అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 27th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ బ్యాడ్ టైం స్టార్ట్! విలన్స్‌గా మారిపోయిన నర్మద, ప్రేమ!

Illu Illalu Pillalu Serial Today Episode March 27th ప్రేమ, నర్మదలు శ్రీవల్లిని రోడ్డు మీద పరుగులు పెట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode ప్రేమ అమూల్యని రెడీ చేసి టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అన్నీ మారుతాయ్.. తగిలిన గాయాలు మారుతాయి.. అన్నీ చీల్చుకొని ముందుకు వెళ్తేనే జీవితం కొత్తగా ఉంటుంది అని చెప్తుంది. అమూల్య ప్రేమని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. ధీరజ్ వచ్చి ఏంటి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తను చెప్తుందా అంటే అమూల్య అది కాదు అన్నయ్య అని అంటే వద్దు ఏం చెప్పకు అని అంటాడు.

ప్రేమ ధీరజ్‌తో నేనేం తప్పు చేయలేదురా.. నాకేం తెలీదు నమ్మరా మొగుడా అంటే నీ చెవికి ఎక్కదా.. నమ్మరా ప్లీజ్ నమ్ము అని అంటుంది. నేనేం నమ్మను అని వెళ్తూ ఉంటే షర్ట్ డోర్‌కి ఇరుక్కుంటుంది. ధీరజ్ ప్రేమే అనుకొని వదలవే అంటాడు.. ప్రేమ చూసి నేను వదలను అంటుంది. వదలవే అంటే నన్ను బతిమాలితే వదులుతా అంటుంది. వెనక్కి తిరిగి చూడరా అంటే చూడను అని షర్ట్ గట్టిగా లాగితే షర్ట్ చిరిగిపోతుంది. అవతల వాళ్లకి  చెప్పే ఛాన్స్ ఇవ్వకపోతే ఇలా విరిగిపోతుంది మనసు అని అంటుంది. నువ్వు ఎప్పుడో నా మనసు విరిచేశావని ధీరజ్ అంటాడు. ఇక ధీరజ్ అమూల్యని కాలేజ్‌లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు.

శ్రీవల్లి పుట్టింటిలో పడుకొని ఉంటే.. భాగ్యం చూసి నా కూతురికి అత్తారింట్లో ఎన్ని కష్టాలు పెడుతున్నారో.. కనీసం నిద్రకు కూడా పోనివ్వట్లేదు అందుకే ఇలా టైం కాని టైంలో గురక పెట్టి నిద్రపోతుంది అని భాగ్యం లేపుతుంది. ఎందుకమ్మా నిద్ర లేపుతున్నావ్ అంటే స్కూల్ అయిపోయే టైం అయిపోయింది. మీ ఆయన నిన్ను తీసుకెళ్లడానికి స్కూల్ దగ్గరకు వెళ్తారు అని అంటుంది. అమ్మా ఇల్లు అనకే నాకు భయం వేస్తుంది. ఆ ఇద్దరూ నరకంలో లేని శిక్షలు కూడా నాకోసం డిజైన్ చేస్తున్నారు నా వల్ల కాదు.. మా ఆయనకు కాల్ చేసి ఈ పూటకి ఇక్కడే ఉంటాను అని ఏదో ఒక మ్యానేజింగ్ చేయ్ అని అంటుంది. ఇంతలో నర్మద, ప్రేమ కలిసి శ్రీవల్లికి కాల్ చేస్తారు. బల్లిఅక్కాయ్ ఏం చేస్తుంది అని ఇద్దరూ ఒకే సారి అడుగుతారు. మీ కచేరితో నా ఒళ్లు హూనం అయిపోయింది కూసంత రెస్ట్ తీసుకుంటున్నా అని అంటుంది. అయితే మరి రోడ్డు మీద ఎలా పరుగులు పెడుతుంది మా బల్లి అక్కాయ్ అని అంటారు. ఎందుకు అని వల్లీ అడిగితే నీ అందమైన వాయిస్ మీ ఆయనకు పంపేశాం కదా అంటారు. దాంతో శ్రీవల్లి చాలా కంగారు పడుతుంది. వెంటనే లేచి పరుగుకి రెడీ అయిపోతుంది.

చందు కాల్ చేయడంతో వాయిస్ వినేసుంటాడా అని పరుగులు పెడుతుంది. పరుగులు పెడుతూ స్కూల్ బయట ఉన్న చందు దగ్గరకు వెళ్తుంది. ప్రేమ వాయిస్ మెసేజ్ పెట్టింది అని చందు అంటే నేను వింటా అని శ్రీవల్లి ఫోన్ లాక్కోవాలని చూస్తుంది. చందు వద్దని ఫోన్ లాక్కుంటాడు. ఇద్దరం కలిసి విందామని అంటాడు. ప్రేమ వాయిస్లో వల్లీ అక్కని త్వరగా పిక్ చేసుకొని ఇంటికి తీసుకురండి.. పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి అలిసిపోయింటుందని అంటుంది. ఇద్దరూ నన్ను వెర్రిదాన్ని చేసి వాయించేశారన్నమాట అని శ్రీవల్లి అనుకుంటుంది. 

ప్రేమ, నర్మదలు ఇంటి దగ్గర ఓ తాడుని చెరోవైపు పట్టుకొని లాక్కొని టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటారు. వల్లీ వచ్చిందా లేదా అని చూస్తూ ఉంటారు. ఇంతలో వల్లీ వస్తుంది. నర్మద అటు చూస్తుండగా ప్రేమ నర్మదని లాగేస్తుంది. ప్రేమ గెలిచేస్తుంది. దాంతో నేనే గెలిచాను..నైట్ బల్లి అక్కని ఆడుకునే ఛాన్స్ నాదే అని గెంతులేస్తుంది. ఇద్దరూ ఇలా తాడుతో బలప్రయోగం చేస్తున్నారు నా ముఖానికి వేసి లాగేస్తారా ఏంటి అని అనుకుంటారు. ఇద్దరూ వల్లీని పిలుస్తారు. స్కూల్ ఎలా ఉంది.. బెంచీలు ఎలా ఉన్నాయి.. అని ప్రేమ అడిగితే తన ముఖం చూస్తే అర్థం కావడం లేదా ఫుల్లుగా పడుకొని వచ్చింది అని అంటుంది. మీరు నన్ను ఉంచడం లేదు కదా అని వల్లీ అంటే నిన్నే అంటుంది అని నర్మద ప్రేమని అంటుంది. దాంతో ప్రేమ నేను హర్ట్ అయ్యాను వెళ్లిచెప్పేస్తా అని ప్రేమ అంటే.. వద్దు అని శ్రీవల్లి బతిమాలుతుంది. తర్వాత నర్మద కూడా నన్ను అన్నావా నేను చెప్పేస్తా అని అంటుంది. దాంతో వల్లీ నర్మదని బతిమాలుతుంది. ఇక ఇద్దరూ శ్రీరామనవమికి ఇంట్లో చెప్పేస్తాం అని ఈ రోజు రాత్రి కచేరి ఉంది రెడీ అయిపో అని చెప్తారు. వెళ్తూ వెళ్తూ ఈ సారి మేం విలన్స్ అని చెప్పి వెళ్లిపోతారు.

ప్రేమ బాత్‌రూం స్నానానికి వేడి నీరు పెట్టుకుంటుంది. ప్రేమ సున్నిపిండి కోసం వచ్చేలోపు ధీరజ్ వెళ్లిపోతాడు. ధీరజ్ ఉన్నాడు అని తెలీక ప్రేమ కూడా వెళ్లిపోతుంది. అప్పుడే ఆయిల్ కింద పడిపోతుంది. నేను పెట్టుకున్న వేడినీరుతో ఎందుకు స్నానం చేశావ్‌రా అని ప్రేమ అడుగుతుంది. అందుకే అవి  మండిపోతున్నాయ్ అప్పుడే అనుకున్నా నీ నీరు అని అంటాడు. ఇక ధీరజ్ బయటకు వెళ్లబోతూ ఆయిల్ వల్ల పడిపోతాడు.ప్రేమ  పట్టుకుంటుంది. నన్ను అంత సేపు పట్టుకున్నావ్ అంటే నేను అంటే నీకు ఎంత ఇష్టమో అని ప్రేమ అంటుంది. ధీరజ్ తన బట్టలు తీసుకోవాలని ప్రేమవి తీసుకుంటాడు. ఇక ప్రేమ వచ్చి నా కళ్లలోకి చూసి నా బట్టలు తీసుకున్నావ్ అని అంటాడు. అప్పుడే ధీరజ్ టవల్ జారిపోతే ప్రేమ నవ్వి వెటకారం చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Karthika Deepam 2 Serial Today August 20th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget