అన్వేషించండి

Guppedantha Manasu మే 4 ఎపిసోడ్: పనేం లేదా? ఫోన్లు చేసి ఎందుకు విసిగిస్తావ్‌? రిషిపై మండిపడ్డ వసుధార- దేవయాని ప్లాన్ వర్కౌట్‌ అయినట్టేనా!

వసుధార ఇంటికి వచ్చి భోజనం చేసిన రిషి బాగుందని చెప్పి వెళ్లిపోతాడు. తెల్లారేసరికి మళ్లీ ఫోన్ చేస్తాడు. ఈసారి వసుధార గట్టిగానే క్లాస్ పీకుతుంది. మాటిమాటికి ఫోన్‌లేంటని చిర్రుబుర్రులాడుతుంది.

గౌతమ్, రిషి మధ్య వసుధార కోసం డిస్కషన్ వాగ్వాదం జరుగుతుంది. సాక్షి గురించి అడిగితే చాలా రిషికి ఎక్కడలేని కోపం వస్తుంది. సాక్షి టాపిక్ తీసుకొస్తే మొహం షేప్‌లు మారిపోతాయని గౌతమ్‌ను బెదిరిస్తాడు. రిషి వెళ్లిపోతాడు. 

రిషి రూమ్‌కి దేవయాని వస్తుంది. అవసరం లేని విషయాలు ఆలోచిస్తూ ప్రశాంతతకు దూరంగా ఉన్నావని ఓదార్చినట్టు ట్రై చేస్తుంది. దేవుడు నీకు సాక్షికి ముడి పెట్టాడేమో అంటుంది దేవయాని, వెంటనే రిషి లేచి ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదని చెప్పేస్తాడు. తనకు బయటకు వెళ్లే పని ఉందని తప్పించుకుంటాడు. ఒకసారి కాదనుకున్నాక దాని కోసం ఆలోచించనని తెగేసి చెప్పేస్తాడు రిషి. 

బయటకు వెళ్తుంటే సాక్షి వచ్చి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామని రిషిని అడుగుతుంది. రిషి రిజెక్ట్ చేసి వెళ్లిపోతాడు. ఇంతలో దేవయాని వచ్చి ఇలాంటివి చాలా జరుగుతాయి... చాలా చేయాలంటూ లోపలికి తీసుకెళ్తుంది. 

కారులో రిషి వెళ్తుంటాడు. వెనుకాలే దేవయాని, సాక్షి ఫాలో అవుతుంటారు. రిషి కారు బస్తీలో ఉన్న వసుధార ఇంటి వద్దకు వచ్చి ఆగుతుంది. రిషి వసుధార ఇంటిలోకి వెళ్తాడు. వెనుకాలే కారులో ఉన్న దేవయాని, సాక్షి ఫొటోలు తీస్తారు. అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోతారు. కారులో రిషి, వసుధార రెస్టారెంట్‌ వద్దకు వస్తారు. 

దేవయానికి జగతి రూమ్‌కు వస్తుంది. ఇద్దరి మధ్య వసుధార గురించి డిస్కషన్ నడుస్తుంది. వెళ్లిపోయిన వసుధార ఎక్కడ వస్తుందో అనే భయంతో సాక్షిని పిలిచి రిషి వెంటాడుతున్నారని జగతి చెబుతుంది. అంతే దేవయాని ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటీ నా వెంటపడుతున్నావా అని ఆరా తీస్తుంది దేవయాని. అలాంటిదేమీ లేదని చెబుతుంది జగతి. కచ్చితంగా మీరు చేసే పనులు అడ్డుకుంటానని దేవయాని శపథం చేస్తుంది. జగతి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతుంది. 

మళ్లీ రెస్టారెంట్‌ వద్ద వసుధార కోసం రిషి ఎదురు చూస్తుంటాడు. వసుధార వచ్చి కారులో రావాలంటే ఓ పని చేయాలని కండిషన్ పెడుతుంది. రిషి కూడా ఓకే చెప్తాడు. కారులో చెప్తానంటూ ఊరించి కారు ఎక్కుతుంది. ఇద్దరూ కలిసి బస్తీకి చేరుకుంటారు. వసుధార తన రూమ్‌కి వెళ్తుంది. కారులో రిషిని ఓ పది నిమిషాలు ఉండమని చెప్పి వెళ్తుంది. కట్‌చేస్తే ఇద్దరూ కలిసి భోజనం చేస్తుంటారు. వసుధార వడ్డిస్తుంది. వంటలు బాగున్నాయని చెప్పి వెళ్లిపోతాడు రిషి. 

రేపటి ఎపిసోడ్
ఇలా రిషి వచ్చి తిని వెళ్లడంపై బస్తీ వాసులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఆయన నీకు ఏమవుతారని వసుధారను నిలదీస్తారు. తర్వాత రోజు ఉదయాన్ని రిషి ఫోన్ చేస్తే మీకు ఏమీ పని లేదా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతుంది వసుధార. రిషి షాక్ అవుతాడు. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
Nuvvu leka Neanu Lenu Serial Today July 18th:రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
నువ్వులేక నేను లేను: రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
Illu Illalu Pillalu Serial Today July 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి వీడియో చూపించి నిజం చెప్పేసిన వల్లీ! ధీరజ్‌ని కత్తితో పొడిచేసిన రౌడీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి వీడియో చూపించి నిజం చెప్పేసిన వల్లీ! ధీరజ్‌ని కత్తితో పొడిచేసిన రౌడీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget