Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'
Guppedantha Manasu Update: చనిపోయాడు అనుకున్న రిషి వచ్చేస్తున్నాడు...గుప్పెడంతమనసు సీరియల్ లో కీలక మలులు ఇదే...
Guppedantha Manasu Update: గుప్పెడంతమనసు సీరియల్ కి ఫస్ట్ ప్లస్ పాయింట్ రిషి(Mukesh Gowda). కాలేజీ ఎండీ, యాంగ్రీ యంగ్ మెన్, ప్రిన్స్, జెంటిల్మెన్, సీరియస్ సింహం ఇలా..సీరియల్ లోనూ బయటా రిషికి చాలా మంచి చాలాపేర్లు పెట్టారు. డిగ్నిఫైడ్ పాత్రలో అదరగొడుతున్నాడు కన్నడ కుర్రాడు. సీరియల్ ప్రారంభం నుంచి అద్భుతంగా సాగినా ఈ మధ్య ట్రాక్ తప్పింది,సాగదీత పెరుగుతోందనే అభిప్రాయాలొచ్చాయి. రిషి పెద్దమ్మ దేవయాని కొడుకు శైలేంద్ర ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారిందనుకున్నా మళ్లీ నస పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి టైమ్ లో రిషిపై హత్యాప్రయత్నం చేయించాడు శైలేంద్ర. రిషిని రౌడీలో కత్తితో పొడవడంతో చనిపోయినట్టుగా చూపించారు. అంతేకాదు.. డాక్టర్లు రిషిని బతికించడానికి ప్రయత్నించి చివరి నిమిషంలో చేతులెత్తేసినట్టు చూపించారు. ఆ తర్వాత ఏమైందో చూపించలేదు. రిషితో పాటు వసుధార తల్లిని కూడా చంపేశారు. ఇదంతా నిజమా కలా అనుకునేలోగా మూడేళ్ల తర్వాత అంటూ సీరియల్ ను ముందుకు నడిపించారు.
Also Read: కేడీ బ్యాచ్ పనిపట్టేందుకు సిద్ధమైన వసు, ఫస్ట్ టైమ్ శైలేంద్రకి వార్నింగ్ ఇచ్చిన దేవయాని!
మూడేళ్ల తర్వాత కూడా కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర పట్టు అలాగే సాగుతోంది..దేవయాని కోపం తగ్గలేదు...మహేంద్ర జగతితో మాట్లాడడం లేదు. ధరణి అదే వంటగదిలో మగ్గిపోతోంది. రిషిని చనిపోయాడన్న విషయం శైలేంద్రకు మాత్రమే తెలుసు. అయితే జగతి మాత్రం రిషి వస్తాడన్న నమ్మకంతో ఉంది. మరోవైపు వసుధార కాలేజీలో లెక్చరర్ గా చేరింది..రిషి సార్ కి తనపై కోపం ఎప్పటికీ పోదని ఫిక్సైపోయింది. కూతురు బాధను చూడలేకపోయిన రిషి తండ్రి.. ‘అమ్మా వసూ.. నీ ముఖంలో సంతోషం చూసి ఎన్నేళ్లు అయ్యిందో తెలుసా?’ అని అంటాడు. ఆ మాటతో వసుధార.. ‘ఇంకెప్పుడూ చూడలేరు నాన్నా.. తను లేని జీవితం ఇలాగే ఉంటుంది నాన్నా’ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది . మరోవైపు దేవయాని కూడా రిషి ఎక్కడోచోట ఉన్నాడులే అనుకుంటుంది కానీ శైలేంద్ర హత్యాప్రయత్నం చేసినట్టు తెలియదు. ఇలాంటి టైమ్ లో రిషి రీఎంట్రీ ఉండబోతోంది.
Also Read: ఎక్కడున్నారు రిషి సార్, కాలేజీలో వసుకి అవమానం- జగతిని హెచ్చరించిన ధరణి!
జైల్లోంచి రిషి రీఎంట్రీ
రిషి జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. తాజా ప్రోమోలో హింట్ ఇచ్చారు. అయితే రిషి జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. రిషి చావుబతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు కూడా ఏమీ చేయలేం అని చేతులెత్తేశారు. ఇంతకీ అప్పుడేమైంది. వసుధార కూడా బ్రాస్ లెట్ చూసి రిషిని గుర్తుపట్టింది. ఇంతకీ వసుధార అప్పుడు చూసిందా లేదా..మూడేళ్ల పాటూ రిషి ఎక్కడున్నాడు, ఏం చేశాడు, బతికి ఉన్నట్టు శైలేంద్రకి తెలియలేదా..ఇంతకీ రిషి ఏం నేరం చేసి జైలుకెళ్లాడో తెలియాలంటే ఆగాలి మరి. మొత్తంగా చూస్తుంటే గుప్పెడంతమనసు మరింత ఆసక్తిగా మారేట్టే ఉంది.
రీసెంట్ ఎపిసోడ్ లో కాలేజీ ఎండీ సీటుకోసం మహేంద్రని చంపేసి జగతి అడ్డుతప్పించుకోవాలని చూస్తాడు శైలేంద్ర. అయితే అందుకు అంగీకరించదు దేవయాని. ఎన్ని ఘోరాలు చేసినా జగతి ఎదురుతిరగకపోవడానికి కారణం మహేంద్ర...అతడి అడ్డు తొలిగిపోతే ఆమె పులిగా మారిపోతుందని ఆపడం మన తరం కాదని శైలేంద్రకు హితబోధ చేస్తుంది . మహేంద్రకు ఏదైనా ఆపద తలపడితే తండ్రి కూడా గుండె ఆగి చచ్చిపోతాడు. మనకు కావాల్సింది వెయిట్ చేసి తీసుకుందాం..తొందరపడి పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. అయినా రిషి వస్తాడంటావా అని దేవయాని అంటే... వాడు ఉంటే కదా తీసుకురావడానికి అని మనసులో అనుకుంటాడు...కానీ ఇప్పుడు రిషి ఎంట్రీ ప్రోమో...సీరియల్ పై ఆసక్తిని పెంచింది...