Illu Illalu Pillalu Serial Today November 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని పుట్టింటికి గెంటేసిన ధీరజ్! అసలు కారణమేంటి? భయంతో వల్లీ పరుగులు!
Illu Illalu Pillalu Serial Today Episode November 12th నర్మద ప్రేమ మాట్లాడుకోవడం అది వేదవతి వినేయడం ధీరజ్‌కి కూడా ప్రేమ ఏదో చేసిందని అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ తన తండ్రి అరెస్ట్‌కి తానే కారణం అవ్వడంతో చాలా బాధ పడుతూ ఉంటుంది. ప్రేమ దగ్గరకు నర్మద వెళ్లి.. థ్యాంక్స్ చెప్తుంది. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అని చెప్తుంది. నర్మద, ప్రేమ మాట్లాడుకోవడం వేదవతి చూస్తుంది. 
ప్రేమ నర్మదతో ఇంత చిన్న దానికి థ్యాంక్స్ ఎందుకు అక్కా అని అంటే..ఏంటి ఇది చిన్న విషయమా నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే తండ్రిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు మాత్రం రక్త సంబంధాన్ని కాదు అని 8 నెలల పరిచయం ఉన్న ఈ తోటి కోడలి కోసం.. ముక్కూముఖం తెలియని నా కోసం.. కన్న తండ్రి జైలుకి వెళ్లినా పర్లేదు అనుకోవడం చిన్ని విషయమా చాలా చాలా రుణపడిపోయాను ప్రేమ అని అంటుంది.
మా నాన్న జైలు పాలవడం అది కూడా నా వల్ల అవ్వడం చాలా బాధాకరం కానీ నేను అలా చేయకపోయి ఉంటే నువ్వు చేయని నేరానికి జైలు పాలయ్యేదానివి.. రామరాజు గారి కోడలు అవినీతి కేసులో అరెస్ట్ అయితే మామయ్య గారి పరువు పోయేది..అప్పుడు నువ్వు జీవితాంతం మామయ్య పరువు తీసేసిన కోడలిగా మిగిలిపోయేదానివి,, దాని వల్ల సాగర్ బావకి నీకు మధ్య గొడవలు వచ్చేవి ఇన్ని తెలిసి నేను మా నాన్నకి సపోర్ట్ చేస్తే అత్తింటికి ద్రోహం చేసినట్లు అయ్యుండేది కదా అక్క అని అంటుంది. మా వాళ్ల దృష్టిలో నేను లేచిపోయి పెళ్లి చేసుకున్న కూతురిని మా వాళ్లకి ఇప్పటి వరకు నా మీద కోపం ఉంది.. కానీ ఇప్పుడు అది ద్వేషం అవుతుంది అంతే కదా అక్క అని అంటుంది. 
వేదవతి మనసులో నువ్వు నాలాంటి దానివే ప్రేమ. ఎదిగిపోయావ్ ప్రేమ ఈ మేనత్త దృష్టిలో నువ్వు ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయావ్.. అని అనుకుంటుంది.
ధరజ్ ప్రేమ పుట్టింటికి వెళ్లిపోయిన విషయం గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ రాగానే నీది కూడా మీ నాన్న లాంటి బుద్ధే అని ఆలోచిస్తున్నా.. చూశావు కదా మీ నాన్న తప్పు చేశాను అనే భయం లేకుండా మా వదినకు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో నువ్వు అలాంటి దానివే అని ప్రేమని అనవసరంగా తిడతాడు. మీ వాళ్లకి అలాంటి బతుకు బతకడానికి సిగ్గులేదా అని అంటాడు. ఆ టాపిక్ వదిలేయ్ అని ప్రేమ అన్నా సరే ధీరజ్ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. నీ పుట్టింటికి వెళ్దువు గానీ పద అని ప్రేమని ఈడ్చుకొని వెళ్తాడు. ప్రేమని గేటు తీసి తోసేస్తాడు.
ఇప్పుడు వెళ్లవే మొన్న అంత ఆవేశంగా వెళ్లావ్., ఇప్పుడు వెళ్లడం లేదు ఏంటే.. మొన్న నువ్వు వెళ్లావు అంటే ఏదో చేయడానికి వెళ్లావని అర్థమైంది.. మొన్న ఏం చేశావో చెప్పు అని అంటాడు.
ఏం లేదు అని ప్రేమ అంటే మొన్న ఏం చేశావో చెప్పు లేదంటే ఇప్పుడు వెళ్లిపో అని అంటాడు. మన రెండు కుటుంబాలు కలిస్తేనే కూతురిగా ఆ ఇంటికి వెళ్తా లేదంటే ఈ గీత దాటను ఆ ఇంటికి వెళ్లను అని అంటుంది. అది ఈ జన్మకి జరగదు అని ధీరజ్ అంటే నేను బలంగా కోరుకుంటున్నానురా అది కచ్చితంగా జరుగుతుంది అని అంటుంది. రెండు కుటుంబాలను కలపాలి అని నువ్వే పిచ్చి పిచ్చి పనులు చేయకు. దాని వల్ల మరో పాతికేళ్లు కొట్టుకునేలా చేయకు అని అంటాడు.
భద్రావతి, విశ్వ లాయర్ దగ్గరకు వెళ్లి డబ్బు ఇచ్చి సేనాపతి రేపటికల్లా బయటకు రవాలని చెప్తుంది. దానికి లాయర్ కేవలం డబ్బు పంపడం తప్ప నర్మదని ఇరికించమని ఫోన్లో మాట్లాడలేదు.. ఇంకేం చెప్పలేదు సో ఆ డబ్బు అప్పుగా అయినా ఇవ్వొచ్చు ఇంకేదైనా కారణం కావొచ్చు కచ్చితంగా బెయిల్ వస్తుంది. నేను చూసుకుంటా అని లాయర్ చెప్తారు.
భద్రావతి నర్మద మీద కోపంతో రగిలిపోతుంది. విశ్వతో మన ఇంట్లో పనోడిగా పని చేసిన ఆ రామరాజు వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూశావా అని అంటుంది. మనం అవమాన పడి బాధ పడటం ఇదే చివరి సారి కావాలి.. మనం పడిన బాధ ఆ రామరాజు పడాలి.. అది నీ చేతిలోనే ఉంది.. వాడి చిన్న కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకో అని అంటుంది. అమూల్య నా ట్రాప్‌లో పడిపోయింది అని విశ్వ అంటాడు.
ప్రేమ కత్తి తీసుకొని వల్లీ దగ్గరకు వస్తుంది. వల్లీ వణికి పోతుంది. ఎందుకు వెధవ ఓవర్ యాక్షన్ చేశావ్.. నర్మద అక్కని అవినీతి కేసులో ఇరికించాలి అనుకోవడంలో నీ చేయి కూడా ఉందని నాకు తెలుసిపోయింది అని ప్రేమ అంటుంది. వల్లీ నాకేం తెలీదు అంతా మా అమ్మ చేసింది అని అంటుంది. నిన్ను చంపేస్తా అని ప్రేమ అంటే వల్లీ మొత్తం పరుగులు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















