అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యాన్ని వాయించేసిన వేదవతి! వల్లీకి రెండో అవకాశం! ఇప్పటికైనా మారుతుందా!

Illu Illalu Pillalu Serial Today Episode April 25th వల్లీకి మళ్లీ భాగ్యం కుట్రలు చేయమని చెప్పడం నర్మద, ప్రేమ మరోసారి కోటింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు కోడలు ప్రెగ్నెంట్ అయిందని సంతోషంతో దేవుడికి దండం పెట్టుకొని తన ఇల్లు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండేలా చూడమని.. వల్లీ పండంటి బిడ్డకి జన్మనిచ్చేలా.. ఆరోగ్యంగా ఉండేలా చూడమని వేడుకుంటాడు. ఇంతలో చందు తండ్రిని చూసి నాన్న ఇంకా వల్లీ మీద ఆశలు పెట్టుకున్నాడు.. వల్లీ నిజస్వరూపం నాన్నకి చెప్పాలి.. అప్పుడు వల్లీ ఇంట్లో ఉండాలో లేదో నాన్నే నిర్ణయిస్తాడు అని నాన్న అని అంటాడు. ఇంతలో వేదవతి వచ్చి చందు చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. 

అమ్మ నాన్నకి వల్లీ గురించి ముఖ్యమైన విషయం చెప్పాలి వదులు అని చందు అంటే ఏం చెప్తావ్‌రా అని అంటాడు. తన గురించి మీకు తెలీదమ్మా.. తనని అందరూ అమాయకురాలు అనుకుంటున్నారు.. కానీ అమూల్య విషయంలో తను ఏం చేసిందో మీకు తెలీదు అని అంటాడు. నాకు తెలుసు అని వేదవతి చందుకి షాక్ ఇస్తుంది. అమ్మా అని చందు అంటే అమూల్య విషయంలో వల్లీ ఏం చేసిందో అంతా నాకు తెలుసురా.. అన్నీ నాకు తెలుసు.. అని అంటుంది. నీ భార్య గురించి నీకు తెలియగానే వాళ్ల అమ్మకి బాలేదు.. అని పుట్టింటిలో వదిలేసి వచ్చావ్ మరి ఎందుకు అప్పుడు నిజం చెప్పలేదు అని వేదవతి అడుగుతుంది. నాన్న ఏరి కోరి తీసుకొచ్చిన సంబంధం.. ఇంటి పెద్ద కోడలు బంగారం అనుకుంటున్నారు.. మరి అలాంటిది అది ఇంటి ఆడబిడ్డ జీవితం నాశనం చేసింది అంటే నాన్న తట్టుకోగలడా అని చందు అంటాడు. మరి ఇప్పుడు చెప్తే తట్టుకోగలరా అని వేదవతి అంటుంది. ప్రస్తుతం నువ్వు ఆలోచించాల్సింది.. మీ నాన్నకి వల్లీ గురించి నిజం చెప్పడం గురించి కాదు.. వల్లీ కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి ఆలోచించాలి అని అంటుంది. 

Also Read: ఐశ్వర్య ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది...? ఐష్‌కు శ్రీలక్ష్మీ ఇచ్చిన హామీ ఏంటి..?

ఇంతలో ధీరజ్ వచ్చి అవునురా పెద్దోడా.. జరిగింది చెప్పి నాన్నని బాధ పెట్టడం కంటే వదిన ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా నీ కాపురం నిలబెట్టుకోవడం మంచిది అంటాడు. వేదవతి చిన్నోడితో నీకు ఇవన్నీ ఎలా తెలుసురా అంటే ఎప్పుడో తెలుసమ్మా అంటాడు. నర్మద, ప్రేమలు వచ్చి మాకు కూడా తెలుసు అంటారు. దానికి వేదవతి శ్రీరామ శ్రీరామ.. మీకు తెలిసి కూడా నాకు చెప్పలేదా.. అవునే మామూలుగా వల్లీ మిమల్ని చాలా కష్టపెట్టింది కదా మరి ఎందుకే మీరు మామయ్యకి చెప్పలేదు అంటే మీరునా మామయ్య గురించి ఆలోచించేది మేం ఆలోచించమా అని నర్మద అంటుంది. మీరు నిజంగా చాలా మంచోళ్లే అని వేదవతి అంటుంది. చందు తల్లితో అయినా వల్లీ చేసిన తప్పులకు అంత ఈజీగా ఇంటికి తీసుకురావడం నాకు నచ్చలేదమ్మా అని అంటాడు. బుద్ధి చెప్పకుండా భయపెట్టకుండా అంత తేలికగా ఎలా తీసుకొస్తానురా అని వేదవతి చెప్పి జరిగింది చెప్తుంది. 

Also Read: తన ఫ్రెండ్‌ ముందు జగధాత్రిని నిషిక ఏమని అవమానించింది..? నిషిక చెంప కౌషికి పగులగొట్టడానికి కారణమేంటి..?

వల్లీ ప్రెగ్నెంగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లి గర్భవతి అయినా అత్తారింటికి వెళ్లే అదృష్టం నాకు లేదు.. నేను కడుపుతో ఉన్నా నన్ను ఇంటికి తీసుకెళ్లలేదు అంటే నా మొగుడు నన్ను ఏలుకోడు అని భయంగా ఉందని అంటుంది. అంత భయం ఉన్న దానివి అలా ఎందుకు చేశావ్ అని వేదవతి అడుగుతుంది. వేదవతిని చూసి వల్లీ, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ షాక్ అయిపోతారు. భాగ్యాన్ని లాగి పెట్టి కొట్టి నువ్వు అసలు తల్లివేనా.. ఏ తల్లి అయినా కూతురి కాపురం నిలబెట్టాలి అని చూస్తుంది. నువ్వు కూతురి కాపురం కూలిపోయేలా సలహాలు ఇస్తావా.. అత్తారిల్లు నాశనం అయిపోవాలని.. ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం చేయాలి అని సలహాలు ఇస్తావా.. అని తిడుతుంది. అత్తయ్యా అది అని వల్లీ ఏయ్ కడుపుతో ఉన్న ఆడపిల్ల కంట తడి పెట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో ఆగిపోయా లేదంటే నీ అంతు చూసేదాన్ని.. నువ్వు ఒక ఆడపిల్లవే కదే.. తోటి ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని ఎలా అనిపించిందే.. అని అంటుంది. దయచేసి నా కాపురం నిలబెట్టండి అత్తయ్యా అని శ్రీవల్లి దండం పెడుతుంది. నువ్వు నీ తప్పులు తెలుసుకొని బుద్ధిగా కాపురం చేసుకుంటావని రెండో అవకాశం ఇస్తున్నా.. అలా కాదు అని మీ అమ్మ మాటలు విని కొంపలు కూల్చావంటే నేనే నిన్ను మెడ పట్టుకొని గెంటేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. భాగ్యంతో మీరు పదే పదే మీ అమ్మాయితో ఫోన్లో మాట్లాడినా.. అదే పనిగా మా ఇంటికి వచ్చినా అస్సలు ఊరుకోను అని అంటుంది. 

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సీమంతంలో విహారి! సహస్ర ప్రెగ్నెంట్ కాదని యమునకు తెలిసిపోయిందా!

వేదవతి జరిగింది అంతా చందుకి చెప్పి అన్నీ మర్చిపోరా.. నువ్వు తండ్రివి కాబోతున్నావ్ నువ్వు సంతోషంగా ఉంటే మన కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని అంటుంది. వల్లీ, భాగ్యం, ఇడ్లీబాబాయ్ ముగ్గురు గదిలోకి వెళ్లి చిందులు వేస్తారు. భాగ్యం కూతురితో నా చావు తెలివి తేటలు అన్నీ వాడి నిన్ను ఇంట్లో అడుగు పెట్టేలా చేశాను అంటే నా కడుపులో బిడ్డ కదా నేను అత్తారింట్లో అడుగు పెట్టేలా చేసింది నువ్వు అంటావేంటి అని అంటుంది. ఇక నుంచి నువ్వు అత్తారింట్లో ఎలా ఉండాలి అంటే నాకు తెలుసు.. బుద్ధిగా చక్కగా ఉండాలి.. నా తోటి కోడళ్లతో చక్కగా ఉండాలి.. ఎవరి విషయాల్లో తలదూర్చకూడదు అని అంటుంది. కానీ భాగ్యం వల్లీతో మంచి ముసుగులో కుట్రలు చేయాలే.. లేదంటే నీ తోడి కోడళ్లు తొక్కేస్తారు అని మళ్లీ చెప్తే నర్మద, ప్రేమ వచ్చి అక్క దౌర్భాగ్యం పిన్నికి అత్తయ్యగారు ముచ్చటగా చెంపల మీద  మూడు ఇచ్చారు.. ఇంకా బుద్ధి రాలేదు అంటే డోస్ సరిపోలేదు అంట అందుకని మనం కూడా నాలుగు తగిలించేద్దామా అంటే.. దానికి నర్మద దౌర్భాగ్యం పిన్నిది కుక్క తోక వంక బుద్ధి 32 పళ్లు ఊడిపోతే సెట్ అయిపోతుందని అంటుంది. ఏంటి నన్ను కొడతారా కొట్టండి అని అంటుంది. అందరూ గొడవ పడుతుంటే వల్లీ ఆపుతుంది. మా అమ్మ బుద్ధి లేకుండా వాగుతుంది వదిలేయండి అని బతిమాలుతుంది. 

ధీరజ్ వల్లీతో నువ్వు మా నాన్న దృష్టిలో దేవత లాంటి కోడలివి నీకు అమ్మ తర్వాత అమ్మ స్థానం ఇచ్చి చూసుకున్నాం.. ఆ విలువ గౌరవం కాపాడుకుంటే నీకే మంచిది.. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు కడుపుతో ఉన్నావ్.. ఇంట్లో ఉన్న వాళ్లు నీ మీద చూపిస్తున్న పొగొట్టుకుంటే ఇంకెప్పుడూ జీవితంలో ఈ ప్రేమ పొందలేవు అని అంటాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను అని వల్లీ అంటుంది. ధీరజ్ ప్రేమని గుడికి తీసుకొస్తాడు. నాకు ఒక మొక్కు ఉందిరా అది తీర్చకపోతే దేవుడికి కోపం వస్తుందని ప్రేమ అంటుంది. ఏం మొక్కుకున్నావ్ అని ధీరజ్ అడిగితే ప్రేమ సిగ్గు పడుతుంది. మన మధ్య అపార్థాలు అన్నీ తొలగిపోతే 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నానని మనం ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలిరా అందుకే ప్రదక్షిణలు చేద్దాం పద అంటుంది. కాలి నొప్పితో ప్రదక్షిణలు చేస్తావా.. వద్దు అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమని ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget