Illu Illalu Pillalu Serial Today September 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం నడిరోడ్డు మీద అన్నని కొట్టిన ప్రేమ! ఓ టెన్షన్ నుంచి వల్లీ ఫ్రీ!
Illu Illalu Pillalu Serial Today September 3rd ప్రేమని ధీరజ్ కొట్టాడని విశ్వ తండ్రి, అత్తకి చెప్పి సీరియస్ అవ్వడం, ఇడ్లీబాబాయ్ తిరుపతి చేతి చెంబుని తీసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ కల్యాణ్ కోసం నడి రోడ్డు మీద అర్ధరాత్రి పరుగులు పెడుతుంది. కల్యాణ్ ప్రేమని చాటుగా ఫాలో అవుతూ ప్రేమని ఫొటోలు తీసి ప్రేమకి కాల్ చేస్తాడు. భయంతో ఎంత అందంగా ఉన్నావ్.. నేను నీకు ఫిదా బేబీ.. అని అంటాడు.

రేయ్ ఎక్కడున్నావ్‌రా అని ప్రేమ కోపంగా అడుగుతుంది.దానికి కల్యాణ్ అబ్బా అడగగానే చెప్పేస్తా మరి పరుగెత్తు వెతికి వెతికి నన్ను పట్టుకో అని అంటాడు. రేయ్ రేయ్ అంటూ ప్రేమ పరుగులు పెడుతుంది. ఇంతలో ధీరజ్ కనిపిస్తాడు. ప్రేమ షాక్ అయిపోతుంది. టైం పదకొండున్నర అవుతుంది. ఈ టైంలో ఇలా ఒక్క దానివే రోడ్ల మీద పరుగెత్తడం ఏంటి చెప్పు.. ఇందాక రూంలో కూడా నువ్వు ఇలాగే టెన్షన్ పడ్డావ్ అడిగితే చెప్పడం లేదు.. ప్రేమ ఏమైంది. నిన్ను ఇలా అర్ధరాత్రులు రోడ్లమీద పరుగెత్తిస్తున్న భయం ఏంటి చెప్పు అని ప్రాధేయపడతాడు. నేను చెప్పనురా నా గురించి నీకు ఎందుకు అని ప్రేమ అంటుంది. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా నాకు ఎందుకు అంటావ్.. నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. చెప్పు ఏమైంది అని మళ్లీ ధీరజ్ అడుగుతాడు.

ప్రేమని ధీరజ్ ఎన్నిసార్లు అడిగినా ప్రేమ చెప్పదు. నా విషయాలు నీకు ఎందుకు అనేస్తుంది. దాంతో ధీరజ్ కోపంతో ప్రేమని లాగిపెట్టి కొడతాడు. అదంతా ప్రేమ అన్నయ్య విశ్వ చూస్తాడు. నా చెల్లినే కొడతావారా అని ధీరజ్‌తో కొట్లాటకు దిగుతాడు. ప్రేమ అన్నని ఆపాలని ప్రయత్నిస్తుంది. ఎంతకీ అన్న ఆగకపోవడంతో లాగి పెట్టి కొడుతుంది. 
ప్రేమ కొట్టడంతో విశ్వ బాధగా ప్రేమ ఈ అన్నయ్యని కొడతావా అని అడుగుతాడు. నా భర్త మీద చేయి వేస్తే ఎవరినైనా కొడతా అని అంటుంది. వాడు నా చెల్లిని కొట్టాడు మరి నేను గొడవ పడకుండా ఎలా ఉంటాను అని అంటాను అని విశ్వ అంటాడు. దానికి ప్రేమ మా మొగుడు పెళ్లాల మధ్య సవాలక్ష ఉంటాయి నన్ను కొడతాడు తిడతాడు నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటావ్ అంటుంది. నేను నీ అన్నయ్యనే అని విశ్వ అంటే అయితే ఏంటి అని ప్రేమ అంటుంది. విశ్వ ఏడుస్తూ అయితే ఏంటా.. అయితే ఏంటా.. నా చెల్లిని వీడుకొట్టినా తిట్టినా నేను చేతకాని వెధవలా ఉండాలి.. కోపంతో రక్తం మరిగిపోయిన చేతకాని చెవటలా ఉండిపోవాలి.. అయితే ఏంటి.. అయితే ఏంటి అంతే కదా అని బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ప్రేమ ధీరజ్ కోసం అన్నతో అలా మాట్లాడే సరికి ధీరజ్ చాలా పశ్చాత్తాపపడతాడు. ప్రేమ, ధీరజ్ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ప్రేమ ధీరజ్ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. 
తిరుపతి హాల్‌లో చాపదిండు వేసుకుంటే ఇడ్లీబాబాయ్ అక్కడికి వస్తాడు. ఏంటి అన్నాయ్ నువ్వు వచ్చావ్ అంటే ఇక్కడే పడుకుంటా అంటాడు. ఇక్కడే ఎందుకు అని తిరుపతి అడిగితే తిరుపతి చేతికి ఉన్న చెంబు పట్టుకొని నాక్కావలసింది.. నీ దగ్గర ఉంది.. అందుకో ఓ తిరుపతి.. అని పాడుతాడు. తిరుపతి కంగుతిని అన్నాయ్ నీకు కావాల్సింది నా దగ్గర ఏముంది నీ డైలాగ్‌లో ఏదో తేడా ఉంది అని అడుగుతాడు. తేడా ఏం లేదు నువ్వు చెంబుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో చూడ్డానికి వచ్చానని అంటాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ పడుకుంటారు. తిరుపతి పడుకున్న తర్వాత ఇడ్లీ బాబాయ్ చెక్ చేసి పడుకున్నాడని కన్ఫ్మమ్ చేసుకున్న తర్వాత చెంబు అంతు చూడాలి అనుకుంటాడు. ఇక చిన్న రంపంతో చెంబు కట్ చేయడం మొదలు పెడతాడు.
భద్రావతి, సేన విశ్వ పెళ్లి గురించి మాట్లాడుకుంటే విశ్వ ఆవేశంగా ఇంటికి వచ్చి కోపంతో అన్నీ తన్నేస్తాడు. ఇద్దరూ వచ్చి విశ్వకి ఏమైంది అని అడిగితే మీ ఇద్దరూ చచ్చిపోండి.. సిగ్గు ఏం లేదు కదా అని అంటాడు. ఏమైంది అని భద్రావతి అడిగితే ప్రేమ ఎలా తయారైందో తెలుసా. ఆ ధీరజ్ కోసం నన్ను కొట్టింది.. అంటాడు. అది మన మాట వినడం లేదు వదిలేరా అని విశ్వకి తండ్రి చెప్తాడు. దానికి విశ్వ ఎలా వదిలేయాలి మనం అందరం దాన్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. ఒక్క దెబ్బ అయినా కొట్టామా.. అని జరిగింది చెప్తాడు. మన అసమర్థతే వాళ్లకి కొమ్ములొచ్చేలా చేస్తుంది. వాళ్ల బాగానే ఉన్నారు కానీ అటు అత్తని ఇటు ప్రేమని దూరం చేసుకొని మనం బాధ పడుతున్నాం.. పాతికేళ్లగా పగ అని అంటున్నారు కానీ వాడిని దెబ్బ కొట్టేలా ఒక్క పని అయినా చేశారా ఇప్పుటికైనా ఏదో ఒకటి చేయండి అంటుంది. దాంతో భద్రావతి మనసులో చేస్తానురా ఆ రామరాజు ఫ్యామిలీ నాశనం అయ్యేలా చేస్తా అని అనుకుంటుంది. 
మరోవైపు ఇడ్లీబాబాయ్ చాలా కష్టపడి మొత్తానికి చెంబు తిరుపతి చేతి నుంచి తీసేస్తాడు. ఇంతలో వల్లీ వస్తూ డోర్ తీయడంతో ఇడ్లీ బాబాయ్ గుండె ఆగినంత పని అయిపోతుంది. వల్లీ నాన్న అని పిలవడంతో ఊపిరి పీల్చుకుంటాడు. చెంబు వచ్చేసిందని ఇద్దరూ ఎగిరి గంతులేస్తారు. చెంబులో గిల్ట్ నగలు వల్లీ తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















