అన్వేషించండి

Guppedantha Manasu February 28th Episode: మను మామూలోడు కాదు..కానీ వసుకే అర్థం కావడం లేదు - శైలేంద్రకి మరో షాక్!

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu February 28th Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 28 ఎపిసోడ్)

రిషిని తలుచుకుని ఫణీంద్ర బాధపడడం చూసి తట్టుకోలేకపోయిన ధరణి.. శైలేంద్ర‌, దేవ‌యాని కుట్ర‌ల‌ు బయటపెట్టాలి అనుకుంటుంది. కానీ ఇంతలో దేవయాని అడ్డుకుని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నేను బ‌తికి ఉండ‌గానే నా క‌ళ్ల ముందే నా బిడ్డ‌కు క‌ర్మ‌కాండ‌లు చేయాల్సివ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది..ఇదంతా చూస్తుంటే నా గుండెలు ప‌గిలిపోతున్నాయ‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది. రిషి చ‌నిపోయిన త‌ర్వాత నిద్ర కూడా స‌రిగా రావ‌డం లేద‌ని, ఎవ‌రు పిలిచినా త‌న‌కు రిషి గొంతులాగే అనిపిస్తుంది అంటుంది. దేవయాని డ్రామా చూసి శైలేంద్ర... నువ్వు మ‌హాన‌టివి అంటూ మ‌న‌సులోనే పొగిడేస్తాడు. త‌ల్లిని ఓదార్చుతున్న‌ట్లుగా నటిస్తూ మరింత ఓవరాక్షన్ చేస్తాడు శైలేంద్ర. ఇదంతా నిజమైన ప్రేమే అనుకుంటాడు ఫణీంద్ర. 

Also Read: టామ్ & జెర్రీ లా వసు , మను - రిషి కర్మకాండలు జరగకుండా మను అడ్డుకోగలడా!

మహేంద్ర ఆవేదన
త‌న చేతుల మీదుగా రిషికి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించాల్సిరావ‌డం మ‌హేంద్ర త‌ట్టుకోలేక‌పోతాడు. వ‌సుధార కోస‌మే త‌న బాధ‌ను, దుఃఖాన్ని దిగ‌మింగుకున్నాన‌ని, కానీ ఆమెకు ఇప్పుడు అబ‌ద్ధం చెప్పాల్సివ‌స్తుంద‌ని త‌ల్ల‌డిల్లిపోతాడు. నీకు క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిస్తున్నామ‌నే విష‌యం తెలిసి వ‌సుధార ఎలా రియాక్ట్ అవుతుందోన‌ని భ‌య‌ప‌డుతున్నాన‌ని రిషి ఫొటో చూస్తూ మాట్లాడుకుంటాడు మ‌హేంద్ర‌. నేను కార్మ‌కాండ‌లు చేయ‌క‌పోతే పెద‌నాన్న ఫ‌ణీంద్ర నీకు తండ్రి స్థానంలో ఉండి క‌ర్మ‌కాండ‌లు చేస్తాన‌ని అంటున్నారని న‌న్ను ఎందుకు ఇర‌కాటంలో పెట్టి వెళ్లిపోయావ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

ధరణి-శైలేంద్ర
దేవయాని ఇచ్చిన వార్నింగ్, వసుధారకి చేస్తున్న అన్యాయం తలుచుకుని కుమిలిపోతుంది ధరణి. అప్పుడే లోపలకు వచ్చిన శైలేంద్ర సారీ ధరణి అంటాడు. తన చేయి పట్టుకున్న శైలేంద్రపై ఫైర్ అవుతుంది ధరణి. వసుధారకి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అడుగుతుంది. నాపై చూపించేది ప్రేమ కాదు..అది నాటకం అని నాకు తెలుసు
శైలేంద్ర: లేదు ధరణి నువ్వంటే నాకు చాలా ఇష్ట‌ం నువ్వు కొట్టినా, తిట్టినా భ‌రిస్తాను కానీ ఎండీ సీట్ విష‌యంలో మాత్రం నాకు అడ్డు రావద్దు. దేవుడు చెప్పినా నా నిర్ణయం మార్చుకోను.  నాకు ఎండీ సీట్‌పై మాత్ర‌మే ఆశ ఉంది కానీ వ‌సుధార‌పై కోపం లేదు. ఎండీ సీట్‌ను నాకు వాళ్లు మొద‌టే అప్ప‌గిస్తే ఈ క‌క్ష‌లు, కుట్ర‌లు ఉండేవి కావ‌ు. డీబీఎస్టీ కాలేజీ నా సొంతం అవడం..వాళ్లు నా కలలు కూల్చేస్తున్నారు నేను బ్రతికి ఉండగానే ప్రాణం తీసేస్తున్నారు
ధరణి: ఎందుకంత అత్యాశ..దానికోసం హత్యలు చేయాలా..ప్రాణాలు తీసి సాధించుకోవడం మనిషి లక్షణం..అలాంటి బ్రతుకు బ్రతుకే కాదు
శైలేంద్ర: అయినా పర్వాలేదు నేను హ్యాపీగా బతుకుతాను..ఎండీ సీట్ కోసం ఘోరాలు, నేరాలు చేసినా   పాపం అనే ఫీలింగ్ క‌ల‌గ‌ద‌ు
ధరణి: మిమ్మ‌ల్ని చూస్తేనే అస‌హ్యం వేస్తోంది
శైలేంద్ర‌: ఇదంతా ఒక్క‌రోజే...రేపు రిషి క‌ర్మ‌కాండ‌లు ఎలాంటి అడ్డంకులు లేకుండా జ‌రిపిస్తే త‌న ప‌ని పూర్త‌వుతుంద‌ని, ఆ త‌ర్వాతే నీ ఫోన్‌ను నీకు ఇచ్చేస్తాన‌ు

Also Read: ఈ రోజు ఈ రాశులవారికి రొమాంటిక్ డే, ఫిబ్రవరి 28 రాశిఫలాలు

వ‌సుధార -అనుపమ 
మ‌హేంద్ర ఇంట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో వ‌సుధార కంగారు ప‌డుతుంది. వ‌సుధార‌తో పాటు అనుప‌మ కూడా మ‌హేంద్ర‌కు ఫోన్ చేస్తుంది. కానీ  ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో వ‌సుధార టెన్ష‌న్ మ‌రింత పెరుగుతుంది. త‌న‌కు తెలియ‌కుండా ఏదో జ‌రుగుతుంద‌ని వ‌సుధార అనుమాన ప‌డుతుంది.

రిషికి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిస్తుంటాడు మ‌హేంద్ర‌. ఈ కార్య‌క్ర‌మాన్ని వ‌సుధార ఆపితే బాగుండున‌ని ధ‌ర‌ణి కోరుకుంటుంది. వ‌సుధార‌కు చెప్ప‌కుండా క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించి తాను త‌ప్పు చేస్తున్నాన‌ని మ‌హేంద్ర అనుకుంటాడు. ఈ కార్య‌క్ర‌మాల‌ను త‌ర్వాత చేద్దామ‌ని అన్న‌య్య‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఈ నిజం తెలిస్తే వ‌సుధార త‌ట్టుకోలేద‌ని అంటాడు. అయినా ఫ‌ణీంద్ర ప‌ట్టువీడ‌డు. రిషి ఆత్మ‌కు శాంతి జ‌ర‌గాలంటే క‌ర్మ‌కాండ‌లు జ‌ర‌గాల్సిందేన‌ని అంటాడు. త‌న కొడుకు ప్లాన్ స‌క్సెస్‌ఫుల్‌గా అమ‌లు అవుతోండ‌టంతో లోలోన దేవ‌యాని ఆనంద‌ప‌డుతుంది.

వ‌సుధార కాలేజీకి బ‌య‌లుదేరుతుంది. అంతలో ఆమె దగ్గరకు వచ్చిన మను... ఓ అర్జెంట్ ప‌ని ఉంది నాతో పాటూ రండి అని అడుగుతాడు.  యాభై కోట్లు ఇచ్చార‌ని మిమ్మ‌ల్ని న‌మ్మి ఎక్క‌డికి చెబితే అక్క‌డికి రావాలా  అని ఫైర్ అవుతుంది.
వసుధార:  డ‌బ్బులు ఇచ్చే ముందు ప‌ద‌వులుపై వ్యామోహం లేద‌ని చెప్పి ఆ త‌ర్వాత‌ డైరెక్ట‌ర్ అయ్యారు.. మెల్లమెల్లగా కాలేజీని మీ చేతుల్లోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు
మను: నిజంగానే కాలేజీని నా చేతుల్లోకి తీసుకోవాలంటే ఇప్ప‌టివ‌ర‌కు ఆగేవాడిని కాద‌ు ఆ ప‌ని ఎ ప్పుడో చేసేవాడిని. కాలేజీని హ్యండోవ‌ర్ చేసుకోవ‌డం నాకు ఈజీ 
మను: అవ‌న్నీ ఇప్పుడు డిస్క‌స్ చేయ‌డం అన‌వ‌స‌ర‌ం అర్జెంట్‌గా నాతో పాటు రండి
వసుధార:  సాయం చేసిన వాళ్లు గాయం చేయ‌ర‌ని గ్యారెంటీ ఏంటి . మీరు అక్కడ ఏమైనా ప్లాన్ చేశారేమో..మీరు కూడా ఎండీ పదవి కోసం ఆశపడి ఏమైనా కుట్రలు చేస్తారేమో
మను: నా కోసం కాదు మీ కోసం...మీ రిషి కోసం రమ్మంటున్నాను
రిషి సర్ పేరు చెప్పి నన్ను కన్వ్విన్స్ చేయాలి అనుకుంటున్నారా అని అడిగితే...అప్పుడే మనుకి వీడియో కాల్ వస్తుంది.... రిషికి మహేంద్ర కర్మకాండలు జరిపిస్తున్న వీడియో చూపిస్తాడు...అది చూసి వసుధార షాక్ అవుతుంది...

Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!

క‌ర్మ‌కాండ‌లు జ‌రుపుతుండ‌గా...రిషి ఫొటో ప‌క్క‌న త‌న ఫొటో తెచ్చిపెడుతుంది వ‌సుధార‌. అది చూసి మ‌హేంద్ర‌, ఫ‌ణీంద్ర‌తో పాటు అక్క‌డ ఉన్న వారంతా షాక‌వుతారు. మీరు త‌ప్పు చేశార‌ని మ‌హేంద్ర‌తో అంటుంది వ‌సుధార‌. వ‌సుధార‌కు స‌మాధానం చెప్ప‌లేక మ‌హేంద్ర మౌనంగా ఉండిపోతాడు.  త‌న ప్లాన్ ఫెయిల‌వ్వ‌డం దేవ‌యాని త‌ట్టుకోలేతుంది. ఆచారాల ప్ర‌కారం చేయాల్సిన కార్య‌క్ర‌మాలు చేస్తుంటే ఏదో ఘోరాలు చేస్తున్న‌ట్లు మాట్లాడుతున్నావ‌ని వ‌సుధార‌పై ఫైర్ అవుతుంది. నీకు ఒక్క‌దానికే బాధ ఉన్న‌ట్లు మాట్లాడుతున్నావ‌ని వ‌సుధార‌పై కోప్ప‌డుతుంది. మీ మాట‌ల‌ను ఆపేయ‌మ‌ని దేవ‌యానిని హెచ్చ‌రిస్తుంది వ‌సుధార‌. 
గుప్పెడంత మనసు ఈ రోజు  ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget