Guppedanta Manasu Serial Today January 15Th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: రిషిని వెతుక్కుంటూ చక్రపాణి ఇంటికెళ్లిన శైలేంద్ర – కాలేజీలో రిషి చనిపోయాడని న్యూస్ వైరల్
Guppedanta Manasu Today Episode: రిషిని వెతుక్కుంటూ చక్రపాణి ఇంటికి శైలేంద్ర వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: రిషిని తన తండ్రి చక్రపాణి ఇంట్లోనే వసుధార దాచిపెట్టిందని శైలేంద్ర అనుమానపడతాడు. చక్రపాణి ఇంటికి వెళ్లిన శైలేంద్రను గుమ్మంలోనే ఆపేస్తుంది వసుధార. ఇంట్లోకి రానివ్వదు. అడ్డుతప్పుకోమని వసుధారకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. అయినా వసుధార వినకపోవడంతో ఆమెను తోసేసి లోపలికి వస్తాడు శైలేంద్ర. రిషి కోసం ఇంట్లోని అన్ని రూమ్‌లు వెతుకుతాడు. కానీ అతడికి రిషి ఎక్కడ కనిపించడు. దీంతో శైలేంద్ర షాకవుతాడు.
శైలేంద్ర: ఏయ్ రిషి ఇక్కడ లేక అక్కడ ముసలివాళ్ల దగ్గర లేక ఎక్కడికెళ్లాడు. ఎక్కడ దాచిపెట్టావు వసుధార చెప్పు. నువ్వు భలే తెలివిగల దానికి ఎక్కడున్నాడు వాడు.
వసుధార: నాకు తెలియదని చెప్తున్నాను కదా?
శైలేంద్ర: అవును ఇంతకీ మీ నాన్నగారేరి?
రిషితో పాటు వసుధార తండ్రి చక్రపాణి కూడా కనిపించకపోవడంతో నేను ఏమైనా చేస్తానని ఇద్దరిని దాచిపెట్టావా అని వసుధారను అడుగుతాడు శైలేంద్ర. నీ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ రాబట్టాలో నాకు తెలుసు. నా దగ్గర ఒక ప్లాన్ కాకపోతే మరో ప్లాన్ ఉంది అని వసుధారకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. కానీ శైలేంద్ర బెదిరింపులకు వసుధార భయపడదు. వచ్చిన దారినే వెళ్లమని, ఇలాంటివి చాలా చూశానని అతడితో అంటుంది. నువ్వు వస్తావని నాకు ముందుగానే తెలుసు...అందుకే రిషిని దాచాల్సిన చోటే దాచిపెట్టానని మనసులో అనుకుంటుంది వసుధార.
ఇంతలో వసుధారకు ఫోన్ చేస్తాడు మహేంద్ర. శైలేంద్ర ఇంటికొచ్చిన విషయం అతడికి చెబుతుంది వసుధార. ఆ మాట వినగానే మహేంద్ర, అనుపమ షాకవుతారు. శైలేంద్ర ఇక్కడికి వస్తాడని తాను ముందుగానే ఊహించానని, అందుకే రిషిని సీక్రెట్ ప్లేస్‌లో దాచిపెట్టానని మహేంద్రకు చెప్తుంది వసుధార. రిషిని ఎక్కడ దాచిపెట్టావని వసుధారను అడుగుతాడు మహేంద్ర. డైరెక్ట్‌గా కలిసినప్పుడు అన్ని విషయాలు చెబుతానని మహేంద్రతో అంటుంది వసుధార. రిషికి పెద్దయ్య ఇంట్లో వైద్యం చేస్తుంటారు. బయట చక్రపాణి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వసుధార లోపలి నుంచి బయటకు వస్తుంది.
చక్రపాణి: అమ్మా అల్లుడు గారు
వసుధార: వైద్యం చేస్తున్నారు నాన్నా..
చక్రపాణి: వైద్యం చేయడానికైతే ఇక్కడికి తీసుకొచ్చావు బాగానే ఉంది. కానీ అల్లుడు గారిని ఇక్కడే ఉంచితే ఎలా అమ్మా? వైద్యం అయిపోయిన తర్వాత మన ఇంటికి తీసుకెళ్లిపోదాం.
వసుధార: వద్దు నాన్నా ఆయన్ని ఇక్కడే ఉంచుదాం..
చక్రపాణి: మన ఇంట్లో సేఫ్ గానే ఉన్నారు కదమ్మా.. ఇంక ప్రాబ్లమ్ ఎంటి? అల్లుడు గారు మన ఇంట్లోనే ఉన్నారన్న అనుమానం ఎవ్వరికీ రాకుండా చూసుకుంటున్నాము కదా
వసుధార: అవును నాన్న ఆయన అక్కడ సేఫ్ గానే ఉన్నారు. కాదనట్లేదు. కానీ ప్రమాదం వచ్చినప్పుడు మనం కాపాడుకోవడం వేరు. అసలు ప్రమాదం రాకుండా చూసుకోవడం వేరు.
అనగానే రిషి కోసం శైలేంద్ర ఇప్పటికే ఇక్కడికి వచ్చాడని, అతడు మళ్లీ వచ్చే అవకాశం ఉందని చక్రపాణి అనుమానం వ్యక్తం చేస్తాడు. ఒకసారి వచ్చాడు కాబట్టే మళ్లీ రాడని, రిషి ఇక్కడ ఉన్నాడని అతడికి అనుమానం కూడా రాదని తండ్రికి చెబుతుంది వసుధార. ఇక్కడైతేనే రిషి సార్ త్వరగా కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది అందుకే మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చానని చెప్తుంది. ఆ దేవుడి దయవల్ల అల్లుడు గారు మామూలు మనిషి అవుతారు అంటాడు చక్రపాణి. అల్లుడు గారిని నేను చూసుకుంటాను. నువ్వు నీ కాలేజీ పనులు చూసుకోమని చెప్తాడు చక్రపాణి.
మరోవైపు వసుధార క్యాబిన్‌లోకి వెళ్లిన శైలేంద్ర. ఎండీ సీట్‌ను చూస్తూ కోపంతో రగిలిపోతాడు. నువ్వు స్పెషల్ కుర్చీవి...ఆ స్థానం వేరు..ఆ పొజిషన్ వేరు.. ఆ అధికారం వేరు.. అందులో కుర్చుంటే వచ్చే హుందాతనమే వేరు అని మనసులో అనుకుంటాడు. తన కాలేజీలో చదివే స్టూడెంట్‌ను పిలుస్తాడు శైలేంద్ర. తాను చెప్పిన పనిచేస్తే చాలా డబ్బు ఇస్తానని అంటాడు. ఆ స్టూడెంట్‌కు స్పోర్ట్స్ బైక్ ఇష్టమని గ్రహించి అది కొనిస్తానని ఆశపెడతాడు.
రిషి, వసుధార కాలేజీకి ఎందుకు రావడం లేదో తెలుసా అని ఆ స్టూడెంట్‌ను అడుగుతాడు శైలేంద్ర. తనకు తెలియదని అతడు చెబుతాడు. రిషి చనిపోయాడని ఆ స్టూడెంట్‌తో అబద్ధం ఆడుతాడు శైలేంద్ర. రిషి చనిపోయిన బాధలో వసుధార కూడా కాలేజీకి రావడం లేదని అంటాడు. రిషి చనిపోయిన విషయం కాలేజీ మొత్తానికి తెలిసేలా చేస్తే నువ్వు కోరినంత డబ్బు ఇస్తానని స్టూడెంట్‌లో ఆశలు రేకెత్తిస్తాడు. శైలేంద్ర చెప్పినట్లే ఆ స్టూడెంట్ చేస్తానంటాడు.
రిషి చనిపోయినట్లుగా ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు శైలేంద్ర. అది చూసి స్టూడెంట్స్, లెక్చరర్స్ నిజంగానే రిషి చనిపోయాడని అనుకుంటారు. రిషిని చూడాలని పట్టుపడతారు. తమకు ఇప్పుడే రిషిని చూపించాలని మహేంద్ర, ఫణీంద్రలను కోరుతారు అసలు క్లాస్‌లు జరగడం లేదని, ఇప్పటివరకు సిలబస్ కంప్లీట్ కాలేదని ఇద్దరిపై మండిపడతారు. రిషి ఎక్కడున్నాడో మాకు ఇప్పుడే తెలియాలని అంటారు. వసుధారపై స్టూడెంట్స్, లెక్చరర్స్ ఫైర్ కావడంతో తన ప్లాన్ వర్కవుట్ అవుతుందని శైలేంద్ర ఆనందపడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: సినీ తారల సంక్రాంతి సందడి.. భోగి సంబరాల్లో జక్కన్న, ఎన్టీఆర్, వెంకీ మామ