్‌ చేసుకుని వెళ్తారు.

Jagadhatri Serial Today Episode: కౌషికి కొత్తగా ప్రారంభించబోయే కంపెనీకి భూమిపూజ కార్యక్రమంలో కేదార్‌, జగధాత్రి ఎంతో సంతోషంగా ఉండటం చూసి వైజయంతి, నిషిక కుళ్లుకుంటారు. డబ్బు,ఆస్తి లేకపోయినా...వీళ్లు ఇంత సంతోషంగా ఎలా ఉండగలగుతున్నారో అని అనుకుంటారు. ఈ జగధాత్రి జీవితంలోకి ఏ తాగుబోతోడో వచ్చి రోజూ టార్చర్‌  చూపిస్తాడని అనుకుంటే...ఈ కేదార్ వచ్చి రోజూ దాన్ని సంతోషంలో ముంచెత్తుతున్నాడని నిషిక వాళ్ల అత్తతో అంటుంది. అది నా కళ్లముందే ఇంత ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానని అంటుంది. నా మెగుడు నన్ను పట్టించుకోవడం లేదన్న బాధ కన్నా...దాని మొగుడు దాన్ని నెత్తిన పెట్టుకున్నాడన్న బాధ ఎక్కువ ఉందని అంటుంది. 
 
                ఇంతలో పూజ మొదలుపెడదామని కౌషికి అంటే సరేనని అంటారు. అయితే మెహతా గ్రూప్ వచ్చి వెళ్లేవరకు యువరాజును కారులో కూర్చోమని సుధాకర్‌ చెబుతాడు. అలా ఎందుకు మామయ్య అని ధాత్రి అడిగితే...మీనన్‌తో యువరాజు చేతులు కలిపిన సంగతి మీడియలో పెద్దఎత్తున తెలిసిందని...ఇప్పుడు వాళ్లు ఇక్కడ వీడిని చూస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందని అంటాడు. మెహతా గ్రూప్ ఇలాంటి విషయాలు ఎక్కువగా చూస్తారని అంటాడు.దీనికి కేదార్‌ కూడాఅడ్డు చెబుతాడు. వాళ్లు అడిగినప్పుడు చూద్దాంలే అంటాడు. యువరాజును పూజకు దూరంగా ఉంచడం మంచిది కాదని చెబుతాడు. మన ఇంటికి సంబంధం లేని అనాథలు పూజలో ఉండొచ్చు గానీ..ఈ ఇంటి బిడ్డ మాత్రం వద్దా అని నిషిక కూడా మండిపడుతుంది. మేం కూడా వెళ్లిపోతామని వైజయంతి,నిషిక అనడంతో కౌషికి సర్దిచెబుతుంది. మెహతా వాళ్లు వచ్చి వెళ్లిన తర్వాతే  యువరాజు పూజలోకి వస్తాడని...ఇష్టం లేనివాళ్లు వాడితో పాటు వెళ్లిపోండని సుధాకర్ అంటాడు. దీంతో యువరాజు కోపంగా వెళ్లి కారులో కూర్చుంటాడు.  మనం కూడా వెళ్లిపోదామని నిషిక అంటే...మనం వెళ్లిపోతే కనీసం మళ్లీ పిలవని కూడా పిలవరని వైజయంతి వద్దని చెబుతుంది. ఇంతలో పూజ మొదలవుతుంది.
   
               మెహతా గ్రూప్‌ వాళ్లు కూడా పూజ వద్దకు వస్తారు. శంకుస్థాపన చేసేవాళ్లను రమ్మని పంతులుగారు పిలవగా...కౌషికి శ్రీవల్లిని కూడా రమ్మని చెబుతుంది. దీంతోవైజయంతి షాక్‌కు గురవుతుంది. శ్రీవల్లి ఈ ఇంటి ఆడపిల్ల కానప్పుడు ఎలా పాల్గొంటుందని నిషి, వైజయంత్రి అడ్డుపడతారు.ఇంత చిన్న విషయం ఎందుకు పెద్దది చేస్తున్నారని ధాత్రి అడుగుతుంది. మన మంచి కోరే పిల్ల ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఏమవుతుందని చెప్పి శ్రీవల్లిని అక్కడికి జగధాత్రి పంపుతుంది. శ్రీవల్లి, కౌషికి కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేస్తుంటారు. తర్వాత పెద్దకొడుకు, పెద్దకోడలురమ్మని పంతులు చెప్పగా...వైజయంతి గట్టిగా మండిపడుతుంది.మాకు ఒక్కడే కొడుకు ఉన్నాడనివాడే  ఈ వంశానికి వారసుడని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పంతులుగారు ఈ అబ్బాయి మీ అబ్బాయి అనుకున్నాను అని అనగా....వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదని...ఏ దిక్కులేక మా ఇంట్లో తలదాచుకున్నారని నిషిక అంటుంది. దీంతో కౌషిక కల్పించుకుని కేదార్‌ నా తమ్ముడులాంటివాడని వాళ్లతో కూడా పూజ చేయిస్తుంది. ఇంతలో మెహతా మీ కొడుకు యువరాజు ఎక్కడని సుధాకర్‌ను అడుగుతాడు. తనని ఇప్పటి వరకు కలవలేదని...మీ తర్వాత తనే కదా ఈ బిజినెస్‌లు అన్నీ చూసుకోవాల్సింది. తను ఎవరినీ కలవకపోతే ఎలా అని అంటాడు. ఇంతలో వైజయంతి కల్పించుకుని మా అబ్బాయి వచ్చాడని..ఇక్కడేఎక్కడో ఉన్నాడని చెబుతుంది. వెళ్లి యువరాజును తీసుకుని రమ్మని నిషికను పంపిస్తుంది.

              నిషిక వెళ్లి యువరాజును రమ్మని పిలవగా అతను రానని అంటాడు. ఇంటికి వెళ్లిపోయానని చెప్పమంటాడు. మెహతా వాళ్లు నీకు బిజినెస్‌ మీద సీరియస్‌నెస్‌ లేదని అనుకుంటున్నారని...ఆ తర్వాత నీకు బిజినెస్‌లో ప్రాబ్లం వస్తుందని బ్రతిమాలి తీసుకొస్తుంది. కౌషికి యువరాజును  మెహతాకు పరిచయం చేయగా...ఆయన పరిశీలనగా చూసి గుర్తుపడతాడు. నువ్వు  మాఫియా డాన్ మీనన్‌కు సాయం చేసి అరెస్టయిన వాడివే కదా అని అడుగుతాడు. క్రిమినల్‌ అనుకుని అరెస్ట్ చేశారని...కాదని తెలిసి వదిలేశారని యువరాజు చెబుతాడు. పోలీసులుకావాలని కేసుల్లో ఇరికించారని వైజయంతి,నిషిక చెబుతారు. దీంతో మెహతాకు కోపం వస్తుంది. సిటీలో ఎంతోమంది ఉన్నా...మేం మీ కంపెనీలోనే ఎందుకు పెట్టుబడి పెడుతున్నామంటే....మీకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే అని మెహతా కౌషికితో అంటాడు. ఇలాంటి క్రిమినల్స్‌తో బిజినెస్‌ చేస్తే మాకు ఉన్న ఇమేజ్ పోతుందని అంటాడు. మర్యాదగల కుటుంబం అనుకుని మీతో చేతులు కలిపామని..క్రిమినల్స్‌ ఉన్న ఫ్యామిలీ అనుకోలేదని మెహతా  అంటాడు. కౌషికితో డీల్‌ క్యాన్సిల్‌ చేస్తున్నానని అంటాడు. మీరు ఫ్యాక్టరీ ఎలా కడతారో నేను చూస్తానని కోపంగా అంటాడు.

              మెహతా మనుషుల మాటలకు కౌషికి తీవ్రమైన కోపం వస్తుంది. మీరు లేకపోయినా  బిజినెస్‌ ఎలా చేయాలో నాకు బాగా తెలుసని వారికి రిటర్న్‌ వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి నా తమ్ముడిని క్రిమినల్‌ అంటే సహించేది లేదని హెచ్చరిస్తుంది. దీంతో వాళ్లు వెళ్లిపోతారు...సుధాకర్‌ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది కదా అని అంటే అవసరం లేదని కౌషికి అంటుంది. ఆ తర్వాత యువరాజు, నిషికూడా పూజలో పాల్గొంటారు. ఇంతలో ల్యాండ్‌ వద్దకు హోంమినిష్టర్ తాయరు తన మనుషులను పంపిస్తుంది. వాళ్లు అక్కడ గొడవ చేయడానికి రావడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Advertisement

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget