అన్వేషించండి

Jagadhatri Serial Today March 25th: జగధాత్రి దెబ్బకు మీనన్‌ ఉక్కిరిబిక్కిరి...డ్రాగన్‌ మీనన్ భార్య అని నమ్మించడానికి ధాత్రి వేసిన ప్లాన్‌ ఏంటి..?

Jagadhatri Serial Today Episode March 25th:జగధాత్రి దెబ్బకు మీనన్‌ ఉక్కిరిబిక్కిరి...డ్రాగన్‌ మీనన్ భార్య అని నమ్మించడానికి ధాత్రి వేసిన ప్లాన్‌ ఏంటి..?

Jagadhatri Serial Today Episode: మీనన్ తన భర్త అని రుజువు చేస్తానంటూ డ్రాగన్ మీడియా వాళ్లందరినీ అతని ఇంటికి తీసుకుని వస్తుంది. సరేసరి తన ఇంటికే డ్రాగన్ రావడం చూసి మీనన్ ఆశ్చర్యపోతారు. తను నిజంగా నీ భార్య కాబట్టే నేరుగా వచ్చేసిందని అబి అనగా....నేను  ఇంటితాళం ఎక్కడ పెడతానో నాకు తప్ప నా వెంట పాతికేళ్లుగా తిరుగుతున్నవాళ్లకు కూడా తెలియదని అంటాడు. ఇంతలో డ్రాగన్ సెకన్‌లో తాళంచెవి తీసి చూపగా...మీనన్ ఆశ్చర్యపోతాడు. తాళం దొరకగానే సంబరం కాదని....ఆ ఇంటి తలుపు నేను తప్ప ఎవరూ తీయలేరని అంటాడు. అది తీయాలంటే తాతలు దిగిరావాలని అహం ప్రదర్శిస్తాడు. ఇలాంటి తలుపులు వందలు తెరిచిన అనుభవం ఉన్న డ్రాగన్‌....ఒక్క క్షణంలో మీనన్ ఇంటి తలుపులు తెరుస్తుంది.ఆమె పనితనం చూసి జేడీ కూడా మెచ్చుకుంటుంది. అయినా ఆ తలుపులు ఎలా తెరవగలిగావని అడగ్గా....ఇలాంటి పనులు నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నానని...మున్ముందు మన పనితనం మీకు తెలిసిపోతుంది కదా అని అంటుంది.అలాంటి పిచ్చిపిచ్చి పనులేమీ చేయవద్దని...తాము చెప్పిన పని చేస్తే సరిపోతుందని అంటారు. ఇంతలో కానిస్టేబుల్‌ వచ్చి ఆమెకు ఓ సూటుకేసు అందజేసి వెళ్లిపోతాడు. అందులో నీకు మీనన్‌కు  పెళ్లి అయినట్లు కావాల్సిన రుజువులన్నీ ఉన్నాయని..నువ్వు బయటకు వెళ్లి నీ నటనాకౌశలం మొత్తం చూపించాలని జేడీ  చెబుతుంది. అది చూసిన ఎవరైనా నిజంగా నువ్వు మీనన్‌ భార్యవేనని నమ్మకం కలగాలని అంటుంది

ఇంట్లోకి వెళ్లిన డ్రాగన్ బయటకు రాకపోవడంతో మీనన్ కంగారుపడుతుంటాడు. ఇప్పుడు తనే నా భార్య అని ఎలా రుజువు చేస్తుందో చూద్దామని ఎదురుచూస్తుంటాడు.  అంతే డ్రాగన్ లోపలి నుంచి సూట్‌కేసుతో సహా వచ్చి తాము ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫొటోలు, పెళ్లిచేసుకున్నప్పుడు దిగిన ఫొటోలు, కొడుకు పుట్టినప్పుడు దిగిన ఫొటోలన్నీ మీడియాకు  చూపిస్తుంది. అవన్నీ ఉత్త ఫేక్ ఫొటోలని మీనన్  కొట్టిపారేస్తాడు. నిజంగా మా ఇద్దరికీ పెళ్లి జరిగితే మ్యారేజీ సర్టిఫికేట్ ఉంటుంది కదా అని మీనన్ అంటాడు.అంతలోనే డ్రాగన్ తమ పెళ్లి సర్టిఫికేట్ తీసి చూపిస్తుంది. అంతే అది చూసి మీనన్ షాక్‌ తింటాడు. మరి ఇన్నాళ్లు మీరు ఎందుకు బయటకు రాలేదని మీడియా అడగ్గా....డ్రాగన్ కంగారుపడిపోతుంది. అప్పుడు జేడీ నేను చెప్పినట్లు మీడియాకు చెప్పమమని చెప్పగా.... మాకు శత్రువుల నుంచి ఆపద ఉంటుందని తనే మమ్మల్ని కేరళలో ఉంచాడని డ్రాగన్ చెబుతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చారని అడగ్గా......మా  ఆయన చేసిన పాపాలు మాకు అంటకుండా ప్రభుత్వం సీజ్‌ చేసిన ఆస్తులన్నీ అనాథలకు పంచాలని వచ్చామని చెప్పడంతో మీనన్ అదిరిపడతాడు. నా పాతికేళ్ల కష్టాన్ని పేదలకు పంచేస్తుందంటరా అని అంటాడు. కొంత ఆస్తి మేము తీసుకుని మిగిలినది అంతా అనాథ ఆశ్రమాలకు రాసి ఇచ్చేస్తామని చెప్పి డ్రాగన్ లోపలికి వెళ్లిపోతుంది.   

డ్రాగన్‌ను కలిసిన జేడీ,కేడీ...ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. పారిపోవాలని పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే...నీ ప్రాణాలకే ప్రమాదమని చెబుతారు. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని...మీనన్ మనుషులు అటాక్‌ చేసే అవకాశం ఉందని చెప్పి వెళ్లిపోతారు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలియక మీనన్‌కు పిచ్చెక్కిపోతుంది. నేను లేనని నా ఫొజిషన్‌లోకి రావాలనుకుంటే దందా చేస్తారు గానీ...నా ఆస్తులు అనాథలకు పంచాలని ఎందుకు ప్రయత్నిస్తారని అనుకుంటాడు. వాళ్లు ఎవరో కనిపెట్టి  ప్రాణాలు తీస్తానని అంటాడు.ఇంతలో డ్రాగన్ మీనన్ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు దోచుకుని పరారవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget