అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 26th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని స్కూల్ పేరుతో టార్చర్ చేసిన నర్మద, ప్రేమ! పద్మవ్యూహంలో చిక్కుకుందా!

 Illu Illalu Pillalu Serial Today Episode March 26th నర్మద రామరాజుకి ప్రిన్సిపల్‌తో కాల్ చేయించి స్కూల్‌కి వల్లీని పంపమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode శ్రీవల్లి తనని ఓ వైపు అత్తయ్య మరోవైపు తోటికోడళ్లు వాయించేస్తున్నారని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో రామరాజు వల్లీ అని కేకలేస్తాడు. ఏమైందో అని టెన్షన్‌గా వల్లీ వెళ్తుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. ఎందుకు ఇలా చేశావ్.. నువ్వు మాత్రమే అసలైన కోడలు మంచి కోడలు అనుకున్నా కానీ ఎందుకు ఇలా చేశావ్ అని అడుగుతాడు. వల్లీ అమూల్య గురించి అని టెన్షన్ పడుతూ మామయ్య గారు అది అసలు ఏం జరిగింది అంటే అని అంటే ఇప్పుడే నాకు ప్రిన్సిపల్ కాల్ చేసి చెప్పే వరకు నాకు తెలీదు నువ్వు స్కూల్‌కి వెళ్లడం లేదని అంటాడు.

శ్రీవల్లి ఈ విషయం కోసమా నేను ఆ విషయం అనుకున్నా అని అంటుంది. ఆ విషయం అంటే ఏంటి అని నర్మద, ప్రేమ అంటారు. దానికి శ్రీవల్లి మా అమ్మావాళ్లు రాలేదని అడిగారు ఏమో అని అంటుంది. నిన్నే కదా వెళ్లారు అని వేదవతి అంటుంది. ఈ రోజు నుంచే స్కూల్‌కి వెళ్లు అని రామరాజు అంటే అత్తయ్యగారు ఒక్కరే అయిపోతారు పనులు చేయలేరు అని శ్రీవల్లి అంటే లాగి పెట్టి కొట్టానంటే అయిపోతావ్ అని వేదవతి అంటుంది. నేనేం చేశాను అత్తయ్య గారు అని అంటే అది కాదమ్మా నువ్వు వెళ్లకపోతే మీ మామయ్య గారి పేరుకి మాట వచ్చేస్తుంది. నువ్వు నా గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా వెళ్లు అని అంటుంది. ప్రేమ శ్రీవల్లితో విన్నావు కదా అక్కాయ్ నువ్వు ఇరగదీయాలి అని అంటుంది. నర్మద కూడా వెళ్లు అక్కాయ్ అని అంటుంది. నేను వెళ్లను.. స్కూల్‌కి వెళ్లడం కంటే నాకు దేవుడు లాంటి మామయ్యకి దేవత లాంటి అత్తయ్యకి సేవలు చేసుకుంటాను అని అంటుంది. 

ప్రేమ, నర్మదలు అయితే వెళ్లను అంటావ్ కదా.. అయితే ప్రిన్సిపల్‌కి వాయిస్ మెసేజ్ చేస్తాం అని రామరాజుని చూపించి అంటారు. దాంతో వల్లీ భయపడి వెళ్తాను ఇంత మందికి ఇష్టం కదా వెళ్తాను అంటుంది. చందు కూడా వెళ్లమని అంటాడు. ఇక నర్మద ప్రేమతో  ఆ వల్లీని పద్మవ్యూహంలో ఇరికించాం అని అంటుంది. ఎలా అక్కా ఇదంతా అని అంటే నర్మద ప్రిన్సిపల్ గారికి కాల్ చేసి చెప్పినట్లు చేయమని చెప్పానని అంటుంది. వల్లీ వెళ్తుందా అని అంటే అస్సలు వెళ్లదు పుట్టింటికి వెళ్లి బాగా తిని వస్తుందని నర్మద అంటుంది. అలా అయితే ఎలా అక్కా అని ప్రేమ అంటే వెళ్లని దొంగని దొంగతనం చేసినప్పుడే పట్టించాలని అంటుంది. ప్లాన్ సూపర్ అని ప్రేమ అంటుంది. శ్రీవల్లి అత్త దగ్గరకు వచ్చి నేను స్కూల్‌కి వెళ్తే పనులు ఎవరు చూసుకుంటారు ఆ నర్మద, ప్రేమల్లా నేను బాధ్యత లేకుండా ఉండలేను కదా అంటే వేదవతి లాగిపెట్టి కొడుతుంది. నీకు బుద్ధి ఉందా.. అమాయకురాలా ఎడ్డిదానా అని అంటుంది. ఎందుకు అత్తయ్యా తిడుతున్నారు అంటే సాగర్ గాడికి పోటీగా చందు రైస్‌మిల్‌కి వెళ్తున్నాడు.. నర్మద కూడా  వెళ్తుంది కదా నువ్వు దానికి పోటీగా వెళ్లి దాని కొమ్ములు విరిచేయలా అలా  చేయకుండా వెళ్లను అంటావేంటే అని తిడుగుతుంది. అంతా తేడాగా ఉందని శ్రీవల్లి అనుకుంటుంది. 

వేదవతి మనసులో నా కూతురి జీవితంతో ఆడుకున్న నన్ను అంత ఈజీగా ఎలా వదిలి పెడుతున్నాను వల్లీ అని అనుకుంటుంది. ఇక చందు శ్రీవల్లిని స్కూల్‌ దగ్గరకు డ్రాప్ చేస్తా అని తీసుకెళ్తాడు. చందు డ్రాప్ చేసి వెళ్లగానే నేను మా పుట్టింటికి వెళ్లిపోతా అని అనుకుంటుంది. చందు వల్లీని డ్రాప్ చేసి నేను వస్తాను పద.. మీ ప్రిన్సిపల్‌తో మాట్లాడతా అని అంటాడు. నువ్వు ఎమ్‌ఏ ఇంగ్లీష్ కదా.. నీకు ఎలిమెంటరీలో పెట్టడం ఏంటి.. పదో తరగతిలో పెట్టమని అడుగుతా అని అంటాడు. ఖాళీ లేదు కదా బా అందుకే ఇవ్వలేదు.. తర్వాత ఇస్తారులే అని అంటుంది. సరే నువ్వు పాఠాలు చెప్పడం నేను చూస్తా అంటాడు. వల్లీ మనసులో ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తావ్ అని అనుకుంటుంది. రైస్‌మిల్లుకి లేటు అవుతుందని చందుని పంపేస్తుంది. తర్వాత శ్రీవల్లి పుట్టింటికి జారుకుంటుంది. 

భాగ్యం, ఇడ్లీబాబాయ్ ఇద్దరూ చిందులేస్తూ ఉంటారు. భాగ్యం భర్తని రైస్‌మిల్లుకి భర్తని పంపిస్తూ మరీ ఎక్కువ చేతివాటం చూపించకు నర్మద, ప్రేమ నీ మీద కన్నేశారు అని అంటుంది. ఇంతలో శ్రీవల్లి రావడంతో ఏమైందని అడుగుతారు. ప్రేమ నర్మద కలిసి ఆడుకుంటున్నారు అని మొత్తం చెప్తుంది. నా కాపురం అటూ ఇటూ అయి మా ఆయన నాకు దూరం అయితే నేను బతకలేను అని ఏడుస్తుంది. వాళ్లు వాయిస్ మెసేజ్ బయట పెట్టాలి అంటే ఎప్పుడో పెట్టేవాళ్లు ఇంకా లేదు అంటే కేవలం నీకు భయపెట్టాలి అని మాత్రమే చెప్తున్నారు అని అంటుంది. స్కూల్ టైంకి మన ఇంటికి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లిపో అని అంటుంది భాగ్యం. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget