అన్వేషించండి

Guppedantha Manasu June 3rd (ఈరోజు) ఎపిసోడ్: అడ్డంగా బుక్కైన వసుధార- పుస్తకంలో రాసిన ప్రేమ సంగతులు చూసేసిన రిషి

మళ్లీ రిషి, వసుధార మధ్య లవ్ ట్రాక్ మెల్లిగా పట్టాలెక్కుతోంది. ధ్వేషం ప్రేమగా మారినట్టే కనిపిస్తోంది.

ప్రేమను ఎందుకు రిజెక్ట్‌ చేశావని గౌతమ్‌ అడిగిన ప్రశ్నకు మరింత కఠినంగా చెబుతుంది వసుధార. రిషి స్థానంలో ఉండి ఆలోచించాలని రిక్వస్ట్ చేస్తాడు గౌతమ్. అయినా వసుధార వినిపించుకోదు. తన వెర్షన్‌లో తాను చెప్పుకుంటూ వెళ్లిపోతుంది. ఇదంతా వింటున్న రిషి వెళ్లి పోతున్న టైంలో... ఫోన్ మోగుతుంది. 

అప్పుడు గానీ రిషి అక్కడ ఉన్నాడన్న సంగతి గౌతమ్, వసుధారకు తెలియదు. రిషిని పిలుస్తూ గౌతమ్ వెళ్లిపోతాడు. అర్థం కాన పరిస్థతిలో ఉండిపోతుంది. 

వసుధారను మర్చిపోలేని రిషి... తన రూమ్‌లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఆ రుమ్‌కు జగతి వస్తుంది. మాట్లాడాలని చెబుతుంది. ఈ టైంలో నా దగ్గరకు వచ్చారంటే... మీరు ఏం మాట్లాడతారో నేను ఊహించగలను అంటాడు రిషి. మీ శిష్యురాలిని కలిసి ఉంటారు కదా అంటాడు. అయినా ఇంకా మాట్లాడటానికి ఏముందని... ఏం జరిగిందో చెప్పి ఉంటుంది... మీరు వినే ఉంటారు... మరి నా దగ్గరకు ఎందుకు వచ్చారు.. ఏం జరిగిందో నా నోటి వెంట వినాలనా? 

వసుధార ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అంటు జగతి చెబుతుండగానే... అయిపోయింది మేడం... అంటూ గట్టిగా అంటాడు రిషి. జరగాల్సిందేదో జరిగింది.. దాని గురించి వివరణలు విశ్లేషణలు అవసరం లేదంటాడు. మీరు ఎవరికీ వీళ్లు మంచి వాళ్లు వీళ్లు చెడ్డవాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు అంటాడు. నేను రిజెక్ట్ అవ్వడానికే పుట్టానని అంటాడు. ఏంటి సార్ అలా అంటున్నారు అంటుంది జగతి. మీకు ఇంకా అర్థం కావడం లేదు... చిన్నప్పుడు మీరు నన్ను రిజెక్ట్ చేసి వెళ్లిపోయారు. అందులో నా తప్పేంటో నాకు తెలియదు. మధ్యలో సాక్షి వచ్చింది. తన ప్రయార్టీ నేను కాదని.. అసలు విషయం చెప్పేసింది. ఇప్పుడు వసుధార వంతు వచ్చింది అని అంటాడు. ఇంత జరిగాక నాతో మాట్లాడటానికి ఏముందని ప్రశ్నిస్తాడు. మీరే కాద... వసుధారను ప్రేమిస్తున్నావ్‌... అని పోరు పెట్టారంటాడు. నేను ఏం ఆలోచిస్తున్నానో... ఏం చేస్తున్నానో.. అంచనా వేయగలిగినా మీరు వసుధార మనసులో ఏముందో అంచనా వేయలేకపోయారా అని నిలదీస్తాడు. అంతా తెలిసి నన్ను ఓదర్చడానికి వచ్చారా... లేకా దీన్ని అవకాశంగా తీసుకొని దూరమైన బంధాన్ని దగ్గర చేయడానికి వచ్చారా అని మాట్లాడతాడు రిషి. 
ఆరోజు నీ మనసులో వసుధార పై ప్రేమ ఉందో లేదో తెలియదు... కానీ వసుధారపై ప్రేమ పుట్టడానికి నీకు టైం పట్టింది. ప్రేమ భూమిలో విత్తనం లాంటింది.. అది మనసులో మొలకెత్తే వరకు తెలియదు.. ఆ రోజు నువ్వు తెలుసుకోలేదు... ఇవాళ తెలుసుకున్నావ్‌.. వసుధార కూడా అంతే... 

వదిలేయండి మేడం... ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. నేను ఓ మాట అన్నాను.. తను నో చెప్పింది అయిపోయింది. నేను బాధపడుతున్నాను అనుకోవాల్సిన అవసరం లేదు. నాకేం బాధ లేదు. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. కన్న తల్లే కాదని వెళ్లిపోయినప్పుడు బతికాను... కట్టుకోవాలనుకున్నది కాదన్నప్పుడూ బతికాను.. కోరుకున్నది రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనా.... అలవాటైపోయింది మేడం. మీరేం నా వైపు దీనంగా జాలిగా చూస్తూ జీవితం అంటే ఇంతే రిషి గుండెను రాయి చేసుకోవాలి... చెప్పి నన్ను ఓదార్చాల్సిన పనిలేదు. వెళ్లోపోండి మేడం... ఈ మనసుకు బాధ మోస్తూ బతకడం అలవాటైపోయింది. నా కన్న తల్లి  ఏమి ఇచ్చిందో తెలియదు కానీ... బాధను మోస్తూ బతకడం అలవాటు చేసింది. ఇది నాకు నా తల్లి ఇచ్చిన గొప్ప వరం... నేను దర్జాగా బతికేస్తాను మేడం. రిషీంద్ర భూషణ... దేన్నైనా తట్టుకోగలడు. ఈ విషయం గురించి మీరు అనవసరంగా బాధపడి మీ టైం వేస్ట్ చేసువద్దు. నన్ను ప్రేమించడాలు... ఇష్ట పడటాలు లేకుండానే బతికాను.. పుట్టినప్పటి నుంచి ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్‌లో రిజెస్ట్ చేస్తూ వెళ్లారు. అవన్నీ ఫేస్ చేసీ చేసీ అలవాటైపోయింది. సంధి చేయడాలు సర్ది చెప్పడాలు... రిషీ... వసుధార మనసులో ఇంకా నువ్వే ఉన్నావని చెప్పడానికి  ప్రయత్నం చేయకండీ. వీలైతే నన్ను ధ్వేషించండీ.. కానీ సానుభూతి మాత్రం చూపించకండీ.. థాంక్యూ మేడం అని చెప్పేస్తాడు రిషి. 

తన రూమ్‌లో రిషి గురించీ ఆలోచిస్తూ దీనంగా కూర్చొని ఉంటుంది వసుధార. రిషి, జగతి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. రిషి సార్ ఫోన్ చేయడం లేదని అనుకుంటుంది. నాపై కోపం ఉంటే తిట్టడానికైనా ఫోన్ చేయవచ్చు కదా అనుకుంటుంది. మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పారు... నా మసులో ఉన్న మాట నేను చెప్పాను.. అంతకే మన మధ్య ఉన్న అనుబంధం పోతుందా అని అనుకుంటుంది.. 

ఇక్కడ రిషి కూడా అదే ఫీలింగ్. సారీ సార్‌.. అని ఫోన్ చేయవచ్చు. ఈ పొగరు ఏం చేస్తుంటుందీ... అని అనుకుంటాడు. నాకు నో చెప్పి హాయిగా ఉందా... నో చెప్పానన్న బాధ లేదా.. నేను ఒక్కడినే బాధ పడాలా... మేడం అన్నట్టు వసుధార మనసులో ఏముంది అని అనుకొని వసుధార ఫొటో చూస్తూ ఆలోచిస్తాడు. 
 వద్దు వద్దనుకుంటూనే... ఫోన్ చేస్తాడు.. ఫోన్ చూసి ఆనందంలో మునిగిపోతుంది వసుధార. వెంటనే ఫోన్ కట్ అవుతుంది. తెలియకుండానే ఫోన్ వెళ్లిందని అంటాడు... 
రిషి సార్ కాల్ కట్ చేశారేంటి.. అంటే నేను కాల్ చేయాలా.. సార్ మిస్డ్‌ కాల్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు కాల్ చేయకూడదు అంటుంది. కాల్ చేస్తుంది. 

కాల్ రావడం చూసి... ఏం మాట్లాడాలో అర్థం కాక... కాల్‌ను లిఫ్ట్ చేయడు. కట్ చేస్తాడు. అన్నింటినీ తను మర్చిపోయినా నేను మర్చిపోలేనంటాడు. మిస్డ్ కాల్ ఇచ్చి కట్‌ చేయడం ఏంటని అనుకుంటుంది. 

అనుకోకుండా... కాల్ వచ్చిందని... కాల్ చేయాలని చేయలేదని మెసేజ్ చేస్తాడు. దాన్ని చదివిన వసుధార.. రిషీ సార్‌కు ఇంకా కోపం పోలేదని అనుకుంటుంది.. 

ఉదయం కాలేజీకీ ఆటోలో వెళ్తూ...రిషి గురించి ఆలోచిస్తుంటుంది. ఎలా ఉన్నారో.. ఏ మూడ్‌లో ఉన్నారో అంటుంది. 

కారులో వెళ్తూ.. ఎదురుగా వెళ్తున్న ఆటోలో చున్నీ బయటకు వేలాడుతుంటే... జాగ్రత్త చెప్పబోతాడు. అది వసుధార అని తెలిసి... ఆటో డ్రైవర్‌కు చెప్పి వెళ్లిపోతాడు. వసుధార పిలుస్తున్నా పట్టించుకోడు. 

కాలేజీకి వెళ్లినప్పుడు పుష్ప ఎదురు పడుతుంది. ఇవాళ ఫస్ట్ క్లాస్ నేనే తీసుకుంటానని.. వసుధార వద్ద నోట్స్ తీసుకొని టేబుల్‌పై పెట్టమంటాడు రిషి. నేను వచ్చేలోపు టేబుల్‌పై నోట్స్ ఉండాలని వార్నింగ్ ఇస్తాడు రిషి. 

ఇదంతా చూస్తున్న జగతి... వసుధారను రిషి దూరం పెడుతున్నాడని గ్రహిస్తుంది. ఎప్పుడు పాత రిషి, పాత వసుధార అవుతారో అనుకుంటుంది. 

రేపటి భాగం...
రిషి మనసులో ఇంకా నువ్వే ఉన్నావని... వసుధారను వెళ్లిపోమంటుంది సాక్షి. అది నీ సమస్యని... ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పేసి వెళ్లిపోతుంది వసుధార. రిషి క్లాస్‌కు వచ్చేసరికి వసుధార నోట్స్ టేబుల్‌పై ఉంటుంది. అందులో ఏదో పెట్టేసి మర్చిపోయిన వసుధార టెన్షన్ పడుతుంది. పక్కనే ఉన్న ఫ్రెండ్ పుష్ప అందులో ఏముంది ఎందుకంత టెన్షన్ అని అడుగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget