అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 26th:యాక్సిడెంట్‌ జరగడానికి మధుబాబు కారణమని శ్రీలక్ష్మీ సూర్యనారాయణకు చెప్పిందా లేదా..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 26th: యాక్సిడెంట్‌ జరగడానికి మధుబాబు కారణమని శ్రీలక్ష్మీ సూర్యనారాయణకు చెప్పిందా లేదా..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందని సూర్యనారాయణ శ్రీలక్ష్మీని  అడుగుతాడు. తనవల్లే ఇదంతా జరిగిందని లక్ష్మీ చెబుతుందేమోనని మ్యాడీ భయపడతాడు.అయితే తాను లెక్చరర్‌ను కలవడానికి వెళ్లడంతో చాలా లేట్‌ అయ్యిందని అందుకే మధుబాబు నేను  ఇంటికి వెళ్లిపోయానని వచ్చేశాడని చెబుతుంది. ఆటోకోసం రోడ్డు దాటుతుంటే ఇంకో వాహనం వచ్చి ఢీకొట్టిందని చెబుతుంది. దీంతో మ్యాడీ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. రోడ్డు దాటేప్పుడు అటుఇటు చూసుకోవడం తెలియదా అని ప్రియంవద మండిపడుతుంది.నేను చూసుకునే రోడ్డు దాటానని....కాకపోతే ఆ వెహికిల్ వాడు చూసుకోలేదని చెబుతుంది. ఏదైతేనేమీ శ్రీలక్ష్మీ క్షేమంగా ఇంటికి వచ్చింది అది చాలని సూర్యనారాయణ అంటాడు. డాక్టర్లు కూడా  ఆశలు వదిలేసుకున్న సమయంలో మన మ్యాడీ నిప్పులుగుండంలో నడిచి తన భార్యను బ్రతికించుకున్నాడని ఇందిర చెబుతుంది. ఆ మాటలు విన్న అందరూ షాక్‌ తింటారు. శ్రీలక్ష్మీ కూడా ఇది నిజమా, కలా అని అనుకుంటుంది.
                        సూర్యనారాయణ మ్యాడీ వద్దకు వెళ్లి నిన్ను చాలాసార్లు బాధపెట్టానని,అల్లర చిల్లరగా తిరుగుతున్నావని కోప్పడ్డానని,ఆస్పత్రిలో కూడా నీపై చేయిచేసుకున్నానని అంటాడు. కానీ నువ్వు చేసిన పని చూస్తుంటే ఇప్పుడు చాలా గర్వంగా ఉందని అంటాడు.నీకు ఇబ్బంది కలిగినప్పుడు తను ఆదుకుంటే...తాను జైలులో ఉన్నప్పుడు నువ్వు  తనను రక్షించడమేగాక...నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టి నీభార్యను నిర్దోషిగా ఇంటికి తెచ్చుకున్నావని అంటాడు.  ఇప్పుడు ఏకంగా నిప్పులుగుండం తొక్కి నీ భార్యను కాపాడుకున్నావని పొగడ్తలతో ముంచెత్తుతాడు. మీ ఇద్దరినీ చూస్తుంటే...ఒకరికోసం ఒకరు పుట్టినట్లు ఉన్నారని....ఇలాగే కలకాలం ఉండాలని దీవిస్తాడు. ఇదంతా చూసిన ప్రియంవదకు కోపం వస్తుంది. మ్యాడీ కాళ్లు మండుతున్నాయని...ఇంట్లోకి తీసుకెళ్తారా లేదా అనగా...మధుబాబును రూమ్‌లోకి తీసుకెళ్లమని సూర్యనారాయణ శ్రీలక్ష్మీకి చెప్పగా...ఆమె మ్యాడీని తన గదిలోకి తీసుకెళ్తుంది. తన తల్లిచేసిన పనికి ప్రియంవద ఆమెపై మండిపడుతుంది. నీ మూఢనమ్మకంతో మ్యాడీప్రాణాలు తీసేలా ఉన్నావని అంటుంది. వాడు తన భార్య కోసం నిప్పులుగుండంలో నడిచి కాపాడుకున్నాడని అంటుంది. నువ్వు కూడా ఆ నిప్పులగుండంలో నడిస్తే కాస్త మనసుకు ప్రశాంతత లభిస్తుందని సలహా ఇస్తుంది.
                                కాళ్లు బొబ్బలు వచ్చి బాధపడుతున్న మ్యాడీకి శ్రీలక్ష్మీ వెన్నపూస రాయడానికి వస్తుంది.దీంతో మ్యాడీ ఆమెను తిట్టి బయటకు వెళ్లిపొమ్మని అంటాడు. నాకోసం అంత కష్టపడి నిప్పులుగుండం తొక్కితే కనీసం పాదాలకు వెన్నపూస కూడా రాయనివ్వరా అని అంటుంది. ఇలాటి ఛీప్‌ట్రిక్స్‌తో నన్ను పడేయాలని చూడకని అంటాడు. నాకు ఆ అవసరం లేదని...నావల్లే మీరు ఇబ్బందిపడుతున్నారని వెన్నపూస రాయడానికి వచ్చానని అంటుంది. అది రాసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తానని అంటుంది. చేసేదిలేక ఆమెతో వెన్నపూస రాయించుకుంటాడు. కాలేజీలో ఆ ఫొటోలు అంటించి పిచ్చిరాతలు తాను రాయలేదని లక్ష్మీ చెప్పినా మ్యాడీ వినడు. నిజంగా మీరు నావాడు అని అందరికీ తెలియాలి అంటే...ఈ తాళి బయటకు తీసి చూపించేదాన్నని, అలాంటి పిచ్చిపనులు చేసేదాన్ని కాదని అంటుంది. వెన్నపూస రాసి శ్రీలక్ష్మీ వెళ్లిపోగానే...మ్యాడీ నిద్రపోతాడు. ఉదయం కాలేజీకి వచ్చిన త్రిష...మ్యాడీ రాలేదని తెలిసి అతనికి ఫోన్ చేస్తుంది. మ్యాడీ రాలేదంటే...ఖచ్చితంగా శ్రీలక్ష్మీ చచ్చిపోయి ఉంటుందని ఆనందపడుతుంది. మ్యాడీ ఫోన్ చేసి లక్ష్మీకి ఏం కాలేదని బాగానే ఉందని అంటాడు. మా నాయనమ్మ తనకోసం నన్ను నిప్పులగుండంలో నడిపించిందని చెప్పడంతో త్రిష కోపంతో  రగిలిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget