అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని చూసి ఎమోషనల్ అయి ఇంటికి వచ్చేయమన్న భద్రావతి! నా పెళ్లానికి నేను సేవలు చేసుకుంటానన్న ధీరజ్!

Illu Illalu Pillalu Serial Today Episode April 10th ప్రేమని పుట్టింటికి వచ్చేయ్మని భద్రావతి వాళ్లు పిలవడం పంపించను అని ధీరజ్ మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode సేనాపతి ప్రేమ దగ్గరకు వెళ్లి నన్ను క్షమించమ్మా అని అంటాడు. వాడు ఎవడో యాక్సిడెంట్ చేస్తే మీరు ఎందుకు నాన్న క్షమాపణ చెప్తున్నారు అని ప్రేమ అడిగితే నిన్ను నేను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను కదమ్మా అందుకు అని సేనాపతి అంటాడు. ప్రేమ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలీకా ఇప్పటి వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం.. రామ్మా మన ఇంటికి అని భద్రావతి అంటుంది. భద్రావతి తల్లి కూడా రామ్మా.. నిన్ను అత్తారింట్లో చూసుకోవడానికి ప్రస్తుతం వేదవతి కూడా లేదు.. నువ్వు అక్కడ ఉండటం కంటే మన ఇంట్లో ఉండటమే మంచిది అని అంటుంది. అందరూ ప్రేమని వచ్చేయమని పిలుస్తారు.. 

 
భద్రావతి ప్రేమతో నీ మీద మాకు ఉన్న ప్రేమ ఈ లోకంలో ఎవరికీ ఉండదు ప్రేమ ఆ విషయం నీకు తెలుసు కదా రామ్మా అని పిలుస్తుంది. చెప్తే అర్థం కావడం లేదా.. మా మాట వినకపోవడం వల్ల ఈ పరిస్థితికి తెచ్చుకున్నావ్.. ఇలాంటి టైంలో నువ్వు ఆ ఇంట్లో దిక్కు లేనిదానిలా అలా పడుంటావా.. నిన్ను చూసుకోవడానికి ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు చెప్పు అని భద్రావతి అడుగుతుంది. నేను ఉన్నాను అని ధీరజ్ అంటాడు. నా పెళ్లాన్ని చూసుకోవడానికి నేను ఉన్నాను.. నా పెళ్లాన్ని మీ కంటే ప్రేమగా ఎవరూ చూసుకోలేరా.. మీరు అంతా అందుకోలేని ఆకాశం అంత ప్రేమని నా పెళ్లాం మీద చూపించడానికి నేను ఉన్నాను.. తనకి అది పుట్టిళ్లు అయినా సరే.. తనని ప్రేమగా చూసుకునే విషయంలో మీరు ఎవరూ నా దరిదాపులో ఉండలేరు అర్థమైందా నా పెళ్లాం పొగరు బోతు మేనత్త అని అంటాడు. ఏంట్రా ఆ భాష అని భద్రావతి అంటే ఎవరికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అలాగే చెప్పాలి.. ఇంకోసారి ఇలాంటి వంకలు పెట్టుకొని నా పెళ్లాన్ని మీ ఇంటికి తీసుకెళ్లాలని  చూస్తే కత్తిరించేస్తాను.. మీ నక్కతోకలు.. మై డియర్ పెళ్లామ్స్ పద.. అని భుజం మీద చేయి వేస్తాడు. 
 
రామరాజు భద్రావతి వాళ్లతో చూడండి తను మా ఇంటి కోడలు.. బాగున్నప్పుడు మా దగ్గర పెట్టుకొని బాలేనప్పుడు మీ ఇంటికి పంపే అంత దుర్మార్గులం కాదు.. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మా కోడలు మాతోనే ఉంటుంది మేం చూసుకుంటాం అని రామరాజు చెప్పి అందర్ని ఇంట్లోకి తీసుకెళ్తాడు. మరోవైపు భాగ్యం క్యారేజ్ సర్దుతూ మనం దరిద్రంలోకి జారిపోకూడదు అంటే ప్రేమకి జరిగిన ఈ యాక్సిడెంట్‌ని నువ్వు వాడుకోవాలి.. ప్రేమకి యాక్సిడెంట్ అయింది అని తెలియగానే.. నా చెల్లిని ఎప్పుడెప్పుడు చూడాలా.. అని గుండె పగిలిపోయింది.. ఇక నుంచి ఇక్కడే ఉండి నా చెల్లికి సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉంటానని చెప్పి కాకా పట్టేయ్ అని భాగ్యం కూతురికి చెప్తుంది. మీరు వస్తేనే నేను వస్తా అని భాగ్యం అంటే ఇప్పుడు మేం రాకూడదు.. నువ్వే సోలో పెర్ఫామెన్స్ చేయాలి.. ఈ ఇళ్లు నువ్వు లేకపోతే లేదు అని పెద్ద కోడలు లేకపోతే ఆ ఇల్లు ఉండదు అని నువ్వు నటించేయాలి.. అప్పుడే మీ ఆయనే కాదు.. ప్రేమ, నర్మదలు కూడా నిన్ను ఏం చేయలేరు అని అంటుంది. సర్లే అని క్యారేజ్ అడుగుతుంది.
 
భాగ్యం క్యారేజ్ ఇవ్వడంతో వల్లీ పట్టుకొని వెళ్తుంది. రాత్రి భద్రావతి ప్రేమ ఎలా ఉందో ఏంటో అని బయట తిరుగుతూ ఏడుస్తూ ఉంటుంది. సేనాపతి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ అక్కా అని అంటే ప్రేమని మనం ఎంత ప్రేమగా పెంచాంరా.. కానీ దానికి మన ప్రేమ అర్థం కావడం లేదు కదరా.. అని అంటుంది. దానికి అన్నీ దాని చిన్న అత్త పోలికలే వచ్చాయి. ఎవరైనా కాస్త ప్రేమ చూపిస్తే చాలు అటు వైపు వెళ్లిపోతుందని వదిలేయ్ అని అంటాడు. అలా ఎలా వదిలేస్తామ్రా.. వదులుకోలేకే కదా ఈ బాధ.. వేదవతిని వదులుకున్నాం ప్రేమని వదులుకోలేం కదా.. అవునురా ఆ లారీ ఎవరిది ఆ డ్రైవర్ ఎవరో కనుకున్నావా.. వాడు గుద్దేసింది ఈ భద్రావతి మేనకోడల్ని.. వాడు పరారీలో ఉన్నా.. పాతాళంలో ఉన్నా వదిలేదు లేదు కనుక్కో అని అంటుంది. సేనాపతి కంగారు పడుతూ సరే అంటాడు.
 
ప్రేమ కాలు నొప్పితో ఇబ్బంది పడుతూ మందులు వేసుకోవడం చూసిన ధీరజ్ పొద్దున్నుంచి ఒకటే డ్రస్‌లో ఉందని బీరువాలో డ్రస్ తీసి రా డ్రస్ మార్చుతా అంటాడు. ఓరేయ్ చచ్చినోడా ఏంట్రా వాగుతున్నావ్ అని ప్రేమ అంటే.. నీకు సాయం చేస్తానని అంటే తిడతావ్ అంటాడు. డ్రస్ మార్చడం సాయం ఏంట్రా నా కాలికి దెబ్బ తినడం అవకాశం తీసుకొని మనసులో ఆలోచనలు అన్నీ బయటకు తీస్తున్నావ్‌లే అని ప్రేమ అంటే ధీరజ్ నెత్తి బాదుకొని నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు ఉండవు కూడా అంటాడు. నా మనసులో వేరే ఉద్దేశం ఏం లేదు రా.. అని ధీరజ్ అంటే సరే పద అని ప్రేమ అంటుంది. ధీరజ్ ప్రేమకి డ్రస్ మార్చుకోవడానికి సాయం చేసి భోజనానికి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొపెడతాడు. నర్మద ప్రేమని చూసి వచ్చేశావా ప్రేమ నేను నీ కోసం ఫుడ్ తీసుకొని రూంకి వస్తున్నా అని ఫుడ్ తినిపించడానికి కలిపితే అక్కా మా ఆయన పరువు తీసేస్తావా.. మా ఆయన నా పుట్టింటివాళ్లతో ఏం ఛాలెంజ్ చేశాడో గుర్తు చేసుకో అన్నీ నాకు మా ఆయనే చేస్తాడు అంటుంది. అవును కదా అని నర్మద కూడా ప్రేమ, ధీరజ్‌ని ఒకటి చేయాలి అని సైడ్ అయిపోతుంది. ధీరజ్ తినిపించను అంటే బట్టలు మార్చుతా అన్నావ్ కానీ తినిపించవా అని ప్రేమ అంటే ధీరజ్ నెత్తి బాదుకుంటాడు. ఏంటమ్మా ధీరజ్ నీకు బట్టలు మార్చుతా అన్నాడా అని నర్మద నోరెళ్లబెడుతుంది. వదినా వదినా అని ధీరజ్ అంటాడు. ఇవ్వు వదినా నేనే తినిపిస్తా అని ధీరజ్ ప్లేట్ తీసుకొని తినిపిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget