Illu Illalu Pillalu Serial Today July 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: ప్రేమ పెళ్లిళ్లు తెచ్చిన విషాదం.. వెక్కి వెక్కి ఏడ్చేసిన రామరాజు.. ఈ వల్లీ మనిషేనా!
Illu Illalu Pillalu Serial Today Episode July 30th ప్రేమ, నర్మదలకు రామరాజు క్షమించేస్తాడనే భయంతో వల్లీ మళ్లీ చొక్కా మేటర్ గుర్తు చేసి రామరాజుని ఏడిపించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ కష్టపడుతుంటే ధీరజ్ వెళ్లి మా పెద్ద వదినను నిలదీస్తా నీతో ఎందుకు ఇలాంటి పనులు చేయిస్తుందో అడుగుతా అని అంటాడు. నా కోసం అడగటానికి నువ్వు ఎవరు? అయినా నేను ఓ వస్తువునే కదా అంటుంది. దానికి ధీరజ్ నువ్వు కష్టపడుతుంటే నాకు బాధగా ఉంది అంటాడు. బాధా.. ఎందుకు బాధ.. నువ్వు నన్ను ఓ టేబుల్‌లా, వస్తువులా చూస్తున్నావ్.. వస్తువు కష్టపడితే నీకు ఎందుకు బాధ ఎమోషన్స్ మనుషుల మీద ఉంటాయి. వస్తువుల మీద కాదు. వస్తువులు ఓ మూలన పడుంటాయి వాటికోసం నువ్వు అంత బాధ పడక్కర్లేదు అని ప్రేమ అంటుంది.
ధీరజ్ ప్రేమతో శాడిజానికి చీర కట్టినట్లు ఉన్నావు.. టార్చర్ అనే దానికి అన్నప్రాశన చేసి నామకరణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది..నువ్వు అలాగే నన్ను చంపుకుతింటున్నావ్ అంటాడు. సార్ వస్తువుల్ని తీసుకొచ్చేసి ఓ మూలన పడేశాం కదా అని చిన్నచూపు ఉండకూడదు.. ఎలా పడితే అలా మాట్లాడకూడదు సార్ ఎంత వస్తువులు అయినా సరే ఎన్ని మాటలు పడతాయి ప్రేమ అంటుంది. దానికి ధీరజ్ నీకు మీ అమ్మ ప్రేమ అని కాదు కుట్టి కుట్టి రక్తం పీల్చే దోమ అని పేరు పెట్టాల్సింది అని ధీరజ్ అంటాడు.
నర్మద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సాగర్ తండ్రి చెప్పాడని నర్మదని డ్రాప్ చేయడానికి బండి తీసుకొని వస్తాడు. నర్మదని చూసి హారన్ కొడతాడు. నర్మద ఆగి ఎందుకు హారన్ కొడుతున్నారు సార్ నేను రోడ్డు మీద నడవటం లేదు సైడ్‌కి నడుస్తున్నా అంటుంది. సాగర్ కోపంగా వచ్చి బండి ఎక్కు అని అంటాడు. ఏంటి మీరు మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా.. నేను పిలిచినా పట్టించుకోని నువ్వు నా కోసం వచ్చావా అంటుంది. దానికి సాగర్ నేనేం రాలేదు మా నాన్న చెప్పాడు కాబట్టి వచ్చా అంటాడు. ఓహో మీ నాన్న చెప్పారు కాబట్టి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాను.. నీతో వాధించే ఓపిక టైం నాకు లేదు మర్యాదగా వచ్చి బండి ఎక్కు అని అంటాడు.
నర్మద కోపంగా నాతో రెండు మాటలు మాట్లాడటానికి గంటలు గంటలు నా ఆఫీస్ ముందు నిల్చొన్నావ్.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కాబట్టి నీకు నేను లోకువ అయిపోయాను. అందర్ని వదిలేసి వచ్చా కాబట్టి లోకువ అయిపోయా అని ఏడుస్తుంది. ఏంటి రోడ్డు మీద ఈ న్యూసెన్స్ అని అంటాడు. నా ప్రేమ నాకు న్యూసెన్స్‌లా ఉందా.. నువ్వు నాకు అక్కర్లేదు అన్నప్పుడు నాకు కూడా నువ్వు వద్దు ఇప్పుడే మా ఇంటికి వెళ్లిపోతా అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. రాత్రి అందరూ భోజనాలకు కూర్చొంటారు.
రామరాజు వచ్చి కూర్చొంటాడు. నర్మద మాటల్ని గుర్తు చేసుకొని మిగతా వాళ్లు ఎక్కడ అని నర్మద, ప్రేమల గురించి అడుగుతాడుజ. అందరం కలిసే భోజనం చేస్తామని తెలుసు కదా అంటాడు. అమృత వెళ్లి నర్మద, ప్రేమల్ని పిలుస్తుంది. ఇద్దరూ వస్తారు. ఏమ్మా అందరం కలిసి భోజనం చేస్తామని తెలుసు కదా మరి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ప్రేమ తనకు ఆకలి లేదు వద్దని అంటుంది. మామయ్య గారు వీళ్లతో ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారని వల్లి షాక్ అయిపోతుంది. ప్రేమతో నర్మద మామయ్య మాట్లాడుతున్నారని సంతోషపడుతుంది.
రామరాజు ఇద్దరు కోడళ్లతో మీరు ఇది మీ ఇళ్లు అనుకోకపోవచ్చు కానీ నాకు మాత్రం మీరంతా పిల్లలే మీరు తినకపోతే నాకు తిండి సహించదు అంటారు. దాంతో ప్రేమ, నర్మదలు కూర్చొంటారు. అందరూ సంతోషంగా తిందామనే టైంకి ఏదో ఒకటి చేయాలి అందరూ కలిసిపోయేలా ఉన్నారని వల్లి ఏడుపు మొదలు పెడుతుంది. మీకు అవమానం జరిగింది మామయ్యగారు చొక్కా చింపేశారు మర్చిపోయారా నాకు మాత్రం తిండి సహించడం లేదని నాటకం మొదలు పెడుతుంది. దాంతో రామరాజు ముద్ద నోట్లో పెట్టకముందే బాధతో ఆగిపోతాడు. బాధతో లేచి బయటకు వెళ్లిపోతాడు.
వేదవతి భర్త దగ్గరకు వెళ్లి ఏవండీ ఎన్ని సమస్యలు ఉన్నా భోజనం దగ్గర నుంచి లేవకూడదు అంటారు మీరే ఇలా లేచేశారేంటి అండీ అని అడుగుతుంది. ముద్ద నోట్లోకి వెళ్లడం లేదు బుజ్జమ్మా అని రామరాజు కన్నీరు పెట్టుకుంటాడు. ముద్ద నోట్లో పెడుతుంటే కోడలి సంపాదనతో తింటున్నాను అన్నదే గుర్తొస్తుంది ముద్ద సహించడం లేదు బుజ్జమ్మా అని అంటారు. ఇంతకు ముందు చాలా అనే వారు కానీ నిన్ను పెళ్లి చేసుకున్నా కాబట్టి కోపంతో అంటున్నారని భరించాను సహించాను కానీ ఇప్పుడు ఈ మాటలు నా వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నాయి. నేను ఏమీ లేని ఎవరూ లేని అనాథగా ఈ ఊరు వచ్చినప్పుడు పనివ్వండి కష్టపడతాను అని అడిగాను కానీ ఎవరికీ ఒక్క ముద్ద అన్నం అడగలేదు.. ఇప్పటికీ నా కష్టం మీదే బతుకుతున్నాను అలాంటి నేను ఇంటి కోడలిని కష్టపడనిస్తానా తన కష్టంతో కడుపు నింపుకుంటానా అని చిన్న పిల్లాడిలా రామరాజు ఏడ్చేస్తారు. అతన్ని చూసి అందరూ ఏడుస్తారు.
ప్రేమ వల్లే ఇదంతా అని ధీరజ్, వేదవతి ప్రేమని కోపంగా చూస్తారు. రేపు ఊరిలో వాళ్లు కూడా కోడలి సంపాదనతో బతుకుతున్నావని అంటే నేను ఎంత కష్టపడి పాతికేళ్లుగా పెంచుకున్న పేరు పోయినట్లే కదా.. నేను తలెత్తుకొని బతకగలనా.. నా వాళ్లే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. తట్టుకోలేకపోతున్నా.. నా నడిపి, చిన్న కొడుకులు నా మాట తప్పి పెళ్లి చేసుకున్నారు కానీ నేను ఆ కోపం కొడుకుల మీద చూపించా కానీ కోడళ్ల మీద కాదు వాళ్లని నా కన్నబిడ్డల్లా చూసుకున్నా కానీ వాళ్ల వల్లే నాకు ఇలా జరిగింది అని ఏడుస్తూ వెళ్లిపోతాడు. మన్నించయ్యా.. మన్నించయ్యా అని బ్యాగ్రౌండ్ పాతతో సీన్‌లో ఓ రేంజ్ ఎమోషన్స్ ఉంటాయి. వల్లి ఇంకొంచెం అగ్గి పెట్టడానికి మామయ్యగారిని ఇంతలా బాధ పెట్టడానికేనా మీరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారని అంటుంది. నర్మద, ప్రేమ ఏడుస్తూ ఉంటే చిందులేస్తుంది.
సాగర్, ధీరజ్‌లు ఓ చోటుకి వెళ్లి నర్మదది తప్పు ప్రేమది తప్పు అని అన్ని ప్రాబ్లమ్స్‌కి వాళ్లిద్దరిదే తప్పు అని అనుకుంటారు. సాగర్ ఇద్దరినీ తిడుతుంటే చందు వచ్చి ఇద్దరి మీద తిడతాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న మీరు వాళ్ల మీద తోసేసి వాళ్లని నిందలేసి తప్పించుకుంటారేంట్రా.. ఎంత సేపు మీరు మీ వైపు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ల వైపు నుంచి ఆలోచించారా అని ఇద్దరినీ తిడతాడు. నీ మీద ప్రేమతో నువ్వు కష్టపడటం చూడలేక జాబ్ చేయాలి అనుకుంది అందరికీ అదే విషయం చెప్పింది అని చందు అంటాడు. ప్రేమది చదువుకునే వయసురా ఆ వయసులో ఎవరైనా ఆడుతూ పాడుతూ చదువుకుంటారు కానీ ప్రేమ మాత్రం నీ కోసం కష్టపడాలని అనుకుంది. ఎంత ప్రేమ లేకపోతే అలా నీకోసం చేస్తుంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















