అన్వేషించండి

Guppedantha Manasu మే 31(ఈరోజు) ఎపిసోడ్: వసుధార ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని రిషి క్లాస్‌లోకి రానిస్తాడా?

అసలు ఏం జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్న జగతి.. పరిస్థితి చక్కదిద్దేందుకు ట్రై చేస్తుంది.. కానీ వసుధార మాత్రం అసలు విషయం తప్ప అన్నీ చెబుతుంది.

దేవయాని హ్యాపీనెస్‌ చూసి జగతి భయపడుతుంది. అదే టైంలో మహేంద్ర కూడా భయపడుతూనే ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో దేవయాని మహేంద్రను పిలుస్తుంది. 

కారులో తిరిగి వస్తున్న రిషి... వసుధారతో కలిసి తిరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకుంటాడు. ప్రేమ నిజం కాదన్న మాట పదే పదే మైండ్‌లోకి వస్తుంటుంది. 

మహేంద్రను పిలిచిన దేవయాని... కొడుకు గురించి బాధ్యత ఉండక్కర్లేదా అని ప్రశ్నిస్తుంది. ఇంటికి రిషి  రాలేదని కొంచెమైనా ఉందా అంటూ దెప్పిపొడుస్తుంది. పిల్లల్ని వదిలి వెళ్లిన వాళ్లకు పిల్లల గురించి ఏం తెలుస్తుందని వెటకారం చేస్తుంది. వీళ్ల మధ్య వాదన జరుగుతుండగానే రిషి కారు వస్తుంది. 

రిషికి ఎదురుగా ధరణి వెళ్తుంటే ఆగమని హెచ్చరిస్తుంది దేవయాని. రిషి చాలా డల్‌గా ఉండటం చూసి జగతిలో ఆందోళన మొదలవుతుంది. దేవయానికి కలిగించుకొని ఎక్కడికి వెళ్లావు అంటుంది. ఎందుకిలా డల్‌గా ఉన్నావంటూ ఆరా తీస్తుంది. వేరే వాళ్లను ఎవర్నీ మాట్లాడనివ్వదు. దేవయాని ఏదో మాట్లాడుతుంటే... కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయమంటాడు రిషి. మాట్లాడే ఓపిక లేదంటాడు. 

ఇక్కడ వసుధార కూడా తన రూమ్‌లో అదే మాదిరిగా కూర్చొని ఉంటుంది. రిషి ప్రేమ ప్రపోజల్ గుర్తు చేసుకుంటుంది. రిషి పరిస్థితి కూడా అలానే ఉంటుంది. సాక్షి నుంచి తప్పించుకోవడానికి ప్రేమ పుట్టిందన్న మాట రిషి మనసులు గాయపరుస్తుంది. 

ఐలవ్‌యూ ఎందుకు చెప్పారు... చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేది. హ్యాపీగా ఉండేవాళ్లం. చిలిపిగా మాట్లాడేవాళ్లం. గొడవ పడేవాళ్లం అని మనసులో అనుకుుంటుంది వసుధార. రిషి ఎలా ఉన్నాడో అనుకుటుంది. ఆయన ప్రేమను తిరిస్కరించానే తప్ప ఆయన్ని కాదు కదా. ఫోన్‌లో మాట్లాడుకోలేని కోపాలు ఏమున్నాయనుకుంటుంది. 

రిజెక్ట్‌ చేస్తావనుకోలేదు వసుధార. ఏం చేస్తుంటూ ఉంటుంది. నా గురించి ఆలోచిస్తుంటుందా... నా గురించి ఫీల్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు రిజెక్ట్ చేసిందో అడగాలా అంటూ ఫోన్ తీసి. మళ్లీ వద్దనుకుంటాడు. నాకేం పని నేను ఎందుకు అడగాలని అనుకుంటాడు. 

తనతో మాట్లాడుకోలేని కోపాలు లేవు కదా అని రిషికి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్‌ ను మహేంద్ర చూస్తాడు. పొగరు పేరు చూసి.. ఎవరూ అని అడుగుతాడు మహేంద్ర. రెండు నిమిషాలు మాట్లాడాలి అంటాడు మహేంద్ర. మాట్లాడటానికి ఏముందని ప్రశ్నిస్తాడు రిషి. ఎందుకు అలా ఉన్నావ్ అని ఆరా తీస్తాడు మహేంద్ర. ఇలా చూస్తుంటే ఏదోలా ఉందని అంటాడు. ఎక్కడకో వెళ్లి వచ్చావ్‌ తర్వాత ఇలా డల్‌గా కనిపిస్తున్నావ్‌... నీకేం తక్కువ అంటాడు. 

నాకేం తక్కువ డాడ్‌... నేను ప్రిన్స్ కదా... చిన్నప్పుడు తల్లి వదిలేసి వెళ్లింది... తర్వాత సాక్షి వదిలేసి వెళ్లింది.. ఇప్పుడేమో.. అంటు వసుధార సంగతి చెప్పబోతు ఆగిపోతాడు. 

ఏం జరిగిందో చెప్పాలని రిక్వస్ట్ చేస్తాడు మహేంద్ర. మన ఇద్దరం ఫ్రెండ్స్‌ కదా చెప్పమంటాడు మహేంద్ర. ఫ్రెండ్స్‌లా ఉంటాం కదా పదండి అంటు ఎక్కడికో తీసుకెళ్తాడు. 

ఇంతలో ఇదంతా విన్న జగతి.. ఏదో జరిగిందని అనుమాన పడుతుంది. వసుధారను కలిసి విషయం అడిగితే తప్ప అసలేం జరిగిందే తెలియదని నేరుగా వసుధార వద్దకు బయల్దేరుతుంది జగతి. 

తన రూమ్‌లో ఒంటరిగా ఉన్న వసుధార... అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తుంది. కాలేజీకి వెళ్లకుండా ఎందుకు రూమ్‌లో కూర్చోవాలని తనను తాను ప్రశ్నిస్తుంటుంది. కాలేజీకి వెళ్తాను... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానుంటుంది.

ఇక్కడ బార్‌లో మందు తాగడానికి రిషి రెడీ అవుతాడు. బార్‌కు తీసుకొచ్చి నా ముందే ఇలా మందు కొట్టడమేంటని మహేంద్ర ప్రశ్నిస్తాడు. కాస్త సైలెంట్‌గ ఉండమంటాడు రిషి. మందు పట్టుకున్నా కూడా రిషికి వసుధారే గుర్తుకు వస్తుంది. జెంటిల్‌మెన్‌ ప్రిన్స్‌... నేను చూడటం దీన్ని ఫొటో తీయాల్సిందేనంటూ ఫొటో తీస్తాడు మహేంద్ర. మందు కొడితే తప్పు లేదు... ఫొటో తీస్తే తప్పా అంటూ ప్రశ్నిస్తాడు మహేంద్ర. ఇందతా ఏంటని... ఇలా ఈ టైంలో మందు ఏంటి... నీ బాధ ఏంటి... నీవు చేస్తుంది తప్పంటాడు. బాధకు దూరంగా ఉండటం తప్పా అని అడుగుతాడు రిషి. 

ఇంతలో అక్కడ వసుధార ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందని తాగడానికి వచ్చారు. మీరు ఇంత బలహీనులా... ఇలాంటి వాళ్లు అనుకోలేదు.. మీరు జంటిల్‌మెన్‌ ప్రిన్స్ అనుకున్నాను.. అంటూ ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటన కూడా గుర్తుకు వస్తుంది. వెంటనే అక్కడి నుంచి బయల్దేరతాడు రిషి. మహేంద్ర ఏంటని అడిగితే... కొడుకు బార్‌కు తీసుకొస్తే రావడమేనా... తప్పని చెప్పడం తెలియదా అని మహేంద్రను తిరిగి కోప్పడి  అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. 

ఇక్కడ వసుధారను అడిగి మొత్తం విషయం తెలుసుకుంటుంది జగతి. ఇప్పుడు జగతి మేడంగా రాలేదని... రిషి తల్లిలా వచ్చానంటుంది. ఫోన్‌ చేస్తే పొడిపొడిగా మాట్లాడి పెట్టేశావ్‌. ఎగ్జామ్‌కు వెళ్లావు ఏం జరిగిందో తెలియదు. అక్కడ రిషి కూడా లేట్‌గా వచ్చాడు. డల్‌గా కనిపించాడు. రిషిని ఎప్పుడూ అలా చూడలేదు. నీ ఎగ్జామ్‌ సెంటర్‌కు వచ్చి ఉంటాడు. రిషి అక్కడ అలా ఉన్నాడు... నువ్వు కూడా ఫోన్ చేయవు అసలేం జరుగుతోందని గట్టిగా నిలదీస్తుంది..

రేపటి ఎపిసోడ్‌..
జగతి మేడంలా కాకుండా రిషి తల్లిలా అడుగుతున్నాను అసలు విషయం చెప్పమంటుంది. రిషిని ఎందుకు కాదన్నావో చెప్పమంటుంది జగతి. రిషి ప్రేమిస్తే నేనూ ప్రేమించాలా అంటూ అడుగుతుంది వసుధార. రిషి మనసును ముక్కలు చేశావు వసుధార అంటు గుక్కపెట్టి ఏడుస్తుంది జగతి. సీన్ కట్ చేస్తే క్లాస్‌లో రిషి ఉంటాడు.. వసుధార వస్తుంది. లోపలికి రావచ్చా అని అడుగుతుంది. బోర్డుపై లెక్కలు చెబుతున్న రిషి... బోర్డుపైనే తను రాస్తున్న చాక్‌ పీస్‌ను గట్టిగా కోపంతో నలిపేస్తాడు.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spadex : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సీ - 60 - జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం
Spadex : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సీ - 60 - జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం
Andhra Pradesh Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
CM Chandrababu: ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం, ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం, ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Spadex : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సీ - 60 - జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం
Spadex : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సీ - 60 - జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం
Andhra Pradesh Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
CM Chandrababu: ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం, ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం, ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Embed widget